బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు తెలిసిందే. అలా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు ‘నోస్ట్రాడమస్’. 465 సంవత్సరాల క్రితమే వేల అంచనాలతో ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆయన చెప్పినవాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. అలాంటి జ్యోతిషుడే చైనాలోనూ ఉన్నాడు. ఆయన పేరు లియూ బోవెన్. ‘ద టెన్ వర్రీస్’ అనే పేరుతో ఉన్న కవితలో ఆయన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ముందే లిఖించాడు.
అందులో కరోనా పుట్టుకను, అంతాన్ని కూడా ఆయన అంచనా వేశారు. అది కచ్చితంగా కరోనా అనేఎలా చెప్పగలరంటే... ర్యాట్, క్యాట్ ఇయర్స్ మధ్య కాలంలో భయంకరమైన విపత్తు వస్తుందని, అది డ్రాగన్, స్నేక్ ఇయర్స్ మధ్యకాలంలో అంతమైపోతుందని ఆ కవితలో పేర్కొన్నాడు. చైనీస్ జొడియాక్ సంవత్సరాల ప్రకారం ర్యాట్ ఇయర్ 2019 ఫిబ్రవరిన మొదలైంది. పిగ్ ఇయర్ 2020 జనవరి 25న ప్రారంభమైంది. ఈ రెండేళ్ల మధ్య పుట్టిన విపత్తు... కరోనా వైరసే. చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబరు 1న తొలి కేసును గుర్తించారు. అది ఆయన చెప్పిన రెండేళ్ల మధ్య కాలమే.
ఇక కరోనా అంతమైపోతుందని ఆయన చెప్పిన సంవత్సరాలు... డ్రాగన్ 2024లో ప్రారంభమవుతుండగా, స్నేక్ 2025లో మొదలవుతోంది. ఈ మధ్య కాలంలోనే పూర్తిగా కరోనా నశిస్తుందని పేర్కొన్నాడు. ఆయన చెప్పిందే నిజమవుతోందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. ఉండవు కూడా. అయితే ఆ కవిత బోవెన్ రాసినట్టు ఆధారాలు కూడా ఏమీ లేవన్న విమర్శ కూడా ఉంది.
చదవండి: చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత
ఎవరో చక్రవర్తి ఆయన కాలంలో సంభవించిన ప్రకృతి విపత్తులనుంచి రక్షించుకోవడానికి ఇలా రాసి, అది బోవెన్ రాసినట్టుగా చెప్పి ఉంటారనీ నమ్మేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా నిజానికి... కరోనా ఎప్పుడు అంతమవుతుంది? అసలు పోతుందా? లేదా అనేది కాలానికే తెలియాలి. అయినప్పటికీ, ఇలా మన చేతుల్లో లేని విషయాల గురించి వేరెవరో ఊహించింది చదవడానికి, వినడానికి బాగుంటుంది కదా! అలాంటిదే ఇది.
Comments
Please login to add a commentAdd a comment