predict
-
భూకంపాలను పసిగట్టేలా..
భూకంపం ఎలా వస్తుంది..? ఎప్పుడు వస్తుంది..? ఎందుకు వస్తుంది..? ఎంత తీవ్రతతో వస్తుంది..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయినా కచ్చితమైన ఫలితం రాలేదు. అతి కొద్ది దేశాల్లో 30 నుంచి 40 సెకన్లు మాత్రమే ముందుగా చెప్పే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో అయితే అటువంటిది కూడా లేదు. అయితే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను వాతావరణ శాఖ ముందుగా గుర్తించి ఎలా సమాచారం అందిస్తుందో అదే తరహాలో భూకంపాలను అంచనా వేసే టెక్నాలజీపై ఏలూరు నగరానికి చెందిన ఇంజనీర్ సాగించిన పరిశోధన తుది అంకానికి చేరుకుంది. – సాక్షి ప్రతినిధి, ఏలూరుభూకంపాలు ఎలా వస్తాయంటే..భూమి లోపల కోర్, మాంటేల్, క్రస్ట్ అనే మూడు ప్రధాన పొరల్లో గణనీయమైన మార్పులతో భూకంపాలు సంభవిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున రిక్టర్ స్కేల్‌పై 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువగా 6 నుంచి 18 వరకు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో భూకంపాలను జోన్లుగా విభజించారు. జోన్–2లో హైదరాబాద్, దక్కన్ ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ సగటున 5 మ్యాగ్నిట్యూడ్ నమోదుకు అవకాశం ఉంది. జోన్–3లో కోస్టల్ ప్రాంతం, గోదావరి, తెలంగాణలో కొంత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ 6 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదుకు అవకాశముంది.జోన్–4లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. ఇక్కడ 7 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదుకు అవకాశముంది. హిమాలయాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో 7 నుంచి 9 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదవుతుంది. జోన్–5లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 9 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 6 నుంచి 9 వరకు మ్యాగ్నిట్యూడ్‌ల వరకు ఉంటే ఆస్తి, ప్రాణనష్టాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దీనిపై మన దేశంలో నేషనల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తోంది.శివ ఆవిష్కరణ ఇలా...భూకంపం సమయం, ప్రదేశం, తీవ్రతను వారం నుంచి నెల రోజుల పాటు ముందస్తుగా అంచనా వేసేందుకు శివ సీతారామ్ 19 ఏళ్లు విస్తృతంగా రీసెర్చ్ చేసి ఫలితాన్ని తుది దశకు తీసుకొచ్చారు. ఇలా ముందస్తు అంచనాలతో సిద్ధం చేసిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రత ఉండే భూకంపాలు రావడానికి ముందు 3 నుంచి 6 నెలల పాటు భూమి లోపల పొరల్లో వివిధ రకాల సంకేతాలు అందుతుంటాయి.దాని ప్రభావం 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనినిబట్టి ప్రదేశం, సమయం, తీవ్రతలో కచ్చితత్వాన్ని అంచనా వేయగలిగితే ఆస్తి, ప్రాణ నష్టం నివారించవచ్చు. దీనిపైనే శివ రీసెర్చ్ చేసి సూక్ష్మ స్థాయి మార్పులు భూకంప కేంద్రం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయని గుర్తించారు. వీటిని కొన్ని పద్ధతుల్లో నిర్మిరామంగా పర్యవేక్షించి అంచనా వేస్తున్నారు. జనవరిలో టిబెట్‌లో (7.1), 2024 జనవరిలో జపాన్‌లో (7.6), 2023 నవంబరులో నేపాల్‌లో (6.3) సంభవించిన భూకంపాల డేటాతో పాటు సుమారు 20 చోట్ల జరిగిన నష్టం తీవ్రత పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు.గతంలో భూకంపాలు ఇలా.. 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో 2.50 లక్షల మంది, 2005 అక్టోబర్ 8న జమ్మూకశ్మీర్‌లో వచ్చిన భూకంపానికి 80 వేల మంది మృత్యువాతపడ్డారు. సునామీ తీవ్రతతో రాష్ట్రంలో 612 మైళ్ల సముద్ర తీరంలో కొంత నష్టం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో దేశంలో 2004లో సునామీ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో సెన్సార్ల ద్వారా ముందుగానే తెలుసుకుని శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ అందిస్తున్నారు. సునామీ అలలు గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. అండమాన్, నికోబార్‌లో పెద్ద భూకంపాలు వస్తే గంటన్నరలోపు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని తాకుతాయి.మరింత అభివృద్ధి చేస్తా: శివ సీతారామ్నా వద్ద ఉన్న తక్కువ సామర్థ్యం పరికరాలతోనే అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో పరిధి మరింత పెంచుకోవడానికి ప్రయతి్నంచి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నాం. దీంతో 50 పైగా దేశాల భూకంపాల డేటాను పరిశీలించి సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తా. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆ దిశగా నా ప్రాజెక్టు సాగుతోంది.ప్రయోగాలు.. తుది దశకు.. 19 ఏళ్లుగా పరిశోధనలు.. ఈ క్రమంలో అనేక అవాంతరాలు, అవరోధాలు..! వీటిని దాటుకుని భూకంపాలను ముందస్తుగా అంటే కనీసం వారం నుంచి నెల రోజుల ముందు గుర్తించే సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేశారు ఏలూరుకు చెందిన మరడాని శివ సీతారామ్. ఆరేళ్లుగా భూకంపాలకు సదడంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డేటాను సేకరించిన ఆయన.. ప్రస్తుతం తుది దశ పరీక్షల్లో ఉన్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఏడున్నరేళ్లు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్ వర్కింగ్‌పై పనిచేసిన శివ.. హైదరాబాద్ కేంద్రంగా భూకంపాలపై పరిశోధనను కొనసాగిస్తున్నారు.2004లో భూకంపాలు, సునామీలను గుర్తించడం ఎలా అనేదానిపై పరిశోధన ప్రారంభించి సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఆరేళ్ల నుంచి ట్విట్టర్ www.seismo.in వెబ్సైట్లో ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్ ఇథియోపియా, ఆప్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్, ఇండియా భూకంపాలకు సంబంధించిన సమగ్ర డేటాను పొందుపరిచారు. 2004 నుంచి 300కు పైగా భూకంపాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించారు. 2020 నుంచి పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు.20 రకాల పద్ధతులతో ముందస్తు అంచనాప్రపంచవ్యాప్తంగా 20 రకాల పద్ధతుల్లో భూకంపాలను అంచనా వేస్తున్నారు. టెక్నాలజీలో అభివృద్ధి చెందిన జపాన్, తైవాన్, మెక్సికో, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు భూమిలో అమర్చిన సెన్సార్ ద్వారా 30 నుంచి 40 సెకన్ల ముందు పసిగట్టే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి. -
17 రాష్ట్రాల్లో దంచికొట్టుడు వానలు
దేశం అంతటా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.బీహార్, హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జూలై 12-14 మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ వర్ష సూచనను అందిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో జులై 11-13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, తూర్పు రాజస్థాన్ సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మండీ, కాంగ్రా, కిన్నౌర్, కులు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 32 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 16 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అసోంలోని 26 జిల్లాల్లో 17 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా తొమ్మిది ఖడ్గమృగాలు సహా మొత్తం 159 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. -
బ్రిటన్ ఒపీనియన్ పోల్స్.. ప్రధాని రిషి సునాక్ ఓటమి?
బ్రిటన్‌లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్‌లో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఘోరంగా ఓడిపోతారని మరో సర్వే అంచనా వేసింది. జూలై 4న జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటివరకూ మూడు సర్వేలు వెల్లడించాయి.తాజా సర్వేలో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్ల మేరకు తగ్గి 21 శాతానికి చేరుకుంది. జూన్ 12- జూన్ 14 మధ్య ఈ సర్వేను మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత ‘సండే టెలిగ్రాఫ్’ కోసం నిర్వహించింది. కొంతమేరకు ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు రెండూ తమ మ్యానిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి.కాగా మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఈ సర్వేలో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇది 200 సంవత్సరాల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది.బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వేలో ప్రధాని సునాక్ తన సీటును సైతం కాపాడుకోలేరని పేర్కొన్నారు. బెస్ట్ ఫర్ బ్రిటన్ 15,029 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దీని ఆధారంగా రూపొందించిన నివేదికలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ ఈసారి 468 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. -
మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు!
‘యుగాంతం’.. ‘మహావినాశనం’ వీటికి సంబంధించిన చర్చలు ప్రపంచంలో కొత్తేమీకాదు. ఈ ఆసక్తికర అంశాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మానవాళి అంతం గురించి అంచనా వేయడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటర్ను ఉపయోగించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్ గురించి కంప్యూటర్ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల (ఒక మిలియన్ అంటే పది లక్షలు) దూరంలో ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని అన్నారు. ఈ విధంగా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్ విడుదల కానుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అగ్ని పర్వత విస్ఫోటనాలతో ఏర్పడే సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. ఫలితంగా భూభాగంలోని అధిక ప్రాంతాల్లో 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్వర్త్ హెచ్చరించారు. అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో భూమిపై నివాసయోగ్యంకాని సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది? -
కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్.. ఇది నిజమేనా!
బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు తెలిసిందే. అలా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు ‘నోస్ట్రాడమస్’. 465 సంవత్సరాల క్రితమే వేల అంచనాలతో ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆయన చెప్పినవాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. అలాంటి జ్యోతిషుడే చైనాలోనూ ఉన్నాడు. ఆయన పేరు లియూ బోవెన్. ‘ద టెన్ వర్రీస్’ అనే పేరుతో ఉన్న కవితలో ఆయన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ముందే లిఖించాడు. అందులో కరోనా పుట్టుకను, అంతాన్ని కూడా ఆయన అంచనా వేశారు. అది కచ్చితంగా కరోనా అనేఎలా చెప్పగలరంటే... ర్యాట్, క్యాట్ ఇయర్స్ మధ్య కాలంలో భయంకరమైన విపత్తు వస్తుందని, అది డ్రాగన్, స్నేక్ ఇయర్స్ మధ్యకాలంలో అంతమైపోతుందని ఆ కవితలో పేర్కొన్నాడు. చైనీస్ జొడియాక్ సంవత్సరాల ప్రకారం ర్యాట్ ఇయర్ 2019 ఫిబ్రవరిన మొదలైంది. పిగ్ ఇయర్ 2020 జనవరి 25న ప్రారంభమైంది. ఈ రెండేళ్ల మధ్య పుట్టిన విపత్తు... కరోనా వైరసే. చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబరు 1న తొలి కేసును గుర్తించారు. అది ఆయన చెప్పిన రెండేళ్ల మధ్య కాలమే. ఇక కరోనా అంతమైపోతుందని ఆయన చెప్పిన సంవత్సరాలు... డ్రాగన్ 2024లో ప్రారంభమవుతుండగా, స్నేక్ 2025లో మొదలవుతోంది. ఈ మధ్య కాలంలోనే పూర్తిగా కరోనా నశిస్తుందని పేర్కొన్నాడు. ఆయన చెప్పిందే నిజమవుతోందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. ఉండవు కూడా. అయితే ఆ కవిత బోవెన్ రాసినట్టు ఆధారాలు కూడా ఏమీ లేవన్న విమర్శ కూడా ఉంది. చదవండి: చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత ఎవరో చక్రవర్తి ఆయన కాలంలో సంభవించిన ప్రకృతి విపత్తులనుంచి రక్షించుకోవడానికి ఇలా రాసి, అది బోవెన్ రాసినట్టుగా చెప్పి ఉంటారనీ నమ్మేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా నిజానికి... కరోనా ఎప్పుడు అంతమవుతుంది? అసలు పోతుందా? లేదా అనేది కాలానికే తెలియాలి. అయినప్పటికీ, ఇలా మన చేతుల్లో లేని విషయాల గురించి వేరెవరో ఊహించింది చదవడానికి, వినడానికి బాగుంటుంది కదా! అలాంటిదే ఇది. -
వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి అమలాపురం: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. మూడు దశల్లో కచ్చితమైన అంచనాకు వస్తుంటారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తొలిదశలో గోదావరి నదికి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగా గోదావరికి వచ్చే వరదపై అధికారులకు అంచనా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఏకంగా 3,12,812 స్క్వేర్ మీటర్లు. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో విస్తరించింది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాల వివరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీబ్ల్యూసీ) పంపిస్తోంది. మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ప్రాంతంలో భారీగా కురిసినా నేరుగా వరద ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చే అవకాశం తక్కువ. మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నందున ఆలస్యమవుతోంది. అదే తెలంగాణలోని వరంగల్, ఏటూరి నాగారం, మంచిర్యాలా, మణుగూరు, ఇచ్చంపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఉధృతి కనిపిస్తోంది. కాళేశ్వరం టూ ధవళేశ్వరం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షంతో వచ్చే అంచనాతోపాటు రెండవ దశలో గోదావరి, ఉప నదుల మీద ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ల వద్ద రీడింగ్‌ల ద్వారా వరద అంచనా వేస్తారు. వరదపై చాలా వరకు పక్కాగా లెక్క వస్తోంది. ప్రధానంగా భద్రాచలం గేజ్ స్టేషన్ వద్ద ఉన్న నీటి పరిణామాన్ని బట్టి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం తేలుతోంది. ఆయా గేజ్ స్టేషన్ల దూరాన్ని బట్టి ధవళేశ్వరం బ్యారేజీకి వరద వచ్చేందుకు పట్టే సమయం తేలుతోంది. గోదావరిపై పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద, కొత్తగా కాపర్డామ్, పోలవరం వద్ద, అలాగే ఉప నది శబరిపై కుంట, కొయిడాల వద్ద గేజ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరద వచ్చేందుకు 18 గంటల సమయం పడుతోంది. గేట్ల నుంచి వెళ్లే నీటి పరిమాణంతో వరద లెక్క మూడవ దశలో వరద లెక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తేలుతోంది. బ్యారేజ్ స్పిల్ లెవిల్ మీద 10.67 స్పిల్ లెవిల్ మీద ఎంత ఎత్తున నీరు వచ్చిందో చూస్తారు. మొత్తం 175 గేట్లు ఉండగా, ఎన్ని గేట్లు ఎత్తారు, గేట్ల మధ్య పొడవు, వెడల్పును పరిగణలోకి తీసుకుని ఒక సెకనుకు ఎన్ని క్యూసెక్కులు వెళుతోంది లెక్క కడతారు. గాంధీ గడియారం... పేపర్ బాల్స్ ఇప్పుడంటే బ్యారేజీకి వచ్చే వరదపై కచ్చితమైన అంచనాకు సాంకేతికంగా పలు పరికరాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరద ప్రవాహాన్ని, వేగాన్ని కొలవడం అధికారులకు కత్తిమీద సామే. ఇందుకు వారు గాంధీ గడియారం, పేపర్ బాల్స్ (పేపర్లతో చుట్టిన బంతి)ని వినియోగించేవారు. ‘పేపర్‌ను ఉండగా చుట్టి బ్యారేజీ ఎగువ వైపు వేసేవాళ్లం. బ్యారేజీ దిగువకు ఎంతసేపటిలో వచ్చిందనేది తెలుసుకోవడానికి గాంధీ గడియారాన్ని ఉపయోగించేవాళ్లం. ఈ సమయాన్ని నమోదు చేయడం ద్వారా వరద వేగాన్ని గుర్తించే వాళ్లం’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇన్చార్జి ఎస్ఈ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ భారత్‌ను బెంబెలేత్తిస్తోంది. కోవిడ్ భూమ్మీదకు అడుగుపెట్టి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకు దీన్ని సమర్థవంతంగా కట్టడి చేసే వ్యాక్సిన్, ఔషధాన్ని అభివృద్ధి చేయలేకపోయారు శాస్త్రవేత్తలు. మహమ్మారి ఇంకా ఎన్నాళ్లు జనాలను పీడిస్తుందో ఎవరు సరిగా చెప్పలేకపోతున్నారు. అయితే ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు.. వీటి గురించి ముందే మనకు తెలిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. అయితే ఇది అసాధ్యం అని మనకు తెలుసు. కాకపోతే ఇప్పడు మనం చెప్పుకోబేయే వ్యక్తి మాత్రం కాస్త ప్రత్యేకం. ఎందుకంటే అతడు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి ఎనిమిదేళ్ల క్రితమే జోస్యం చెప్పాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విట్టర్ యూజర్ మార్కో అక్రోట్ అనే వ్యక్తి జూన్ 3, 2013న కరోనా వైరస్ వస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. కరోనా వైరస్.. ఇట్స్ కమింగ్ అంటూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. Corona virus....its coming — Marco (@Marco_Acortes) June 3, 2013 దీనిపై నెటిజనులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితమే నీవు కరోనాను ఎలా పసిగట్టగలిగావ్’’.. ‘‘నువ్వు టైం ట్రావేలర్‌వా’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ట్విట్టర్‌ను హ్యాక్ చేసి డేట్ చేంజ్ చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై వస్తోన్న మీమ్స్ జనాలను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. -
కొవిడ్ మరణాలను ముందే గుర్తించే టెక్నిక్
సాక్షి, రాయదుర్గం: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి, చాలా మంది రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆస్పత్రిలో ఉన్నా, ఇళ్లలో ఉన్నా కొన్నిసార్లు శ్వాస సమస్య మొదలయ్యే వరకు రోగి పరిస్థితి సీరియస్ అవుతోందన్న విషయం గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెషీన్ లెర్నింగ్ నమూనాల ఆధారంగా.. కోవిడ్ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించే సాంకేతికతను రూపొందించినట్టు గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ దేవప్రియకుమార్, పరిశోధక విద్యార్థులు షన్ముఖ్ అల్లె, అక్షయ కార్తికేయన్, అక్షిత్ గార్గ్‌ల బృందం ఈ పరిశోధన చేసిందని వారు వెల్లడించారు. కోవిడ్ వైరస్ ఉధృతిని బట్టి శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్లు వంటి బయోమార్కర్ల సాయంతో మరణించే అవకాశాలను ముందే గుర్తించవచ్చని తెలిపారు. రక్తంలోని న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, లాక్టేట్ డీహైడ్రోజెనేస్ (ఎల్డీహెచ్), హైసెన్సివిటీ డీ–రియాక్టివ్ ప్రోటీన్ వంటి వాటి స్థాయిల ఆధారంగా.. 96 శాతం కచ్చితత్వంతో 16 రోజుల ముందుగానే మరణాలను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. ఈ డేటా ఆధారంగా కోవిడ్ పేషెంట్లకు అందించే చికిత్సను మెరుగుపర్చి, ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. చదవండి: శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు! -
ట్రంప్ విజయం ఖాయమన్న 'చాణక్య'
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తుందని సర్వేలన్నీ వెల్లడిస్తుంటే 'చాణక్య' మాత్రం డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని జోస్యం చెప్పింది. 'చాణక్య' అంటే మనిషి కాదు. బుల్లి చేప. మత్స్య ప్రేమికుడు ఆర్. వరుణ్ దీనిని పెంచుకుంటున్నారు. గతంలో చాణక్య చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో దీని జోస్యంపై జనానికి గురి కుదిరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చాణక్య జోస్యం ఆసక్తికరంగా మారింది. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచారు. ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని చాణక్య జోస్యం చెప్పింది. అయితే అమెరికా నుంచి వెలువడుతున్న ఫలితాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. కాగా, ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. యూరో కప్ లో భాగంగా జూన్18న క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ విజయం సాధిస్తుందని అది కరెక్టుగా అంచనా వేసింది. తర్వాత రోజు జరిగిన మ్యాచుల్లో చాణక్య చెప్పిన జోస్యం నిజమైంది. 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది. -
విద్యార్థి ప్రతిభను డీఎన్ఏ టెస్టుతో కొలవచ్చు!
లండన్: పిల్లలలో ప్రతిభాపాటవాలను ముందుగానే గుర్తించి వారిలోని లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఏర్పడింది. లండన్ లోని కింగ్స్ కాలేజికి చెందిన శాస్త్రవేత్తలు పిల్లల డీఎన్ఏపై పరిశోధనలు చేసి అకడమిక్స్ లో వారు రాణించే స్థాయిని ముందుగానే గుర్తించే టెక్నిక్ ను కనుగొన్నారు. వయసుతో సంబంధం లేకుండా దాదాపు 20వేల మంది విద్యార్థులపై శాస్త్రజ్ఞుల బృందం ప్రత్యేక డీఎన్ఏ పరీక్షలు జరిపింది. 16 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థుల డీఎన్ఏల్లో మార్పులున్నట్లు వాటి ఫలితాల్లో గుర్తించింది. విద్యార్థులపై ఈ పరీక్షలు చేయడం ద్వారా నేర్చుకోవడంలో వెనుకబడుతున్న వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. కవలలపై పరిశోధనల వల్ల జన్యుపరమైన వివరాలు పూర్తిగా తెలుస్తాయని అన్నారు. వీరిలోని పాలీజెనిక్ స్కోర్ డీఎన్ఏ టెస్టులో అంతరాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఏ వ్యక్తిదైనా పాలీజెనిక్ స్కోర్ ను లెక్కించాలంటే జెనోమేవైడ్ అసోసియేషన్ స్టడీ(జీడబ్ల్యూఏఎస్) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కూడా పిల్లల్లో అకడమిక్ విజయాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. జన్యుపరమైన మార్పుల్లో ఒకటైన న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజమ్(ఎస్ఎన్ పీ) ద్వారా విద్యార్థుల్లోని చురుకుదనాన్ని సులువుగా గుర్తించవచ్చని చెప్పారు. ఎస్ఎన్ పీలు వ్యక్తిలోని ధృఢస్థిరాత్వాన్ని తెలియజేస్తాయని వీటిని ఎక్కువపాళ్లలో కలిగివున్న వారు మంచి విద్యావంతులవుతారని వివరించారు. -
మీ సంపాదనెంతో ట్విట్టర్ చెప్పేస్తుంది!
వాషింగ్టన్: నడిచే తీరు.. చదివే పుస్తకాలు.. మాట్లాడే పద్ధతి వారి వారి మనోభావాలను చెప్తుందన్నది మనం విన్న విషయమే. కానీ సామాజిక మాధ్యమం... మైక్రో బ్లాగింగ్ సైట్... ట్విట్టర్... ఏకంగా యూజర్ల ఆదాయం ఎంతో చెప్పేంస్తుందంటున్నారు పరిశోధకులు. అత్యధిక సంపాదన ఉన్నవారు ట్విట్టర్లో తమ ఆగ్రహాన్ని, భయాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తుంటారని... ఆశావాదులు తక్కువ సగటు ఆదాయాన్ని కలిగి ఉంటారని గుర్తించారు. పెన్సిల్ వేనియా, జాన్ హాప్కిన్స్ విశ్వ విద్యాలయాలు, యూనివర్శిటీ కాలేజ్ లండన్ మరియు మైక్రోసాఫ్ట్ రీసెర్స్ కు సంబంధించిన పరిశోధకులు ట్విట్టర్ వినియోగదారుల మనోభావాల పై పలు పరిశోధనలు జరిపారు. వినియోగదారులు వాడే పదాలను, భాషను బట్టి వారి ఆదాయాన్ని, వృత్తిని తెలుసుకోవచ్చని నిర్ధారించారు. లండన్ లోని జాబ్ కోడ్ సిస్టమ్ తొమ్మిది రకాలుగా ఉంటుంది. ప్రతి రకం నుంచి పరిశోధక బృందంలోని ప్రతినిధులు ఓ శాంపిల్ ను సేకరించి ఆ క్రమాన్ని బట్టి వారి వారి సగటు ఆదాయాన్ని గుర్తించారు. ట్విట్టర్ లో వివరాలు అస్పష్టంగా ఉండే వారిని మినహాయించి, మిగిలిన 5,00,191 ట్విట్టర్ వినియోగదారులు పోస్టు చేసిన పది మిలియన్లకు ట్వీట్లపై అధ్యయనకారులు పరిశోధనలు జరిపారు. ఇటువంటి అధ్యయనాల్లో ఇది అతిపెద్ద డేటా సెట్ అని పెన్సిల్వేనియా పోస్ట్ డాక్టోరియల్ పరిశోధకుడు డానియెల్ ప్రయోటక్ పియాట్రో తెలిపారు. యూజర్లు ఉపయోగించే పదాలను ఓ క్రమ పద్ధతిన గణించి, వారి భాషా విధానాన్ని విశ్లేషించారు. అంతేకాదు ఆ పదాల గుణాలను విభజించారు. ఎక్కువశాతం మంది ఒకేలాంటి, పదాలను వాడటంతోపాటు... ఒకరికొకరు సరిపోలిన పదాలను వాడినట్లుగా పరిశోధకులు గమనించారు. ఇప్పటికే జరిపిన పలు అధ్యయనాల ద్వారా వయసు లింగ బేధాలను గుర్తించగా... వాటి ఆధారంగా.. ప్రస్తుతం వినియోగదారుల ఆదాయాన్ని సైతం నిర్ధారించినట్లు పరిశోధకులు తెలిపారు. ఎవరైతే ట్విట్టర్ లో ఎక్కువ భయాన్ని, ఆందోళనను, కోపాన్ని వ్యక్త పరుస్తారో వారు అధిక ఆదాయం ఉండేవారుగానూ, ఆశావాదాన్ని వినిపించేవారు తక్కువ ఆదాయం కలిగి ఉండేవారుగాను పరిశోధకులు గ్రహించారు. అలాగే బ్రాకెట్లలో సరళమైన పదాలను వాడేవారు తక్కువ ఆదాయం కలిగి ఉండేవారుగానూ... తరచుగా రాజకీయాలు, సంస్థల గురించి చర్చించేవారు అధిక ఆదాయం కలిగి ఉండేవారుగానూ పరిశోధకులు నిర్ధారించారు. -
పదేళ్లు ప్రధానిగా నరేంద్ర మోడీ!
నరేంద్ర మోడీ పదేళ్ల పాటు ప్రధాని పీఠంపై కొనసాగుతారా. భారత్-పాకిస్థాన్ భాయి భాయి అంటూ చేతులు కలుపుతాయా. హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తారా. అంటే అవుననే అంటున్నారు ప్రముఖ కన్సల్టెంట్ విమల్ సింగ్. 41 ఏళ్ల విమల్ భవిష్యత్ గురించి చెప్పడంలో దిట్ట. పలు కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖులకు ఆయన కన్సల్టెంట్ గా ఉన్నారు. గోరఖ్‌పూర్ నుంచి మూడుసార్లు పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహించిన సింగసాన్ సింగ్ మనవడే ఈ విమల్. 14 ఏళ్ల వయసు నుంచే ముందు జరగబోయే వాటి గురించి చెప్పేవాడు విమల్. అతడు చెప్పేవి నిజమవుతుండడంతో విమల్ ను తాత ప్రోత్సహించారు. విమల్ సింగ్ చెప్పిన చాలా విషయాలు తర్వాతి కాలంలో నిజమయ్యాయి. మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టి 13 రోజులకే అధికారం కోల్పోయిన అటల్ బిహారి వాజపేయిని కలిసి విమల్ భవిష్యత్ చెప్పారు. పూర్తికాలం ప్రధానిలో కొనసాగే రోజు వస్తుందని వాజపేయికి విమల్ చెప్పిన జోస్యం తర్వాత కాలంలో నిజమైంది. దేశాన్ని ముందుకు నడిపిస్తారని 1997లో మన్మోహన్ సింగ్ ను కలిసి చెప్పారు. ఆ సమయానికి మన్మోహన్ సింగ్ ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా కాదు. కాని విమల్ చెప్పిన మాట అక్షరాల సాకారమైంది. పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపారు. కార్గిల్ యుద్ధం వస్తుందని కూడా విమల్ ముందే ఊహించారు. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ పదేళ్ల పాటు ఆ పదవిని కాపాడుకుంటారని తాజాగా విమల్ సింగ్ జోస్యం చెప్పారు. హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షరాలు అవుతారని అన్నారు. ఐరోపా ఖండంలోని దేశాల ఉమ్మడి కరెన్సీ 'యూరో' మాదిరిగా భారత్-పాకిస్థాన్ కలిసి ఒకే కరెన్సీని రూపొందించుకుంటాయని అంటున్నారు. భారత్-పాక్ చేతులు కలుపుతాయని, ఐఎస్ఐ ప్రాభవం తగ్గుతుందని భవిష్యవాణి వినిపించారు. మూడో ప్రపంచ యుద్ధం రాదని భరోసాయిచ్చారు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, పార్జీలో చేరాలంటూ ప్రియాంక గాంధీపై ఒత్తిడి కొనసాగుతుందని విమల్ సింగ్ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా తగ్గి జాతీయ పార్టీలు పాగా వేస్తాయని ఊహించారు. దేశంలో రెండు మూడు పార్టీలు మాత్రమే ఉండే పరిస్థితి మళ్లీ వస్తుందని భవిష్యత్ చెప్పారు. విమల్ సింగ్ భవిష్యవాణి ఎంతవరకు నిజమవుతుందో కాలమే చెబుతుంది. -
తెలంగాణ, కోస్తాలకు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవహించాయి. దీని ప్రభావంవల్ల వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. క్యుములోనింబస్ మేఘాలవల్ల గత రెండు రోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయని, ఇప్పుడు వీటి దిశ మారడంవల్ల ఉత్తర కోస్తా, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రుతు పవనాలు ప్రవేశానికి ముందు మే నెలలో వర్షాలు కురవడం సాధారణమేనని, ఇప్పుడు కూడా అలాంటి వానలే కురుస్తున్నాయని వాతావరణ శాఖ రిటైర్డు అధికారి మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం గాలిలో తేమ అధికంగా ఉండటంవల్ల ఉక్కపోత ఎక్కువగా ఉందని, ఈ నెలాఖరు వరకూ 40 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది 95 శాతం వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంచనా. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దక్షిణాది ప్రాంతంలో ఎంతమేరకు వర్షాలు కురుస్తాయో కూడా ఇప్పుడు చెప్పలేం. జూన్‌లో ఈ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఈ ఏడాది దక్షిణాదిలో వర్షపాతం ఎంత మేరకు ఉంటుందో అంచనా వేయడానికి వీలవుతుంది’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
నేరగాళ్ల భరతం పట్టేందుకు కొత్త టెక్నాలజీ