ట్రంప్ విజయం ఖాయమన్న 'చాణక్య' | Chennai: Congrats Donald Trump, predicts Chanakya the fish | Sakshi
Sakshi News home page

ట్రంప్ విజయం ఖాయమన్న 'చాణక్య'

Published Tue, Nov 8 2016 12:58 PM | Last Updated on Fri, Aug 24 2018 6:21 PM

ట్రంప్ విజయం ఖాయమన్న 'చాణక్య' - Sakshi

ట్రంప్ విజయం ఖాయమన్న 'చాణక్య'

చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తుందని సర్వేలన్నీ వెల్లడిస్తుంటే 'చాణక్య' మాత్రం డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని జోస్యం చెప్పింది. 'చాణక్య' అంటే మనిషి కాదు. బుల్లి చేప. మత్స్య ప్రేమికుడు ఆర్. వరుణ్ దీనిని పెంచుకుంటున్నారు. గతంలో చాణక్య చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో దీని జోస్యంపై జనానికి గురి కుదిరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చాణక్య జోస్యం ఆసక్తికరంగా మారింది. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచారు. ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని చాణక్య జోస్యం చెప్పింది. అయితే అమెరికా నుంచి వెలువడుతున్న ఫలితాలు దీనికి భిన్నంగా ఉన్నాయి.

కాగా, ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. యూరో కప్ లో భాగంగా జూన్18న  క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ విజయం సాధిస్తుందని అది కరెక్టుగా అంచనా వేసింది. తర్వాత రోజు జరిగిన మ్యాచుల్లో చాణక్య చెప్పిన జోస్యం నిజమైంది. 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement