![This Twitter User Predicted Coronavirus in 2013 - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/10/macro.jpg.webp?itok=hDE4TSAK)
ఎనిమిదేళ్ల క్రితమే కరోనా గురింటి ట్వీట్ చేసిన ట్విట్టర్ యూజర్ మార్కో అక్రోట్ (ఫోటో కర్టెసీ: ఇండియా.కామ్)
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ భారత్‌ను బెంబెలేత్తిస్తోంది. కోవిడ్ భూమ్మీదకు అడుగుపెట్టి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకు దీన్ని సమర్థవంతంగా కట్టడి చేసే వ్యాక్సిన్, ఔషధాన్ని అభివృద్ధి చేయలేకపోయారు శాస్త్రవేత్తలు. మహమ్మారి ఇంకా ఎన్నాళ్లు జనాలను పీడిస్తుందో ఎవరు సరిగా చెప్పలేకపోతున్నారు. అయితే ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు.. వీటి గురించి ముందే మనకు తెలిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. అయితే ఇది అసాధ్యం అని మనకు తెలుసు. కాకపోతే ఇప్పడు మనం చెప్పుకోబేయే వ్యక్తి మాత్రం కాస్త ప్రత్యేకం.
ఎందుకంటే అతడు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా గురించి ఎనిమిదేళ్ల క్రితమే జోస్యం చెప్పాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విట్టర్ యూజర్ మార్కో అక్రోట్ అనే వ్యక్తి జూన్ 3, 2013న కరోనా వైరస్ వస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. కరోనా వైరస్.. ఇట్స్ కమింగ్ అంటూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది.
Corona virus....its coming
— Marco (@Marco_Acortes) June 3, 2013
దీనిపై నెటిజనులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితమే నీవు కరోనాను ఎలా పసిగట్టగలిగావ్’’.. ‘‘నువ్వు టైం ట్రావేలర్‌వా’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ట్విట్టర్‌ను హ్యాక్ చేసి డేట్ చేంజ్ చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై వస్తోన్న మీమ్స్ జనాలను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment