విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభిస్తామని డ్వామా పీడీ ఎస్. అప్పలనాయుడు చెప్పారు. రాష్ట్ర గ్రామీణాభివృ ద్ధి శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో 26 ప్రాజెక్టుల కింద 175 రకాల నూతన పనులను గుర్తించను న్నట్టు తెలిపారు. ఈనెలాఖరులోగా మరిన్ని పనులను గుర్తించి జిల్లా, మండల స్థాయిలో పరిపాలన ఆమో దం కోసం పంపిస్తామన్నారు. ఈసారి ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల అభి వృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పిస్తామన్నారు.
బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
న్యూస్‌లైన్ : ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులకు ఎంతమంది హాజరవుతున్నారు?
పి.డి : జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడంతో కేవ లం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. జి ల్లావ్యాప్తంగా 2 వేల మందిఉపాధి పనులకు హాజరవుతున్నారు.
న్యూస్‌లైన్: మైదాన ప్రాంతాల్లో ఎందుకు పనులు జరగడం లేదు?
పి.డి : మైదానప్రాంతాల్లో వేతనదారులు నుంచి పని డిమాండ్ రాలేదు. ఎవరికైనా పని కావాలని దరఖాస్తు చేసుకుంటే పని కల్పిస్తాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1000 రోజులు పని దినాలు పూర్తికాని వారికే పనులు కల్పిస్తాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పనులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పనులు అంపూర్తిగా ఉన్నాయి. సంబంధిత గ్రామంలో పనులు లేకపోతే పక్క గ్రామంలోనైనా పనులు చూపిస్తాం.
న్యూస్‌లైన్: పక్క గ్రామాల్లో పనికి వెళ్లే వారికి ప్రత్యేక అలెవెన్స్ ఏమైనా చెల్లిస్తారా?
పి.డి : వేతనదారుని స్వగ్రామంలో పనులు లేకపోతే పక్క గ్రా మాల్లో పనులు కల్పించేందుకు అవకాశం ఉంది. ఆ గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు దాటి వెళ్తే 10 శాతం అలెవెన్స్ చెల్లిస్తాం.
న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా కొత్తగా పనులను గుర్తిస్తున్నారా?
పి.డి : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లాలో 26 ప్రొజెక్టుల పరిధిలో 175 రకాల పనులను కొత్తగా గుర్తించాలని నిర్ణయించాం. ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా ఈనెలాఖరు నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
న్యూస్‌లైన్ : కొత్తగా ఎటువంటి పనులు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి..?
పి.డి : ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనులు గుర్తింపు ఉంటుంది. శ్మశానవాటికలకు రోడ్లు వేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న శ్మశానవాటికలను ఎత్తు చేయడం, గ్రామాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుతో పాటు ప్రతి రోజూ చెత్త సేకరించి అక్కడ వేసేందుకు వేతనదారులను నియమించడం చేస్తాం.
అలాగే ఆక్రమణలకు గురైన చెరువులకు ట్రెంచ్ కటింగ్ పనులతో పాటు పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేసే పనులను గుర్తిస్తున్నాం.