new works
-
Agnipath scheme: దేశ హితానికే నిర్ణయాలు
సాక్షి, బెంగళూరు: కొత్త నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అసమంజసంగా తోచినా, అసంతృప్తికరంగా అనిపించినా అంతిమంగా జాతి నిర్మాణానికే తోడ్పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరులో రూ.33 వేల కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు, కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. అనంతరం కొమ్మఘట్టదల్లిలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సరికొత్త లక్ష్యాలను, సంకల్పాలను సాకారం చేసుకునే దిశగా మనల్ని తీసుకెళ్లగలిగేది కేవలం సంస్కరణల పథం మాత్రమేనని పునరుద్ఘాటించారు. ‘‘దశాబ్దాల తరబడి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటుకు కూడా అవకాశం కల్పించడానికి అదే కారణం. 21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి అవకాశాలను, సంపదను సృష్టించే వారిదే. అందుకే ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం వారిని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. అధికార లాలసులైన వ్యక్తులు తమ భావజాలాన్ని మార్చుకోవాలి. బెంగళూరు సాధించిన ప్రగతి మనకు చెబుతున్న పాఠం కూడా అదే’’ అన్నారు. అగ్నిపథ్ ఆందోళనలపై మోదీ ఇప్పటిదాకా నేరుగా స్పందించలేదు. సదుద్దేశంతో చేసే పనులు కూడా రాజకీయ రంగు పులుముకోవడం దేశ దౌర్భాగ్యమంటూ ఆదివారం కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బెంగళూరులో బిజీబిజీ బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. బెంగళూరు–కొమ్మఘట్టదల్లి సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇదిప్పటికే 40 ఏళ్లు ఆలస్యమైందన్నారు. విద్యుద్దీకరణ చేసిన కొంకణ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) క్యాంపస్‌లో రూ.280 కోట్లతో నిర్మించిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)ను ప్రారంభించారు. దీనికి శంకుస్థాపన చేసింది కూడా తానే కావడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. బాగ్చీ–పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏ దేశమైనా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. బెంగళూరు కలలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని బెంగళూరు చక్కగా ప్రతిబింబిస్తోంది. లక్షలాది మంది కలల సాకారమే కొన్నేళ్లుగా నగర ప్రగతి రూపంలో ప్రతిఫలిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో ఎన్ని లాభాలుంటాయో, ప్రభుత్వం అతి జోక్యాన్ని తగ్గించి సరైన అవకాశాలు కల్పిస్తే భారత యువత ఎన్ని అద్భుతాలు సాధిస్తుందో చెప్పేందుకు బెంగళూరే నిదర్శనం. భారత యువతకు ఇదో కలల నగరి. పారిశ్రామిక చొరవ, ఇన్నోవేషన్, ప్రభుత్వ–ప్రైవేటు రంగాలను సమపాళ్లలో వినియోగించుకోవడం వంటివి బెంగళూరును ఇలా తీర్చిదిద్దాయి. బెంగళూరు వర్సిటీ ఆవరణలో అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయ(బేస్) క్యాంపస్‌ను, రూ.4,700 కోట్లతో రూపొందించిన 150 టెక్నాలజీ హబ్‌లను మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. ఉక్రెయిన్‌లో బాంబు దాడిలో మరణించిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులను పరామర్శించారు. మైసూరులోనూ పలు శంకుస్థాపనలు చేశారు. త్రివిధ దళాధిపతులతో నేడు విడిగా మోదీ భేటీలు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు. సైన్యం, నావికా దళం, వైమానిక దళాధిపతులు ప్రధాని మోదీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. మొదట నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రధానమంత్రిని కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాకు కుర్తా కుట్టిస్తావా? మైసూరులో కేంద్ర పథకాల లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి తాను 10 పథకాల ద్వారా లబ్ధి పొందానని అంబిక అనే మహిళ చెప్పింది. కుట్టుమిషన్ కూడా తీసుకున్నానడంతో, ‘అయితే నాకు కుర్తా కుట్టిస్తావా?’ అని మోదీ అడిగారు. ‘తప్పకుండా. మంచి కుర్తా కుట్టిస్తా’ననడంతో నవ్వారు. అనంతరం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం మైసూరు ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా ఉత్సవాల్లో మోదీ పాల్గొంటారు. -
అసంపూర్తి పనులకు నిధులివ్వండి
♦ పాతవి పూర్తయితేనే కొత్త పనులు మంజూరు ♦ ‘ఉపాధి’లో లక్ష్యసాధన ఆధారంగా పదోన్నతులు ♦ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘గ్రామీణాభివృద్ధిలో భాగంగా తలపెట్టిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి.. మధ్యలో పనులు ఆపితే కొత్తగా పనులు మంజూరు చేసేది లేదు. పురోగతి ఆధారంగానే నిధులు ఇస్తాం.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి, అనుబం ధ సంస్థల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ హాజరయ్యారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులపై సమీక్షిస్తూ మంత్రి పైవిధంగా స్పందించారు. లక్ష్యసాధనతోనే ప్రమోషన్లు.. ఉపాధి హామీ ఉద్యోగులకు ఇకపై పనితీరు, నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగానే పదోన్నతు లిస్తామని మంత్రి చెప్పారు. లక్ష్యసాధనలో వెనకబడితే వారికి పదోన్నతి కష్టమన్నారు. ఉపాధి పని కల్పన కోసం కొత్తగా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉపాధిహామీ పథకానికి హరితహారాన్ని జోడిస్తున్నామని, అదే విధంగా ఇంకుడు గుంతలు కూడా ఈ పథ కం కింద తవ్వించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం కావాలని, అసంపూర్తి భవనాలుంటే కొత్తవి మంజూరు చేయబోమన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో వందశాతం శానిటేషన్ అమలయ్యే లా చూడాలన్నారు. మూడు నెలలకోసారి పం చాయతీరాజ్ రోడ్లు, ఉపాధిహామీ పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తానన్నారు. సమావేశంలో జేసీ ఆమ్రపాలి, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ హరిత, డీపీఓఅరుణ పాల్గొన్నారు. ఆ మంత్రి ఎవరు? అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై సమీక్షలో భాగంగా.. ‘జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. వాటిలో నిర్మాణా లు సైతం అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడంలో పంచాయతీ శాఖ నిర్తిప్తత పాటిస్తున్నట్లుంది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. దీంతో జిల్లా పంచాయతీశాఖ అధికారి అరుణ స్పందిస్తూ.. అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిని కూల్చివేసే సందర్భంలో మంత్రి నుంచి ఫోన్లు రావడం.. దాంతో జేసీబీ, ప్రొక్లెయన్లతో వెనుదిరగడం జరిగిందని వివరించారు. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. జిల్లా మంత్రిగా నేను ఎన్నడూ డీపీఓకు ఫోన్ చేయలేదన్నారు. తనకు ఫోన్ చేసిన మంత్రి ఎవరో వివరాలు బయటపెట్టాలని నిలదీశారు. అక్రమాలను ఉపేక్షించొద్దని.. వాటిని కూల్చివేయాలన్నారు. ఇంతలో ఆమె మౌనం వహించడంతో అక్కడ కొంత నిశబ్ద వాతావరణం నెలకొంది. వెంటనే మంత్రి జూపల్లి జోక్యం చేసుకుంటూ ఇబ్బందులుంటే జిల్లా మంత్రితో సమావేశమై సమస్యల్ని పరిష్కరించుకోవాలంటూ ఇతర అంశాలపై సమీక్షను కొనసాగించారు. మంత్రి ఫోన్‌తో కూల్చివేతలు నిలిపివేసినట్లు డీపీఓ చెబుతున్న సందర్భంలో మంత్రి మహేందర్‌రెడ్డి కలగజేసుకోవడం.. సభలో అంతర్గత చర్చకు దారితీసింది. -
వచ్చే ఏడాది నుంచి కొత్త పనులు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభిస్తామని డ్వామా పీడీ ఎస్. అప్పలనాయుడు చెప్పారు. రాష్ట్ర గ్రామీణాభివృ ద్ధి శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో 26 ప్రాజెక్టుల కింద 175 రకాల నూతన పనులను గుర్తించను న్నట్టు తెలిపారు. ఈనెలాఖరులోగా మరిన్ని పనులను గుర్తించి జిల్లా, మండల స్థాయిలో పరిపాలన ఆమో దం కోసం పంపిస్తామన్నారు. ఈసారి ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల అభి వృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పిస్తామన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. న్యూస్‌లైన్ : ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులకు ఎంతమంది హాజరవుతున్నారు? పి.డి : జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడంతో కేవ లం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. జి ల్లావ్యాప్తంగా 2 వేల మందిఉపాధి పనులకు హాజరవుతున్నారు. న్యూస్‌లైన్: మైదాన ప్రాంతాల్లో ఎందుకు పనులు జరగడం లేదు? పి.డి : మైదానప్రాంతాల్లో వేతనదారులు నుంచి పని డిమాండ్ రాలేదు. ఎవరికైనా పని కావాలని దరఖాస్తు చేసుకుంటే పని కల్పిస్తాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1000 రోజులు పని దినాలు పూర్తికాని వారికే పనులు కల్పిస్తాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పనులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పనులు అంపూర్తిగా ఉన్నాయి. సంబంధిత గ్రామంలో పనులు లేకపోతే పక్క గ్రామంలోనైనా పనులు చూపిస్తాం. న్యూస్‌లైన్: పక్క గ్రామాల్లో పనికి వెళ్లే వారికి ప్రత్యేక అలెవెన్స్ ఏమైనా చెల్లిస్తారా? పి.డి : వేతనదారుని స్వగ్రామంలో పనులు లేకపోతే పక్క గ్రా మాల్లో పనులు కల్పించేందుకు అవకాశం ఉంది. ఆ గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు దాటి వెళ్తే 10 శాతం అలెవెన్స్ చెల్లిస్తాం. న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా కొత్తగా పనులను గుర్తిస్తున్నారా? పి.డి : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లాలో 26 ప్రొజెక్టుల పరిధిలో 175 రకాల పనులను కొత్తగా గుర్తించాలని నిర్ణయించాం. ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా ఈనెలాఖరు నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. న్యూస్‌లైన్ : కొత్తగా ఎటువంటి పనులు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి..? పి.డి : ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనులు గుర్తింపు ఉంటుంది. శ్మశానవాటికలకు రోడ్లు వేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న శ్మశానవాటికలను ఎత్తు చేయడం, గ్రామాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుతో పాటు ప్రతి రోజూ చెత్త సేకరించి అక్కడ వేసేందుకు వేతనదారులను నియమించడం చేస్తాం. అలాగే ఆక్రమణలకు గురైన చెరువులకు ట్రెంచ్ కటింగ్ పనులతో పాటు పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేసే పనులను గుర్తిస్తున్నాం.