Vizianagaram Cantonment
-
అంతర్జాతీయ స్థాయిలో నేడు తొలి ఆట
జిల్లాలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో తలపడనున్న ఇండియా- శ్రీలంక మహిళా జట్లు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న టీ-20 మ్యాచ్ ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ఆత్మవిశ్వాసంతో ఆతిథ్య ఇండియా జట్టు జిల్లా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాలన్న వారి కోరిక తీరబోతోంది. అందుకు నార్త్‌జోన్ అకాడమీ వేదికయింది. విజయనగరం వేదికగా తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఇండియా శ్రీలంక మహిళల టీ-20 మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. శ్రీలంకతో ఇండియా జట్టు తలపడనుంది. విజయనగరంలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయంసాధించినా...విశాఖలో జరిగిన మూడు వన్డేల్లో భారత జట్టు గెలుపొంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లా వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శుభముహూర్తం వచ్చేసింది. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు విజయనగరం ఆతిత్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కు డెంకాడ మండలం చింతలవలస సమీపంలో ఉన్న నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రేక్షకుల్లో ఆద్యంతం ఉత్కంఠరేపే టీ- 20 క్రికెట్ మ్యాచ్ జిల్లా వాసులకు కనువిందు చేయనుంది. తొలిసారిగా జిల్లాలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-శ్రీలంక మహిళా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు విశాఖలో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆటను పూర్తి చేసుకోగా శనివారం తొలి టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుందని నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ నిర్వాహకుడు వి.సన్యాసిరాజు శుక్రవారం తెలిపారు. అంతకుముందు ఉదయం 8 గంటలకు ఇరు జట్ల క్రీడాకారులు బస్సులో విశాఖ నుంచి మైదానానికి చేరుకుంటారు. రెండు గంటల పాటు క్రీడాకారులు ప్రాక్టీసు చేసిన అనంతరం మ్యాచ్ ఆరంభం కానుంది. తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి విద్యలకు నిలయంగా.. కళలకు కాణాచిగా పేరుగాంచిన విజయనగరం జిల్లా కీర్తిప్రతిష్టలు ఇకపై అంతర్జాతీయ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. జిల్లా వాసులు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్న తరుణం రావటంతో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠత నెలకొంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానాలను పంపిచటంతో పాటు పలువురు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆత్మవిశ్వాసంతో... శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం జరగనున్న తొలి టీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇండియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇప్పటికే జరిగిన మూడు వన్డేల్లో ఇండియా జట్టు క్లీన్‌స్వీప్ చేసి శ్రీలంక జట్టుపై పైచేయి సాధించగా శనివారం జరగనున్న తొలి టీ-20 మ్యాచ్‌లో ఇదే తరహాలో రాణించి తొలి విజయాన్ని దక్కించుకోవాలనే ఉత్సుకతతో ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వన్డేలో ఓటమి పాలై ఘోర పరాజయం పాలైన శ్రీలంక జట్టు టీ-20 క్రికెట్లోనైనా రాణించి పరువు దక్కించుకోవాలని బావిస్తోంది. -
వచ్చే ఏడాది నుంచి కొత్త పనులు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభిస్తామని డ్వామా పీడీ ఎస్. అప్పలనాయుడు చెప్పారు. రాష్ట్ర గ్రామీణాభివృ ద్ధి శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో 26 ప్రాజెక్టుల కింద 175 రకాల నూతన పనులను గుర్తించను న్నట్టు తెలిపారు. ఈనెలాఖరులోగా మరిన్ని పనులను గుర్తించి జిల్లా, మండల స్థాయిలో పరిపాలన ఆమో దం కోసం పంపిస్తామన్నారు. ఈసారి ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల అభి వృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పిస్తామన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. న్యూస్‌లైన్ : ప్రస్తుతం జిల్లాలో ఉపాధి పనులకు ఎంతమంది హాజరవుతున్నారు? పి.డి : జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడంతో కేవ లం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. జి ల్లావ్యాప్తంగా 2 వేల మందిఉపాధి పనులకు హాజరవుతున్నారు. న్యూస్‌లైన్: మైదాన ప్రాంతాల్లో ఎందుకు పనులు జరగడం లేదు? పి.డి : మైదానప్రాంతాల్లో వేతనదారులు నుంచి పని డిమాండ్ రాలేదు. ఎవరికైనా పని కావాలని దరఖాస్తు చేసుకుంటే పని కల్పిస్తాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1000 రోజులు పని దినాలు పూర్తికాని వారికే పనులు కల్పిస్తాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పనులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పనులు అంపూర్తిగా ఉన్నాయి. సంబంధిత గ్రామంలో పనులు లేకపోతే పక్క గ్రామంలోనైనా పనులు చూపిస్తాం. న్యూస్‌లైన్: పక్క గ్రామాల్లో పనికి వెళ్లే వారికి ప్రత్యేక అలెవెన్స్ ఏమైనా చెల్లిస్తారా? పి.డి : వేతనదారుని స్వగ్రామంలో పనులు లేకపోతే పక్క గ్రా మాల్లో పనులు కల్పించేందుకు అవకాశం ఉంది. ఆ గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు దాటి వెళ్తే 10 శాతం అలెవెన్స్ చెల్లిస్తాం. న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా కొత్తగా పనులను గుర్తిస్తున్నారా? పి.డి : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లాలో 26 ప్రొజెక్టుల పరిధిలో 175 రకాల పనులను కొత్తగా గుర్తించాలని నిర్ణయించాం. ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా ఈనెలాఖరు నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. న్యూస్‌లైన్ : కొత్తగా ఎటువంటి పనులు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి..? పి.డి : ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనులు గుర్తింపు ఉంటుంది. శ్మశానవాటికలకు రోడ్లు వేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న శ్మశానవాటికలను ఎత్తు చేయడం, గ్రామాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుతో పాటు ప్రతి రోజూ చెత్త సేకరించి అక్కడ వేసేందుకు వేతనదారులను నియమించడం చేస్తాం. అలాగే ఆక్రమణలకు గురైన చెరువులకు ట్రెంచ్ కటింగ్ పనులతో పాటు పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేసే పనులను గుర్తిస్తున్నాం. -
కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శు ల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైం ది. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పోస్టుల భర్తీకి తొలిరోజు సుమా రు 50 దరఖాస్తులు విక్రరుుంచినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో 158 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నా రుు. వీటిని భర్తీ చేయూలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాల రావడంతో జిల్లా యంత్రాంగం ప్రక్రియలో నిమగ్నమైంది. దరఖాస్తు ఫారాలను జిల్లా పంచాయతీ కార్యాలయంలో విక్రయిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం పేరు మీద రూ.50 డీడీ తీయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జిల్లాలో 921 పంచాయతీలు ఉండగా అందులో 167 పంచాయతీలకు మాత్రమే రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నారు. మరో 153 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న 158 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయూలని నిర్ణరుుంచిం ది. మిగిలిన పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పదేళ్లుగా పనిచేస్తు న్న తమను కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించడమేంటని కాంట్రాక్టు కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ మార్గదర్శకాలు... డిగ్రీలో మార్కులకు 75 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్వీసులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న వారికి 15 శాతం వెయిటే జీ అదనంగా కలుపుతారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా జరిగే ఎంపికల్లో ఏదైనా డిగ్రీని అర్హతగా నిర్ణయిస్తూ కాంట్రాక్ట్ కార్యదర్శులతో పాటు ఇతరలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి కలెక్టర్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈఓ సభ్యునిగా, డీపీఓ పంచాయతీ సభ్య కన్వీనర్‌గా జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపికలు నిర్వహిస్తుంది. కాంట్రాక్ట్ కార్యదర్శులకు 25 శాతం వెయిటేజీ.. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్యదర్శులుగా పని చేస్తున్న వారికి ఏడాదికి మూడు మార్కులు చొప్పున గరిష్టం గా 25 మార్కులు మించకుండా వెరుుటేజీ కల్పిం చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ జరగనుందని కొద్దిరోజులు గా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమకు ఉద్యోగం కల్పించాలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చుట్టూ నిరుద్యోగులు తిరుగుతున్నారు. జిల్లాలో ఒకేసారి 158 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.