విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శు ల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైం ది. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పోస్టుల భర్తీకి తొలిరోజు సుమా రు 50 దరఖాస్తులు విక్రరుుంచినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో 158 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నా రుు. వీటిని భర్తీ చేయూలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాల రావడంతో జిల్లా యంత్రాంగం ప్రక్రియలో నిమగ్నమైంది. దరఖాస్తు ఫారాలను జిల్లా పంచాయతీ కార్యాలయంలో విక్రయిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం పేరు మీద రూ.50 డీడీ తీయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
జిల్లాలో 921 పంచాయతీలు ఉండగా అందులో 167 పంచాయతీలకు మాత్రమే రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నారు. మరో 153 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న 158 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయూలని నిర్ణరుుంచిం ది. మిగిలిన పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పదేళ్లుగా పనిచేస్తు న్న తమను కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించడమేంటని కాంట్రాక్టు కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ మార్గదర్శకాలు...
డిగ్రీలో మార్కులకు 75 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్వీసులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న వారికి 15 శాతం వెయిటే జీ అదనంగా కలుపుతారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా జరిగే ఎంపికల్లో ఏదైనా డిగ్రీని అర్హతగా నిర్ణయిస్తూ కాంట్రాక్ట్ కార్యదర్శులతో పాటు ఇతరలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి కలెక్టర్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈఓ సభ్యునిగా, డీపీఓ పంచాయతీ సభ్య కన్వీనర్‌గా జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపికలు నిర్వహిస్తుంది.
కాంట్రాక్ట్ కార్యదర్శులకు 25 శాతం వెయిటేజీ..
ఇప్పటికే కాంట్రాక్ట్ కార్యదర్శులుగా పని చేస్తున్న వారికి ఏడాదికి మూడు మార్కులు చొప్పున గరిష్టం గా 25 మార్కులు మించకుండా వెరుుటేజీ కల్పిం చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ జరగనుందని కొద్దిరోజులు గా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమకు ఉద్యోగం కల్పించాలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చుట్టూ నిరుద్యోగులు తిరుగుతున్నారు. జిల్లాలో ఒకేసారి 158 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Published Sat, Nov 9 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement