Gold Prices in 2024: హద్దుల్లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయని ఆశలు పెట్టుకున్న పసిడి ప్రియులను నిపుణుల అంచనాలు కలవరపెడుతున్నాయి. 2024లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.70,000 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో ఆదివారం (2023 డిసెంబర్ 31) నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,550,24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,870 వద్ద ఉంది. 2023 డిసెంబర్ నెల ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. గత మే 4న, గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 61,845, ఔన్స్‌కి 2,083 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 16న ధర మళ్లీ రికార్డు స్థాయిలో రూ.61,914కి చేరుకుందని కా కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ (Commtrendz research) డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐకి తెలిపారు.
రూ.70 వేలకు చేరే అవకాశం
కొత్త సంవత్సరంలో బంగారం ఔన్స్ ధరలు 2,400 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. రూపాయి స్థిరంగా ఉంటే దేశంలో తులం బంగారం ధర రూ.70,000 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను తేలికపరుస్తారన్న అంచనాల నేపథ్యంలో రూపాయి బలహీనపడవచ్చు. ఇది బంగారం దేశీయ ధరలను పెంచే అవకాశం ఉంది.
అమ్మకాలపై తీవ్ర ప్రభావం
యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి బంగారం ధరలలో పెరుగుదలకు దారితీస్తుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ మెహ్రా పేర్కొన్నారు. 2024లో బంగారం ధర ఔన్స్‌కు 2,250 నుంచి 2,300 డాలర్లు, 10 గ్రాముల ధర 68,000 నుంచి 70,000కి చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెరిగిన ధరలు 2024లో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, వచ్చే ఏడాదిలో నగల వ్యాపారం 2023లో ఉన్న స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.భరణాల డిమాండ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment