‘ఇకపై నాలుగేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలతోనే ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందుబాట్లోకి రానున్నాయి’ అని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ‘ఇకపై నాలుగేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలతోనే ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందుబాట్లోకి రానున్నాయి’ అని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. మైనార్టీ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన బీఎడ్ కౌన్సెలింగ్ ప్రక్రియను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని, ఇటీవల వివిధ వర్సిటీల వీసీలతో జరిగిన సమావేశంలో నిర్ణయించామన్నారు. బీఈడీ, ఎంఈడీ కోర్సుల వ్యవధిని కూడా రెండేళ్లకు పెంచనున్నట్లు వేణుగోపాలరెడ్డి చెప్పారు.