
భారతదేశంలో ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. రానున్న రోజుల్లో (2024) పసిడికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని, కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) వెల్లడించింది. 2024లో గోల్డ్ రేటు పెరగటానికి కారణం ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశంలో వేతనాలు పెరగడం, యువ జనాభా సంఖ్య, పట్టణీకరణ కారణంగానే బంగారానికి డిమాండ్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువమంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతుండంతో తులం బంగారం ధరలు రూ. 60వేలు దాటేసింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 70వేలుకి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
బంగారం మీద భారతీయులకు ఉన్న మక్కువ కారణంగానే.. చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తూ ఉన్నారు, దీంతో బంగారానికి డిమాండ్ పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
పెరగనున్న పనిచేసే వారి సంఖ్య
ప్రస్తుతం ఇతరులపై ఆధారపడి జీవించే వారి కంటే.. పనిచేసుకుంటూ ఎదుగుతున్న జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ కేటగిరిలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు. దీంతో భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని, ఇది 2040 వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్
2000 నుంచి 2010 మధ్య కాలంలో బంగారానికి ఉన్న డిమాండ్ సుమారు 40 శాతానికి పైగా పెరిగింది. అంటే బంగారం అమ్మకాలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా అన్ని కార్యక్రమాలకు బంగారు ఆభరణాలను వేసుకోవడం అలవాటు అయిపోవడంతో నగలు ఎక్కువగా కొంటున్నారు. సిటీలో ఉండేవారు గోల్డ్ కాయిన్స్ రూపంలో లేదా బంగారు కడ్డీల (గోల్డ్ బార్) రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment