World Gold Council
-
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్‌గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్‌లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్‌లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్‌లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్‌లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్‌లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్‌లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్‌లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
బంగారు ఆభరణాలే ఎక్కువ..
భారతీయులు బంగారు ప్రియులు. బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో కూడా అత్యధికంగా వాడేది మనమే. అలాగని మనదగ్గరే ప్రపంచంలోకెల్లా ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయనుకుంటే పొరపాటే.ఈ విషయంలో పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం అక్కడ 8133 టన్నుల నిల్వలు ఉన్నాయి. ఆ తరవాతి స్థానాల్లో ఉన్న మూడు దేశాలు.. జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్. ఈదేశాల్లోని మొత్తం నిల్వలతో సమానంగా అమెరికా దగ్గర ఉండటం విశేషం. ఈ విషయంలో మనది 8వ స్థానం. 2023 చివరినాటికి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం ఏయే రూపాల్లో ఎక్కడ ఉందంటే.. -
2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే..
భారతదేశంలో ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. రానున్న రోజుల్లో (2024) పసిడికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని, కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) వెల్లడించింది. 2024లో గోల్డ్ రేటు పెరగటానికి కారణం ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశంలో వేతనాలు పెరగడం, యువ జనాభా సంఖ్య, పట్టణీకరణ కారణంగానే బంగారానికి డిమాండ్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువమంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతుండంతో తులం బంగారం ధరలు రూ. 60వేలు దాటేసింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 70వేలుకి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బంగారం మీద భారతీయులకు ఉన్న మక్కువ కారణంగానే.. చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తూ ఉన్నారు, దీంతో బంగారానికి డిమాండ్ పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. పెరగనున్న పనిచేసే వారి సంఖ్య ప్రస్తుతం ఇతరులపై ఆధారపడి జీవించే వారి కంటే.. పనిచేసుకుంటూ ఎదుగుతున్న జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ కేటగిరిలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు. దీంతో భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని, ఇది 2040 వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్ 2000 నుంచి 2010 మధ్య కాలంలో బంగారానికి ఉన్న డిమాండ్ సుమారు 40 శాతానికి పైగా పెరిగింది. అంటే బంగారం అమ్మకాలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా అన్ని కార్యక్రమాలకు బంగారు ఆభరణాలను వేసుకోవడం అలవాటు అయిపోవడంతో నగలు ఎక్కువగా కొంటున్నారు. సిటీలో ఉండేవారు గోల్డ్ కాయిన్స్ రూపంలో లేదా బంగారు కడ్డీల (గోల్డ్ బార్) రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పసిడి.. పరుగో పరుగు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్ బులియన్ మార్కెట్లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో తీరిది... గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా, తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్ అవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్ ట్రేడింగ్‌లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్‌టైమ్ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్ బ్యాంక్‌లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్ అసెట్‌గా డాలర్ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్‌పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్ పసిడి డిమాండ్ 271 టన్నులు. క్యాలెండర్ ఇయర్లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమసుందరం పీఆర్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. ► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్ భారీగా పడిపోయింది. ► డిమాండ్ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్–జూన్ మధ్య దేశ పసిడి డిమాండ్ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది. ► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది. ► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది. ► పసిడి డిమాండ్‌లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది. ► పసిడి డిమాండ్ భారీగా పెరగడంతో రీసైక్లింగ్ డిమాండ్ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది. ► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి! ఓవర్–ది–కౌంటర్ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్ గోల్డ్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది. ఓటీసీ, స్టాక్ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్ డిమాండ్ మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్‌ను సూచిస్తోందని మండలి వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్ మార్కెట్స్ విశ్లేషకులు లూయీస్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అవుట్‌ఫ్లోస్ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్ మైన్స్ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది. అటు–ఇటు అంచనాలు... పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. దీపావళి సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్‌లో మొత్తం బంగారం డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ -
బంగారం డిమాండ్‌కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
కొత్త బంగారు లోకం
సాక్షి, అమరావతి: నిన్నా మొన్నటి వరకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రజల అభిరుచిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం 14 –18 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లే ప్రజలు ఇలా నిర్ణయం మార్చుకున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారి బడ్జెట్‌కు తగినట్టుగా తక్కువ క్యారెట్లతోనే ఆభరణాలు తయారు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 2021లో దేశ వ్యాప్తంగా 611 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడైనట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో 25 శాతం భారతీయ పెళ్లి కూతుళ్ల కోసమే కొంటున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు యువత మోడ్రన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తుండటంతో వాటికి అనుగుణంగా ఆభరణాలను తయారు చేస్తున్నట్టు దేశీయ బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ బంగారం అమ్మకాల్లో 80 శాతం 22 క్యారెట్ల ఆభరణాలే ఉన్నప్పటికీ.. తక్కువ క్యారెట్ల ఆభరణాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంటున్నారు. గాజులు హారాలదే హవా దేశంలో అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో గాజులు, హారాల వాటాయే అత్యధికం. మొత్తం అమ్మకాల్లో 30–40 శాతం వాటా గాజులు ఆక్రమించగా.. హారాల వాటా 30–40 శాతం ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో నెక్లెస్‌లు 15–20 శాతం వాటా ఉంటే.. చెవిదిద్దులు, చేతి ఉంగరాల అమ్మకాలు 5–15 శాతం చొప్పున ఉంటున్నాయి. ఒక్కొక్క నెక్లెస్ కోసం సగటున 30 నుంచి 60 గ్రాములను వినియోగిస్తుంటే.. గాజుల కోసం 10 నుంచి 15 గ్రాములు, చెయిన్ల కోసం 10 నుంచి 20 గ్రాములు, ఉంగరాలు, చెవిదిద్దుల కోసం 3నుంచి 8 గ్రాముల వరకు బంగారాన్ని వినియోగిస్తున్నారు. పెళ్లి ఆభరణాల వాటా 55 శాతం దేశీయ ఆభరణాల అమ్మకాల్లో వివాహాల సందర్భంగా వినియోగించే ఆభరణాల వాటా 55 శాతం వరకు ఉంది. దేశంలో ఏటా సగటున 1.10 కోట్ల నుంచి 1.30 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. ఆ తర్వాత పంటలు చేతికి వచ్చినప్పుడు, అక్షయ తృతీయ, ధన్‌తేరాస్ వంటి పర్వదినాల్లో బంగారం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో 60 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. కాగా.. పట్టణ ప్రజలతో పోలిస్తే.. గ్రామీణులే అత్యధికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది. మొత్తం బంగారం అమ్మకాల్లో 58 శాతం గ్రామీణ మధ్యతరగతి ప్రజలే కొంటున్నారు. రోజువారీ ధరించే నగల కొనుగోళ్ల వాటా 35 నుంచి 40 శాతం ఉండగా.. ఫ్యాషన్ జ్యూవెలరీ వాటా 5–10 శాతం వరకు ఉంది. దక్షిణాది ప్రజలు అత్యధికంగా ఇష్టపడే టెంపుల్ జ్యూవెలరీ, కుందన్ వంటి భారీ మోడల్స్‌ను ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నట్టు సర్వే వెల్లడించింది. పెళ్లిలకు సగటున 35 నుంచి 250 గ్రాముల బరువుండే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే.. రోజువారీ ధరించేందుకు 5 నుంచి 30 గ్రాముల బరువుండే ఆభరణాలను కొంటున్నారు. ఫ్యాషన్ జ్యూవెలరీ అయితే.. 5 నుంచి 20 గ్రాములలోపు వినియోగిస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. -
World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ భారత్‌లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం. ఆభరణాల డిమాండ్ తీరు.. బంగారం ఆభరణాల డిమాండ్ మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్‌తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్ హెడ్ పీఆర్ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు. పెరిగిన పెట్టుబడులు.. ఇక బార్, కాయిన్ల డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్ క్వార్టర్లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు. -
World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత రిటైల్ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్ స్టోర్లు రిటైల్ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్‌లో జ్యుయలరీ మార్కెట్ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్‌లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది. సానుకూలతలు.. వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్ మార్కింగ్ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్టీ, డీమోనిటైజేషన్ ఇవన్నీ కూడా భారత్‌లో చైన్ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది. నిర్మాణాత్మక మార్పులు ‘‘భారత రిటైల్ జ్యుయలరీ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్ స్టోర్లు మరింత మార్కెట్ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. -
పసిడి డిమాండ్ మామూలుగా లేదుగా, ఆభరణాలు తెగ కొనేశారట..!
న్యూఢిల్లీ: పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. 2022 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు 170.7 టన్నుల బంగారం కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో పుత్తడి కొనుగోలుకు కస్టమర్లు చేసిన వ్యయం 54 శాతం పెరిగి రూ.79,270 కోట్లకు చేరుకుంది. 2022లో మొత్తం 800-850 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండవచ్చు. 2021లో భారత్‌లో 797 టన్నుల మేర పుత్తడి అమ్మకాలు నమోదయ్యాయి. అభరణాలే అధికం.. అక్షయ తృతీయ, సంప్రదాయ వివాహ వేడుకల కారణంగా జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 49 శాతం దూసుకెళ్లి 140.3 టన్నులుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 94 టన్నులు మాత్రమే. వినియోగదార్లు కొనుగోలు చేసిన ఆభరణాల విలువ క్రితం ఏడాదితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రూ.40,610 కోట్ల నుంచి రూ.65,140 కోట్లకు ఎగసింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 20 శాతం వృద్ధి చెంది 30.4 టన్నులుగా ఉంది. వీటి కోసం చేసిన వ్యయం 29 శాతం పెరిగి రూ.14,140 కోట్లకు చేరుకుంది. పునర్వినియోగమైన (రీసైకిల్డ్) బంగారం 18 శాతం అధికమై 23.3 టన్నులకు దూసుకెళ్లింది. గడిచిన త్రైమాసికంలో 170 టన్నుల దిగుమతి అయింది. 2021 ఏప్రిల్-జూన్‌లో ఇది 131.6 టన్నులు. సెంటిమెంట్‌పై ప్రభావం.. ద్రవ్యోల్బణం, పసిడి ధర, రూపాయి-డాలర్ మారకం, విధాన చర్యలు వినియోగదార్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూపాయి, డాలర్ మారకంపై దృష్టి సారించినప్పటికీ ఆర్థిక దృక్పథంపై అనిశ్చితి, అధిక దిగుమతి సుంకం, తాత్కాలిక, వ్యూహాత్మక కారణాల వల్ల బంగారం కొనుగోలుపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం కారణంగా ఈఏడాది రెండో అర్ధభాగంలో దేశీయంగా ఆభరణాల డిమాండ్ ప్రతికూల ముప్పును ఎదుర్కొంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా.. అంతర్జాతీయంగా పుత్తడి డిమాండ్ ఏప్రిల్-జూన్‌లో 8 శాతం పడిపోయి 948.4 టన్నులకు వచ్చి చేరింది. గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి ఉపసంహరణలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లలో క్షీణత, టెక్నాలజీ విభాగం నుండి డిమాండ్ తగ్గడం వంటి కారణాలు ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 28 శాతం తగ్గి 205.8 టన్నులుగా ఉంది. భారత మార్కెట్ తోడుగా నిలవడంతో ఆభరణాల డిమాండ్ 6.15 శాతం పెరిగి 484.3 టన్నులకు చేరుకుంది. చైనాలో ఆభరణాల అమ్మకాలు 28 శాతం పడిపోయాయి. 2022 జనవరి-జూన్‌లో గోల్డ్ డిమాండ్ 12 శాతం అధికమై 2,189 టన్నులకు ఎగసింది. -
భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్‌లో బంగారం మార్కెట్‌పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు. ► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్‌కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం. ► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి. ► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్‌లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది. ► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్‌లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్‌ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. సానుకూల మార్పులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ -
భారత్ బంగారం డిమాండ్ పటిష్టం
ముంబై: భారత్ పసిడి డిమాండ్ తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో వార్షికంగా 19 శాతం పెరిగి 76 టన్నులుగా నమోదయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. అయితే శాతాల్లో భారీ పెరుగుదలకు గత ఏడాది ఇదే కాలంలో తక్కువ డిమాండ్ నమోదు (లో బేస్) ప్రధాన కారణం. 2020 ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ 63.8 టన్నులుగా ఉంది. కరోనా ప్రభావంతో అప్పట్లో కఠిన లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 2021 క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్‌పై డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ విలవ రూపంలో 23 శాతం పెరిగి రూ.26,600 కోట్ల నుంచి రూ.32,810 కోట్లకు చేరింది. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ రెండవ త్రైమాసికంలో వార్షికంగా 25 శాతం పెరిగి 44 టన్నుల నుంచి 55.1 టన్నులకు చేరింది. విలువలో 29 శాతం ఎగసి రూ.18,350 కోట్ల నుంచి రూ.23,750 కోట్లకు ఎగసింది. ► పెట్టుబడుల డిమాండ్ 6 శాతం పెరిగి 19.8 టన్నుల నుంచి 21 టన్నులకు ఎగసింది. విలువలో ఈ విలువ 10 శాతం పెరిగి రూ.8,250 కోట్ల నుంచి రూ.9,060 కోట్లకు ఎగసింది. ► గోల్డ్ రీసైక్లింగ్ 43 శాతం ఎగసి 13.8 టన్నుల నుంచి 19.7 టన్నులకు చేరింది. ► పసిడి దిగుమతులు 10.9 టన్నుల నుంచి భారీగా 120.4 టన్నులకు పెరిగాయి. ఆరు నెలల్లో ఇలా... త్రైమాసికం పరంగా చూస్తే, (2021 జనవరి–మార్చితో పోల్చి) పసిడి డిమాండ్ 46 శాతం పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 140 టన్నులు. కోవిడ్–19 సెకండ్‌వేవ్ ప్రభావం ఏప్రిల్–జూన్ త్రైమాసికం డిమాండ్‌పై కనబడింది. సెకండ్ వేవ్ కారణంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లో పసిడికి అంత డిమాండ్ రాలేదని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సోమసుందరం తెలిపారు. 2021 తొలి ఆరు నెలల్లో పసిడి డిమాండ్ 30 శాతం పెరిగి 216.1 టన్నులకు ఎగసింది. పెరిగిన సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు... డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం, ప్రపంచ పసిడి డిమాండ్ 2021 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దాదాపు స్థిరంగా 955.1 టన్నులుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 960.5 టన్నులు. ఆభరణాలకు సంబంధించి వినియోగదారు పసిడి డిమాండ్ 60 శాతం పెరిగి 244.5 టన్నుల నుంచి 390.7 టన్నులకు చేరింది. కడ్డీలు, నాణేల కొనుగోళ్లు వరుసగా నాల్గవ త్రైమాసికంలోనూ పెరిగాయి. వార్షికంగా 157 టన్నుల నుంచి 244 టన్నులకు చేరాయి. కాగా ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్ల పరిమాణం నుంచి 90 శాతం పడిపోయి 427.5 టన్నుల నుంచి 40.7 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగాయి. ఈ పరిమాణం 63.7 టన్నుల నుంచి భారీగా 199.9 టన్నులకు ఎగసింది. థాయ్‌లాండ్, హంగరీ, బ్రె జిల్ సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేశాయి. సంవత్సరం మొత్తంగా డిమాండ్ 1,600 టన్నుల నుంచి 1,800 టన్నుల శ్రేణిలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా. ఒక్క ఇన్వెస్ట్మెండ్ డిమాండ్ 1,250 నుంచి 1,400 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తోంది. అలాగే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లూ కొనసాగుతాయని విశ్వసిస్తోంది. -
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్‌కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్‌మార్కింగ్‌తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్‌మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్‌లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
బంగారం స్మగ్లింగ్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు!
ముంబై: బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతానికి పరిమితం చేయడంతో అనధికార దిగుమతులు(గ్రే మార్కెట్) తగ్గే వీలున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కస్టమ్స్ తగ్గింపునకు తోడు డిమాండ్ బలపడుతుండటంతో స్మగ్లింగ్‌కు కొంతమేర చెక్ పడవచ్చని అభిప్రాయపడింది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్ డ్యూటీని నికరంగా 2.2 శాతం స్థాయిలో తగ్గించిన విషయం విదితమే. బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం గోల్డ్ బార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీతోపాటు, వ్యవసాయ, ఇన్ఫ్రా సెస్, సామాజిక సంక్షేమ సర్‌చార్జీ కలగలిసి 10.75 శాతానికి చేరాయి. ఇవి బడ్జెట్‌కు ముందు 12.87 శాతంగా అమలయ్యేవి. వీటికి 3 శాతం జీఎస్టీ జత కలవనుంది. దీంతో 14.07 శాతానికి చేరే వీలుంది. అంతక్రితం 16.26 శాతంగా అమలయ్యేది. దేశీ గోల్డ్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం పేరుతో డబ్ల్యూజీసీ ప్రకటించిన నివేదిక ఇంకా ఇలా పేర్కొంది.. 80 శాతం డౌన్ 2020లో పసిడి అనధికార దిగుమతులు 80 శాతం పడిపోయి 20–25 టన్నులకు పరిమితమయ్యాయి. ఇందుకు కోవిడ్–19 కారణంగా లాజిస్టిక్స్ తదితర అవాంతరాలు ఎదురుకావడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021)లోనూ విమానయానంపై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు దీనికి జత కలవనున్నాయి. వెరసి పసిడిలో అధికారిక దిగుమతులు పుంజుకునే వీలుంది. కాగా.. పసిడిపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్: ధర ఎంతంటే.. -
అక్షయ తృతీయ @ ఆన్లైన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపుల ముందు క్యూ కట్టిన కస్టమర్ల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. హిందువులు పవిత్ర దినంగా భావించే అక్షయ నాడు జువెల్లరీ దుకాణాల్లో హడావుడి అంతా ఇంతా కాదు. సెంటిమెంటుగా భావించి చిన్న మొత్తంలో అయినా సరే బంగారం కొనేందుకు షాపులకు వచ్చే కస్టమర్లుంటారు. అయితే కోవిడ్–19 పుణ్యమాని ఈసారి మాత్రం అక్షయ లాక్డౌన్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటే ఆన్లైన్ మినహా ప్రస్తుతం మరో మార్గం లేదు. పలు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ ద్వారా ఆభరణాలు, ముడి బంగారాన్ని కొనుక్కోవచ్చు. లాక్డౌన్ ముగిశాక ఈ పుత్తడిని కస్టమర్లు అందుకోవచ్చు. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది. సిద్ధమైన కంపెనీలు.. ఆభరణాలను, ముడి బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. వ స్త్రాలతోపాటు బంగారాన్ని అమ్మే సంప్రదాయ రిటైల్ కంపెనీలు ఈసారి పుత్తడి అమ్మకాల నుంచి దూరమైనట్టే. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకే అక్షయ కలిసిరానుంది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు అక్షయకు పోటీపడుతున్నాయి. డిస్కౌంట్లను సైతం ఇవి ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ కంపెనీల వెబ్సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్‌ను ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లాక్డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. కస్టమర్ కోరితే ఇంటికే డెలివరీ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా కూడా బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు. అక్షయ వాటా 30–40 శాతం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో భారత్‌లో 690.4 టన్నుల పుత్తడి అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700–800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ తెలిపారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ వాటా 30–40% ఉంటుందని శారీనికేతన్ జువెల్లరీ విభాగం మేనేజర్ గుల్లపూడి నాగకిరణ్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లలో కోవిడ్–19 తద నంతర పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉంది కాబట్టి కొనుగోళ్లకు మొగ్గు చూపరని అన్నారు. వినియోగదార్లలో 20–30% మంది ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక బంగారం కొనేద్దాం.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం: డబ్ల్యూజీసీ న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ఫిన్‌టెక్ ఊతం, ఆర్థి కాంశాలపై పెరుగుతున్న అవగాహన తదితర అంశాల కారణంగా గతంలో ఎన్నడూ బంగారాన్ని కొనని వారు కూడా ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పుత్తడి పెట్టుబడుల్లో ఆభరణాలు, నాణేలదే అగ్రస్థానంగా ఉంటోంది. దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సుమారు 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు భవిష్యత్‌లో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 52 శాతం ఇన్వెస్టర్ల దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉండగా, 48 శాతం మంది గడిచిన 12 నెలల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టారు. ‘భారత్‌లో రిటైల్ పెట్టుబడుల ధోరణులు మారుతున్నాయి. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ విస్తృతి చెందుతుండటం, ఆర్థిక సాధనాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణం‘ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధోరణులు.. సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంత ఇన్వెస్టర్లలో సుమారు 76 శాతం మంది ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేయగా, 21 శాతం మంది గతంలో ఎన్నడూ కొనుగోలు చేయనప్పటికీ భవిష్యత్‌లో కొనాలని భావిస్తున్నారు. అటు గ్రామీణ ఇన్వెస్టర్లలో కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్య 37 శాతంగా ఉంది. కొనుగోలు చేయడంలో సౌలభ్యం, పెట్టుబడికి భరోసా వంటి అంశాల కారణంగానే పసిడివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. -
దేశీయంగా తగ్గనున్న డిమాండ్
ముంబై : పసిడిపై దిగుమతి సుంకాలను 10 శాతం స్థాయి నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ఇది 2.4 శాతం దాకా తగ్గొచ్చని ఒక నివేదికలో వివరించింది. ఒకవేళ అధిక స్థాయి సుంకాలను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించిన పక్షంలో దీర్ఘకాలికంగా వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గుదల ఒక మోస్తరుగా 1% స్థాయిలో వివరించింది. 2018లో భారత్‌లో పసిడి డిమాండ్ 760.4 టన్నులుగా ఉండగా... చైనాలో 994.3 టన్నులు. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో చైనాలో డిమాండ్ 255.3 టన్నులుగా ఉండగా.. భారత్‌లో 159 టన్నులుగా ఉంది. మరోవైపు, భారత్, చైనా దేశాలు విస్తృతంగా వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తుండటం దీర్ఘకాలికంగా పసిడి డిమాండ్‌కు ఊతమివ్వగలవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది. ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా వివిధ సెంట్రల్ బ్యాంకుల ఉదార ఆర్థిక విధానాలతో వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో పసిడిలో పెట్టుబడులకు కొంత మద్దతు లభించగలదని గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 దాకా గణాంకాలను పరిశీలిస్తే పసిడిపై రాబడులు 10.2 శాతం మేర ఉన్నాయని వెల్లడించింది, అమెరికన్ బాండ్లు (5.2 శాతం), అంతర్జాతీయ బాండ్లు (5 శాతం), వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లపై (9.2 శాతం) రాబడులతో పోలిస్తే ఇదే అత్యధికమని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
సమీపకాలం ‘బంగారమే’!
ముంబై: బంగారం డిమాండ్ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది. ఈ ఏడాది (2019) డిమాండ్ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్ కదలికల వంటి అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఒడిదుడుకుల ఫైనాన్షియల్ మార్కెట్ల సమయంలో సహజంగా పసిడి పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచం మొత్తంగా పసిడి డిమాండ్ చూస్తే, చైనా, భారత్‌సహా పలు వర్థమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది. ► గత రెండేళ్లలో ప్రపంచంలో నెలకొన్న పలు అనిశ్చితి ఆర్థిక అంశాల ప్రభావం 2018 చివర్లో స్పష్టంగా కనిపించింది. ఇదే పరిస్థితితో 2019 సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆయా అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్‌లో పసిడి డిమాండ్ పెరుగుదలకే కొంత మొగ్గు ఉంది. ► మార్కెట్ అనిశ్చితి కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇది పసిడికి సానుకూల అంశమే. ► ఈ సందర్భంగా పసిడికి ప్రతికూలమైన వడ్డీరేట్ల పెరుగుదల, డాలర్ పటిష్టతను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫెడ్ వడ్డీరేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలే కనిపిస్తుండటం పసిడికి సానుకూల అంశమే. ► వృద్ధి పెరిగినా, ఆ ఫలాలు అందరికీ అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది పసిడి సెంటిమెంట్‌ను బలపరిచే అంశమే. ► ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇదేరీతిన కొనసాగితే, 2019లో పసిడి ఆభరణాలకూ డిమాండ్ పటిష్టమవుతుందని కౌన్సిల్ భావిస్తోంది. ► పశ్చిమ దేశాల్లో వృద్ధి ధోరణి... వినియోగ సెంటిమెంట్‌ను బలపరిచే అంశం. -
భారత్‌లో పసిడి ధగధగలు..!
ముంబై: దేశంలో సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో బంగారానికి పటిష్ట డిమాండ్ నమోదయ్యింది. ఈ కాలంలో 10 శాతం వృద్ధి నమోదయినట్లు (2017 ఇదే కాలంతో పోల్చితే) వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. పరిమాణం రూపంలో 183.2 టన్నులు. అయితే ప్రస్తుత పండుగల సీజన్లో మాత్రం బంగారం డిమాండ్ అంతంతే ఉండవచ్చని డబ్ల్యూజీసీ అంచనావేసింది. డాలర్ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి ప్రధాన కారణమని విశ్లేషించింది. దీనితోపాటు దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సంబంధ సమస్యలూ ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం తెలిపిన ప్రధాన అంశాల్లో కొన్ని... ►విలువ రూపంలో చూస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 14 శాతం పెరిగి రూ.50,090 కోట్లకు చేరింది. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.43,800 కోట్లు. త్రైమాసికంలో ప్రారంభంలో పసిడి ధరలు పన్నులతో కలసి 10గ్రాములు దాదాపు 29,000 కు పడిపోయింది. డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమిది. ►ఇక రూపాయి పతనంతో ప్రస్తుతం ధరలు ఆరేళ్ల గరిష్ట స్థాయిలకు చేరాయి. 10 గ్రాములు పన్నుల కూడా లేకుండా ధర రూ.32,000–33,000 శ్రేణిలో తిరుగుతోంది. దీనితో మున్ముందు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిమాండ్ పరంగా చూస్తే, ప్రధాన కొనుగోళ్ల రాష్ట్రమైన కేరళ వరదలుసహా పలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుండటం ఇక్కడ గమనార్హం. ►ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 10 శాతం వృద్ధితో 134.8 టన్నుల నుంచి 148.8 టన్నులకు ఎగసింది. విలువ రూపంలో చూస్తే, 14 శాతం వృద్ధితో రూ.35,610 కోట్ల నుంచి రూ.40,690 కోట్లకు చేరింది. ► ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో పెట్టుబడుల డిమాండ్ చూస్తే, 11 శాతం వృద్ధితో 31 టన్నుల నుంచి 34.4 టన్నులకు ఎగసింది. దీని విలువ మొత్తం రూ.8,200 కోట్ల నుంచి రూ.9,400 కోట్లకు చేరింది. ► కాగా పసిడి రీసైక్లింగ్ ప్రక్రియ పరిమాణం 13.85 శాతం తగ్గింది. 26.7 టన్నుల నుంచి 23 టన్నులకు చేరింది. ► త్రైమాసికంలో పసిడి దిగుమతులు 55 శాతం పెరిగాయి. 173 టన్నుల నుంచి 269 టన్నులకు ఎగశాయి. త్రైమాసికం ప్రారంభంలో పసిడి ధర తగ్గడం దీనికి కారణం. ► బంగారం దిగుమతులు ప్రస్తుత ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్ డాలర్లు. ఆభరణాల పరిశ్రమ డిమాండ్ దీనికి నేపథ్యం. ► ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొంత పసిడి కొనుగోలు చేసింది. తాజా గణాంకాల ప్రకారం భారత్ విదేశీ మారకపు నిల్వల్లో దాదాపు 20.23 బిలియన్ డాలర్ల పసిడి నిల్వలు ఉన్నాయి. తొమ్మిదేళ్లలో ఆర్బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటిసారి. ► ఈ ఏడాది మొత్తంలో చూస్తే భారత్ పసిడి డిమాండ్ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా స్థిరం... కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో స్థిరంగా ఉంది. కేవలం ఒక శాతం పెరుగుదలతో 958 టన్నుల నుంచి 964 టన్నులకు చేరింది. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ల అవుట్‌ఫ్లోస్ దీనికి ప్రధాన కారణం. -
పసిడి కొనుగోళ్లకు తగిన సమయం!
ముంబై: ప్రస్తుత పరిస్థితులు పసిడి కొనుగోళ్లకు సరై న సమయంగానే కనిపిస్తోంది. విశ్లేషణలోకి వెళితే... పసిడికి పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి డిమాం డ్ పటిష్టంగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి తాజాగా పేర్కొంది. ఈ డిమాం డ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికను చూస్తే... ♦ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో దేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా పెంచుకోవడంపై కేంద్ర బ్యాంకులు దృష్టి పెట్టాయి. ఇందులో ఎక్కువశాతం పసిడి రూపంలో ఉండాలనే విషయంపై దృష్టి పెట్టడం గమనార్హం. ♦ 2018 మొదటి ఆరు నెలల కాలంలో సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడికి 193.3 టన్నుల బంగారం అదనంగా చేరింది. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే (178.6 టన్నులు) ఇది 8 శాతం అధికం. ♦ ఇప్పటికే పలు సెంట్రల్ బ్యాంకుల విదేశీ మారకపు నిల్వల్లో అమెరికా డాలర్లు భారీగా ఉన్నాయి. వీటికి పసిడితో కొంత రక్షణ కల్పించాలని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి. రష్యా, టర్కీ, కజికిస్తాన్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకుల ఇటీవలి చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ♦ 2015 తర్వాత ఈ స్థాయిలో పసిడికి కేంద్ర బ్యాం కుల నుంచి డిమాండ్ రావడం ఇదే తొలిసారి. ♦ ఈజిప్టు 1978 తరువాత మొట్టమొదటిసారి ఇటీవలే పసిడిని కొనుగోలు చేసింది. ఇండియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ కూడా పలు సంవత్సరాల తర్వాత మళ్లీ పసిడి మార్కెట్లోకి పునఃప్రవేశిస్తున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్బీఐ... రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) 2017–18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్ 30 నాటికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో 200 టన్నుల పసిడిని ఐఎంఎఫ్ నుంచి కొంది. కాగా దేశీయంగా రూపాయి బలహీన ధోరణి భారత్‌లో బంగారం తగ్గడానికి దోహదపడదని విశ్లేషణ. 400 బిలియన్ డాలర్లకు పెరిగిన ఫారెక్స్ నిల్వలు బంగారం నిల్వలు సైతం పెరుగుదల విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) సెప్టెంబర్ 14తో అంతమైన వారానికి 1.207 బిలియన్ డాలర్లు పెరిగి 400.489 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 819 మిలియన్ డాలర్ల క్షీణతతో 399.282 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 13తో ముగిసిన వారంలో నమోదైన 426 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయి కాగా, ఆ తర్వాత నుంచి క్షీణత మొదలైంది. ఇక బంగారం నిల్వలు సైతం సెప్టెంబర్ 14తో ముగిసిన వారంలో 144 మిలియన్ డాలర్లు పెరిగి 20.378 బిలియన్ డాలర్ల విలువకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 1,200 డాలర్లు పటిష్టస్థాయి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గడిచిన నెల రోజులుగా 1,200 డాలర్ల వద్ద కదలాడుతోంది. పసిడికి ప్రస్తుత ధర అంతర్జాతీయంగా పటిష్ట మద్దతు స్థాయని అభిప్రాయం. రూపాయి బలహీనతల వల్ల ఇక భారత్‌లోనూ భారీగా తగ్గే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు. విశ్లేషకుల అంచనాల ప్రకారం– 1,200 డాలర్ల ధర పసిడి ఉత్పత్తిదారులకు కొంత లాభదాయకమైనదే. అయితే ఈ స్థాయికన్నా కిందకు పడితే, ఉత్పత్తి... అందుకు అనుగుణంగా సరఫరాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడికి డిమాండ్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత శ్రేణిలో మరో ఐదారు నెలలు 40 డాలర్ల అటు– ఇటుగా పసిడి కదలికలు జరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. టెక్నికల్‌గా చూసినా, ఫండమెంటల్‌గా చూసినా, నిర్వహణా పరంగా అలోచించినా పసిడి ప్రస్తుతం ‘‘స్వీట్ స్టాప్’’అన్నది వాదన. గోల్డ్ ఈటీఎఫ్‌లలో చైనా పెట్టుబడిదారులు ఇటీవలి కాలంలో 68 డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి కావడం ఇక్కడ గమనార్హం. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్‌ను చూస్తే, 89కి పడిన తర్వాత మళ్లీ 96ను చూసిన ఇండెక్స్ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేక ప్రస్తుతం 93ను చూస్తుండడం ఇక్కడ గమనార్హం. -
పడిన పసిడి డిమాండ్
ముంబై: భారత పసిడి డిమాండ్ 2017–18 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 8 శాతం పడిపోయింది. డిమాండ్ 187.2 టన్నులుగా నమోదయ్యింది. 2016–17 ఇదే కాలంలో దేశీయ పసిడి డిమాండ్ 202.6 టన్నులు. ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ (జీడీటీ) నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ వివరాలను తెలిపింది. ధరలు అధికంగా ఉండటం, సీజనల్ అంశాలు దీనికి కారణం. ముఖ్యాంశాలు చూస్తే... ►ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలువ రూపంలో పసిడి డిమాండ్ రూ.52,692 కోట్లు. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ. 52,750 కోట్లు. ►ఆభరణాలకు సంబంధించి పరిమాణ డిమాండ్ 8 శాతం తగ్గింది. 161 టన్నుల నుంచి 147.9 టన్నులకు పడిపోయింది. విలువలో ఒకశాతం తగ్గి రూ.41,925 కోట్ల నుంచి రూ.41,631 కోట్లకు తగ్గింది. ►పెట్టుబడుల డిమాండ్ పరిమాణంలో 5 శాతం తగ్గి 41.6 టన్నుల నుంచి 39.3 టన్నులకు పడింది. అయితే విలువలో మాత్రం 2 శాతం పెరిగి రూ.10,825 కోట్ల నుంచి రూ.11,061 కోట్లకు చేరింది. ► దేశంలో రీసైకిల్డ్ గోల్డ్ 8 శాతం పెరిగి 29.6 టన్నుల నుంచి 32 టన్నులకు ఎగసింది. ►పసిడి దిగుమతులు త్రైమాసికంలో 38 శాతం పడిపోయి 274 టన్నుల నుంచి 170 టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్)లో దిగుమతులు 13.51 శాతం తగ్గి 555 టన్నుల నుంచి 480 టన్నులకు పడ్డాయి. ► ఏడాది మొత్తంమీద దేశ పసిడి డిమాండ్ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నట్లు డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. దేశంలో పసిడి పరిశ్రమ స్థిరీకరణ దశలో ఉందనీ, దీర్ఘకాలంలో పరిశ్రమకు ఇది లాభిస్తుందన్నారు. అంతర్జాతీయంగా 4 శాతం పతనం కాగా అంతర్జాతీయంగా ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 4 శాతం పడింది. 964.3 టన్నులుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ డిమాండ్ 1,007.5 టన్నులు. -
వచ్చే మూడు దశాబ్దాలూ బంగారమే
ముంబై: వచ్చే మూడు దశాబ్దాలూ బంగారం మార్కెట్ సానుకూలంగానే ఉంటుందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. 2048 నాటికి చైనా ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, భారత్ కూడా దాని అడుగుజాడల్లోనే అభివృద్ధి చెందనుండడంతో బంగారం వెలుగులు కొనసాగుతాయని అంచనా వేసింది. ప్రపంచంలో బంగారం వినియోగం అత్యధికంగా చైనా, భారత్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. బంగారం డిమాండ్‌లో సగం ఆభరణాల రూపంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతర అభివృద్ధి, చైనా, భారత్ తదితర వర్ధమాన దేశాల్లో మధ్య తరగతి వినియోగదారుల ప్రాతినిధ్యం పెరగడం బంగారం మార్కెట్‌కు సానుకూలతలుగా తన నివేదికలో పేర్కొంది. అయితే, బంగారం వెలుగులకు భౌగోళిక రాజకీయ పరంగా సవాళ్లు పొంచి ఉన్నాయని అభిప్రాయపడింది. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలనూ ప్రస్తావించింది. అలాగే, యూరోప్‌లో దీర్ఘకాలం పాటు ఘర్షణ, పెరిగిపోతున్న వృద్ధ జనాభా అంశాలనూ ప్రతికూలతలుగా పేర్కొంది. పెరిగే ఆదాయాలే బంగారంపై పెట్టుబడుల డిమాండ్‌ను నడిపిస్తాయని, హెచ్చు, తగ్గులున్నప్పటికీ ఇది సానుకూలంగానే ఉంటుందని వివరించింది. టెక్నాలజీలోనూ బంగారం వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. బంగారానికి డిమాండ్ పెరిగినా, గతంతో పోలిస్తే సరఫరాలో పెరుగుదల నిదానంగానే ఉంటుందని అంచనా వేసింది. డాలర్ బలోపేతం... రూపాయి బలహీనత వంటి పరిణామాలు కొనసాగితే దేశంలో బంగారం ధరలు 11 గ్రాముల ధర రూ.34,000కు దీపావళి నాటికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,260–1,400 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చన్నారు. ద్రవ్యోల్బణంతో హెడ్జింగ్ కోసం బులియన్‌కు డిమాండ్ పెరగవచ్చని కూడా అంచనాలు ఉన్నాయి. -
భారత్‌లో ఆభరణాల డిమాండ్ బాగుంటుంది
ముంబై: ప్రస్తుతానికి కొంత మందగమనం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బంగారం ఆభరణాలకు భారత్‌లో డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనావేసింది. దేశంలో ప్రజల అభిరుచులు బంగారానికి డిమాండ్ పెంచుతుందని పేర్కొంది. ‘‘బంగారం 2049: వచ్చే 30 సంవత్సరాల్లో పసిడి ధోరణి’’ అన్న అంశంపై డబ్ల్యూజీసీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. చైనాలో కూడా పసిడికి డిమాండ్ దీర్ఘకాలంలో బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ నివేదిక వ్యక్తం చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... చైనాలో ఆదాయాలు పెరుగుతున్నాయి. వినియోగ ఆధారిత ఎకానమీగా చైనా రూపుదాల్చుతోంది. ఇక భారత్ విషయంలో పసిడి ప్రజల అభిరుచుల్లో ఒక భాగం. ఆయా అంశాలు ఇక్కడ పసిడికి డిమాండ్‌కు దోహదపడతాయి. భారత్‌లో గ్రామీణ ఆదాయాలు పెరగడానికి ప్రభుత్వ చర్యలు పసిడికి డిమాండ్ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారత్ విషయంలో 25,000 టన్నుల పసిడి స్టాక్‌ను రీసైక్లింగ్ చేసే కార్యకలాపాలు చురుగ్గా సానుతున్నాయి. ఇది పసిడి దిగుమతులు తగ్గడానికి వీలుకల్పిస్తుంది. -
బంగారం మన దగ్గర మెరిసింది
ముంబై: భారతీయులకు బంగారం పట్ల ఉన్న మక్కువ అంతకంతకూ పెరిగిపోతోంది. 2017లో దేశీయంగా వినియోగం 9 శాతం పెరిగి 727 టన్నులుగా నమోదైంది. కానీ, అంతర్జాతీయంగా మాత్రం డిమాండ్ 7 శాతం పడిపోయింది. ఈ గణాంకాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసింది. 2016లో దేశీయ బంగారం డిమాండ్ 666.1 టన్నులుగానే ఉంది. ‘‘2017లో డిమాండ్ ప్రధానంగా ఆభరణాల వల్లే పెరిగింది. నూతన పన్ను చట్టం జీఎస్టీ స్థిరపడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి ఇవన్నీ కలసి వినియోగదారుల సెంటిమెంట్‌ను మెరుగు పరిచాయి’’అని డబ్ల్యూజీసీ ఎండీ (భారత విభాగం) సోమసుందరం పీఆర్ తెలిపారు. ఆభరణాల కొనుగోళ్లకు యాంటీమనీ లాండరింగ్ చట్టాన్ని తొలగించడం కూడా డిమాండ్ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. 2016లో ఆభరణాల డిమాండ్ 504.5 టన్నులుగా ఉండగా, 2017లో ఇది 12 శాతం పెరిగి 562.7 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే గతేడాది ఆభరణాల డిమాండ్ 9 శాతం వృద్ధితో రూ.1,48,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్ మాత్రం 2016లో 161.6 టన్నులు కాగా, 2017లో ఇది 164.2 టన్నులుగా నమోదైంది. రానున్న రెండేళ్ల కాలంలో కాయిన్ల వృద్ధి అధికంగా ఉంటుందని సోమసుందరం పేర్కొన్నారు. 2018లో డిమాండ్ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నామని, 700–800 టన్నుల మధ్య ఉండొచ్చన్నారు. ఇక దిగుమతుల పరంగా చూస్తే 2017లో 888 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2016లో ఉన్న 558 టన్నుల కంటే ఇది 59 శాతం అధికం. అంతర్జాతీయంగా ప్రతికూలత అంతర్జాతీయంగా చూస్తే 2017లో బంగారం వినియోగం గతేడాది 7 శాతం క్షీణతతో 4,071.7 టన్నులకు పరిమితమైంది. ఈటీఎఫ్‌ల్లోకి తక్కువ పెట్టుబడులు రావడమే కారణంగా డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. 2016లో డిమాండ్ 4,362 టన్నులుగా ఉండటం గమనార్హం. పూర్తి సంవత్సరాన్ని గమనిస్తే ఏడాది అంతటా ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు వచ్చినప్పటికీ 2016లో వచ్చిన నిధులతో పోలిస్తే మూడింట ఒక వంతుగానే ఉన్నాయని డబ్ల్యూజీసీ తెలిపింది. బంగారం కాయిన్లు, బార్ల డిమాండ్ సైతం 2% తగ్గింది. -
బిట్ కాయిన్లు పసిడికి పోటీ కాదు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్ల వంటి క్రిప్టో కరెన్సీలు పసిడికి ప్రత్యామ్నాయం కాబోవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. సమర్థమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో వేల సంవత్సరాలుగా బంగారం కొనసాగుతోందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీలు చోటు దక్కించుకున్నప్పటికీ... ఈ డిజిటల్ ప్రపంచం లోనూ ప్రధానమైన ఆర్థిక అసెట్‌గా బంగారం కొనసాగుతూనే ఉండగలదని తెలిపింది. డబ్ల్యూజీసీ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ ప్రస్తుతం 800 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని, 2017లో బిట్‌కాయిన్ విలువ ఏకంగా 13 రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ‘‘ఇది చూసి ఇక రాబోయే రోజుల్లో బంగారం స్థానాన్ని క్రిప్టో కరెన్సీలు ఆక్రమించేస్తాయని కొందరు భావిస్తున్నారు. కానీ బంగారం, క్రిప్టోకరెన్సీలు రెండూ వేర్వేరు సాధనాలే తప్ప ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదన్నది మా అభిప్రాయం. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో అర్థవంతమైన స్థానం ఉండటం, రేట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకపోవడం, తక్షణం నగదు కింద మార్చుకునే వెసులుబాటు, నియంత్రణ వ్యవస్థల పరిధికి లోబడే ఉండటం వంటివన్నీ బంగారానికి సానుకూలాంశాలు. కానీ క్రిప్టో కరెన్సీలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా ఉన్నప్పటికీ.. బంగారం, ఇతర కరెన్సీలతో పోలిస్తే లావాదేవీల పరిమాణం చాలా తక్కువ’’ అని డబ్ల్యూజీసీ వివరించింది. బంగారం మార్కెట్లో రోజూ 250 బిలియన్ డాలర్ల మేర ట్రేడింగ్ జరుగుతుండగా.. బిట్‌కాయిన్ లావాదేవీలు మాత్రం సగటున 2 బిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటున్నాయని తెలియజేసింది. -
బంగారం ఎక్కువగా కొనేది వీరేనట!
బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పట్టణ, గ్రామీణ ప్రాంతం వారు అనే తేడా లేకుండా బంగారం కొనుగోళ్లను భారీగా చేపడతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు ప్రకారం 2017 తొలి క్వార్టర్ లో ప్రపంచవ్యాప్తంగా బంగారానికున్న డిమాండ్ కు, భారత్ గోల్డ్ డిమాండే మద్దతిచ్చిందని తెలిసింది. భారతీయుల బంగార ఆభరణాల కొనుగోళ్లు ప్రపంచ జువెల్లరీ డిమాండ్ లో ఐదవ స్థానంలో ఉన్నట్టు తేలింది. 2017 తొలి త్రైమాసికంలో భారత్ లో బంగారు జువెల్లరీ డిమాండ్ 92.3 టన్నులు కాగ, అమెరికాలో ఈ డిమాండ్ 22.9 టన్నులుగానే ఉంది. బంగారంలో పెట్టుబడులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కానీ ఏ రాష్ట్రంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలుచేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా? అక్షరాస్యతలో అన్ని రాష్ట్రాల కంటే ఎంతో ముందున్న కేరళ, బంగారం కొనుగోళ్లలోనూ ముందంజలో ఉందట. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు డేటా ఆధారంగా నెలవారీ తలసరి వ్యయంలో బంగారు ఆభరణాలపై కేరళ ఎక్కువగా వెచ్చిస్తుందని తేలింది. 2011-12లో వివిధ రాష్ట్రాలు వస్తువులు, సర్వీసులపై ఏ మేరకు గృహ వినియోగం చేపడుతున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టారు. కేవలం రాష్ట్రాల ఆధారితంగానే ఈ డేటాను రూపొందించారు. రూరల్ కేరళ కేవలం బంగారం కొనుగోళ్లపై ఎక్కువగా వెచ్చించడమే కాకుండా.. తలసరి వ్యయాన్ని కూడా ఆరు రెట్లు పెంచుకుంది. ఈ ర్యాంకింగ్స్ లో గోవా రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ శాంపుల్ సర్వే నివేదించిన ఆరు రాష్ట్రాల డేటాలో కూడా కేరళ చాలా ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపట్టింది. అర్బన్ ఇండియాలో మాత్రమే ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేపడుతున్నారనే డేటాలకు విభిన్నంగా కేరళలో బంగారు కొనుగోళ్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల వారి కంటే కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే కేరళలో బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేపడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం అర్బన్ ప్రాంతం వారు ఎక్కువగా ఈ కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో బంగారంపై జీఎస్టీ రేటు తక్కువగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి కోరడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదని పలువురంటున్నారు. బంగారంపై ఇంకా జీఎస్టీ రేటును నిర్ణయించలేదు. అయితే బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తక్కువ తలసరి బంగారం వినియోగం నమోదైంది.