
26 వేలకు పసిడి ధర
ముంబై: ముంబైలో శనివారం పసిడి ధర రెండు వారాల కనిష్ట స్థాయికి చేరింది. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.165 తగ్గి, రూ. 26,150కు వచ్చింది. ఇక 22 క్యారెట్ల ధర కూడా ఇదే పరిమాణంలో కిందకు దిగి, రూ. 26,000కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.580 తగ్గి, రూ.35,990కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి దీనికితోడు దేశంలో 80:20 పథకం రద్దు పసిడి దర దిగిరావడానికి కారణం. దిగుమతి ఆంక్షలు సడలింపు వల్ల దేశంలో అధికారికంగా బంగారం సరఫరాలు మెరుగుపడతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ శనివారం పేర్కొంది. కాగా శుక్రవారం ట్రేడింగ్‌లో నెమైక్స్ క్రూడ్ బ్యారల్‌కు 66 డాలర్ల స్థాయి వద్ద ముగిసింది.