
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో యూనియన్ బ్యాంక్ రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ.1250 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే రూ. 230-300 కోట్ల నికర లాభం ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .9,133.58 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 9,572.58 కోట్లకు పెరిగింది. ఇందుకు ప్రధానంగా ప్రొవిజన్లు తగ్గడంతోపాటు, ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడటం దోహదం చేసింది.
ప్రొవిజన్లు, కంటెంజెన్సీలు సగానికి తగ్గి రూ. 1617 కోట్లకు చేరాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 2 శాతం క్షీణించి రూ. 2494 కోట్లకు పరిమితమైంది. క్వార్టర్ టూ క్వార్టర్ టూ గ్రాస్‌ఎన్‌పీఏ స్వల్పంగా (0.88),నికర ఎన్‌పీఏలు 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 2017-18 నాటి మూడవ త్రైమాసికంలో 13.03 శాతం నుంచి మొత్తం నికర ఆదాయం (ఎన్‌పీఏ) 15.66 శాతం పెరిగింది. నికర ఎన్ఎపిఏలు కూడా గత సంవత్సరం నుంచి 6.96 శాతం నుంచి 8.27 శాతానికి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment