సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ3లో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో లాభాలను సాధించింది. ఈ క్వార్టర్‌లో ఏకీకృత నికర లాభం 13.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది.గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.లాభం గత త్రైమాసికంలో రూ. 6,021 కోట్లతో పోలిస్తే 9 శాతం పెరిగింది
అలాగే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.31,867 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 20.2 శాతం పెరిగి రూ.38,318 కోట్లగా నమోదైంది. ఇన్ఫోసిస్ తన 2023 ఆర్థిక సంవత్సర ఆదాయ మార్గదర్శకాన్ని(రెవెన్యూ గైడెన్స్) 16.0-16.5 శాతానికి పెంచింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 21-22శాతంగా ఆదాయ ఫలితాల సందర్భంగా ఇన్పీ గురువారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment