దేశీయ అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మంగళవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది
ముంబై: దేశీయ అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మంగళవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అమెరికా మరియు భారతీయ మార్కెట్లలో అమ్మకాలు నెమ్మదించడంతో థర్డ్ క్వార్టర్ లో లాభాలు నామామాత్రంగా నమోదు చేసింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 5 శాతం నికర లాభాలు క్షీణించి రూ.1472 కోట్లను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో రూ.1545 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం8 శాతం పెరిగి 7683 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 9 శాతం పుంజుకుని రూ. 2,453 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 31.5 శాతం నుంచి 31 శాతానికి బలహీనపడ్డాయి. పన్ను వయ్యాలు రూ. 59 కోట్ల నుంచి రూ. 373 కోట్లకు పెరిగాయి.