సాక్షి, ముంబై: దేశీయ ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఎదురు దెబ్బ తప్పలేదు. నికర లాభాలు ఏకంగా 72శాతం పడిపోయాయి. ఆదాయం కూడా గత క్వార్టర్ కంటే కేవలం ఒక శాతం వృద్ధిని మాత్రమే సాధించింది. గురువారం ప్రకటించిన ఫలితాల ప్రకారం ఎయిర్‌టెల్ నికర లాభం 76శాతం రూ.86.2 కోట్లుగా నమోదైంది. గత క్వార్టర్‌లో ఇది గత సంవత్సరంలో రూ.306 కోట్లుగా ఉంది. ఎబిటా 6,307 కోట్లుగా ఉంది.
క్యూ3లో రూ. 20,519 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత క్వార్టర్‌లో నెట్ రెవిన్యూ రూ.20,423 కోట్లు గా ఉంది. ఇండియా వైర్‌లెస్ బిజినెస్‌లో ఎబిటా 17శాతం వృద్ధి చెందగా, ఆఫ్రికా వ్యాపారంలో ఎబిటా మార్జిన్లలో 37శాతం వృద్ధిని సాధించింది గత సంవత్సరంతో 10,751 కోట్లతో పోలిప్తే..మొబైల్ సర్వీసెస్ మీద రెవెన్యూ రూ. 10,189 కోట్లుగా ఉందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. తాము అనుసరించిన విధానాల కారణంగా ఈ క్వార్టర్‌లో వినియోగదారుల పరంగా మెరుగ్గా ఉన్నామని భారతి ఎయిర్‌టెల్ సీఎండీ గోపాల్ విట్టల్ ప్రకటించారు. ఈ త్రైమాసికంలో 4జీ కస్టమర్లు సంఖ్య 11 మిలియన్లకు పైమాటేనని, అలాగే 24వేల బ్రాడ్ బాండ్ల కనెక్షన్లు ఏర్పాటు చేశామని చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment