సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటామెటార్స్ క్యూ3 ఫలితాల్లో నీరస పడింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించిలేక ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. నికర లాభాలు రూ.1215 కోట్లను సాధించింది. అయితే సుమారు రూ. 3,040కోట్ల లాభాలను సాధించనుందని ఎనలిస్టులు అంచనావేశారు. వైడ్ మార్జిన్లు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ బలహీనమైన అమ‍్మకాలు ఫలితాలను దెబ్బతీసినట్టు అంచనా. అయితే దేశీయ వ్యాపారంలో ఆరోగ్యకరమైన పనితీరును నివేదించింది. ముఖ్యంగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో బలమైన ప్రదర్శన ద్వారా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 16 శాతం పెరిగి రూ .74,156 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 63,933 కోట్ల రూపాయలు. డిసెంబర్ 2017 తో ముగిసిన త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్లు 57.8 శాతం పెరిగి రూ .16,101.6 కోట్లకు పెరిగింది. ఈబీఐటీడీఏ వృద్ధిరేటు 77 శాతం క్షీణించి రూ. 1,383 కోట్లు. ఏకీకృత ఆపరేటింగ్ లాభం (వడ్డీకి ముందు ఆదాయం, పన్నులు, తరుగుదల మరియు రుణ విమోచన) 80 శాతం వృద్ధితో రూ. 8,671 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment