Misses Estimates
-
క్యూ3లో నిరాశపర్చిన టాటా మోటార్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటామెటార్స్ క్యూ3 ఫలితాల్లో నీరస పడింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించిలేక ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. నికర లాభాలు రూ.1215 కోట్లను సాధించింది. అయితే సుమారు రూ. 3,040కోట్ల లాభాలను సాధించనుందని ఎనలిస్టులు అంచనావేశారు. వైడ్ మార్జిన్లు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ బలహీనమైన అమ్మకాలు ఫలితాలను దెబ్బతీసినట్టు అంచనా. అయితే దేశీయ వ్యాపారంలో ఆరోగ్యకరమైన పనితీరును నివేదించింది. ముఖ్యంగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో బలమైన ప్రదర్శన ద్వారా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 16 శాతం పెరిగి రూ .74,156 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 63,933 కోట్ల రూపాయలు. డిసెంబర్ 2017 తో ముగిసిన త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్లు 57.8 శాతం పెరిగి రూ .16,101.6 కోట్లకు పెరిగింది. ఈబీఐటీడీఏ వృద్ధిరేటు 77 శాతం క్షీణించి రూ. 1,383 కోట్లు. ఏకీకృత ఆపరేటింగ్ లాభం (వడ్డీకి ముందు ఆదాయం, పన్నులు, తరుగుదల మరియు రుణ విమోచన) 80 శాతం వృద్ధితో రూ. 8,671 కోట్లుగా నమోదైంది. -
కొటక్ నికర లాభం జంప్..అంచనాలు మిస్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఫలితాలు ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్ 23 శాతం నికర లాభాలను ప్రకటించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. గురువారం వెల్లడించిన మొదటి జూన్ త్రైమాసిక పలితాల్లో స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 912.73 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 742 కోట్లను ఆర్జించింది. అయితే రూ.975 గా ఎనలిస్టులు అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17శాతం ఎగిసి రూ. 2246 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.59 శాతం నుంచి 2.58 శాతానికి, నికర ఎన్పీఏలు 1.26 శాతం నుంచి 1.25 శాతానికి నామమాత్రంగా బలహీనపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కొటక్ నికర లాభం 26 శాతం పెరిగి రూ. 1347 కోట్లయ్యింది. ఎన్ఐఐ సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 3525 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) మాత్రం 4.6 శాతం నుంచి 4.4 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఈ త్రైమాసికానికి బ్యాంక్ సీఏఎస్‌ల 43.9 శాతం పెరిగింది. ఈ క్వార్టర్ చివరికి బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ రూ. 2,26,385 కోట్లుగా ఉన్నాయి. ఈ ఫలితాలతో కొటక్ మహీంద్ర బ్యాంక్ షేరు 1.7 శాతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. -
'ఐడియా' ఫ్లాప్: లాభాలు పతనం
ముంబై : దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. సోమవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో తన కన్సాలిడేటెడ్ నికర లాభాలు 74శాతం పతనమై రూ.220 కోట్లగా నమోదుచేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభాలు రూ.851.6 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ ధరలు, తక్కువ వాయిస్ రెవెన్యూలు వల్ల తమ ఆదాయాల పడిపోయినట్టు తెలిపింది. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఐడియా రూ.435 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని అంచనావేశారు. స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడానికి ఒక ఆఫ్ ఖర్చులు లాభాలు పతనమవడానికి దోహదం చేశాయని పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కమర్షియల్ గా ఆవిష్కరించబోయే జియో సేవల నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా యూనిట్లతో పాటు ఐడియా సైతం తన 3జీ,4జీ సర్వీసులపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి, తన డేటా రేట్లలో కోత విధించింది. దీంతో గతేడాది ఒక యూజర్‌కు రూ.147 లుగా ఉన్నమొబైల్ డేటా సగటు రెవెన్యూ, ఈ ఏడాది రూ.142లకు పడిపోయినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఐడియా 4జీ నెట్ వర్క్‌కు 1.8 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్‌కు 1.5 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు తాజా వార్షిక రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు ఐడియా సెల్యులార్ షేర్లు నేటి మార్కెట్లో 2.83 శాతం పతనమై రూ.103.1వద్ద నమోదైంది.