
సాక్షి,ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో చతికిలపడింది. నికరలాభాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకోలేక నిరాశాజనక ఫలితాలను వెల్లడించింది. నికర లాభాల్లో 17.2 శాతం క్షీణతను నమోదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసిక ఫలితాలను ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టలో ఆర్జించిన 17,99 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈ క్యూ3లో రూ. 1489 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దాదాపు రూ.1799కోట్ల లాభాలను ఆర్జించనుదని విశ్లేషకులు అంచనా వేశారు.
ఆదాయం మాత్రం చాలా నామామాత్రంగా 2 శాతమే పెరిగి రూ.19,668 కోట్లను నమోదు చేసింది. నిర్వహణ లాభం(ఇబిటా) 36 శాతం పడిపోయి రూ. 1930 కోట్లకు పరిమితమైంది. మార్జిన్లు 15.7 శాతం నుంచి 9.8 శాతానికి బలహీనపడ్డాయి. కమోడిటీల ధరలు పెరగడం, ఫారెక్స్ నష్టాలు, మార్కెటింగ్ వ్యయాలు వంటి అంశాలు తమ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ మార్కెట్ సమాచారంలో వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు దాదాపు 8 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment