న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 620 కోట్ల నష్టం ప్రకటించింది. ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల ఈ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 4,910 కోట్ల నుంచి రూ. 9,295 కోట్లకు జంప్‌చేసింది.
ప్యాసిజింజర్ టికెట్ల విక్రయాల ద్వారా 98 శాతం అధికంగా రూ. 8,073 కోట్ల ఆదాయం లభించినట్లు ఇండిగో వెల్లడించింది. కాగా.. వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియాను ఎండీగా నియమిస్తున్నట్లు ఇండిగో బోర్డు తాజాగా తెలియజేసింది. ఎండీగా భాటియా కంపెనీ అన్ని విభాగాలకూ సారథ్యం వహించనున్నట్లు ఇండిగో చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ టీమ్‌ను ముందుండి నడిపించనున్నట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం బలపడి రూ. 1,971 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment