ముంబై: కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయన్న అంచనాలతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఐటీ, రియల్టీ షేర్లు లాభపడడంతో స్టాక్ సూచీలు ముగింపులో జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారిగా 34,500 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,650 పాయింట్లపైకి ఎగబాకాయి.
ఈ ఏడాది వేగంగా వృద్ధి చెందనున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న ప్రపంచ బ్యాంక్ నివేదిక సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 34,503 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10,651 పాయింట్ల వద్ద ముగిశాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,559 పాయింట్లు, నిఫ్టీ 10,665 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి.ఇది నిఫ్టీకి ఆల్‌టైమ్‌హై.
నేడు(శుక్రవారం) క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండడటంతో ఇన్ఫోసిస్ షేర్ 2.2 శాతం లాభంతో రూ.1,076 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, 1,083ని తాకింది. ఈ షేర్‌తో పాటు టెక్ మహీంద్రా కూడా 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment