
మారుతి ఫలితాలు ఒకే..భారీ డివిడెండ్
ముంబై: ఆటో దిగ్గజం మారుతి సుజుకి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. గురువారం వెల్లడించిన సంస్థ త్రైమాసిక ఫలితాల్లో రూ. 1709కోట్ల నికర లాభాలు పోస్ట్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 20,751 కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్లు 13.8 శాతంతో రూ. 2561కోట్లుగా నిలిచాయి. మారుతి విక్రయాలు మార్కెట్ అంచనాలను మించి నమోదు అయ్యాయి.
మారుతి రూ. 5 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ.75 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది. గత ఏడాది ఇది రూ. 35లు చెల్లించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకి షేర్ స్వల్ప నష్టపోయినా తిరిగి లాభాల్లోకి మారింది.