పడిపోయిన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం
పడిపోయిన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం
Published Thu, May 4 2017 3:28 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన లాభాలను కోల్పోయింది. మార్చితో ముగిసిన క్వార్టర్ లో ఏడాది ఏడాదికి ఈ దిగ్గజం స్టాండలోన్ నికర లాభాలు 21.58 శాతం క్షీణించి రూ.2,044.20 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభాలు రూ.2,607.05కోట్లగా ఉన్నాయి. ఈ క్వార్టర్ లో కంపెనీ ఫైనాన్స్ కాస్ట్ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.56 శాతం పెరిగి, రూ.5,237.94 కోట్లగా రికార్డైంది. ప్రొవిజన్లు కూడా క్వార్టర్ క్వార్టర్ కు 26.49 శాతం పెరిగాయి.
కానీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ తో పోలిస్తే ఇవి 73 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఈ ప్రొవిజన్లు రూ.148 కోట్లు కాగ, గతేడాది ఇవి రూ.545 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు అంచనాల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈటీ నౌ అంచనాల ప్రకారం ఈ ఆదాయాలు రూ.3,244కోట్లగా ఉంటాయని తెలియగా.. కంపెనీ ఫైలింగ్ ప్రకారం ఇవి రూ.3,215 కోట్లగా మాత్రమే రికార్డయ్యాయి. ఒక్కో షేరుపై ఆర్జించే ఆదాయం కూడా గతేడాది కంటే తగ్గి రూ.12.06గా నమోదైంది. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుపై 15 రూపాయల డివిడెండ్ ఇవ్వాలని బోర్డు ఆమోదించినట్టు ఈ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
Advertisement
Advertisement