అదరగొట్టిన ఐసీఐసీఐ, బోనస్ బొనాంజ!
అదరగొట్టిన ఐసీఐసీఐ, బోనస్ బొనాంజ!
Published Wed, May 3 2017 8:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో అదరగొట్టింది. నాలుగో త్రైమాసికంలో ఏడాది ఏడాదికి లాభాలను మూడింతలు పెంచుకుంది. మార్చి క్వార్టర్ లో మూడింతలు లేదా 188 శాతం పెరిగిన తన నికర లాభాలు రూ.2.025 కోట్లగా ప్రకటించింది.ఈ లాభాలు విశ్లేషకులు అంచనాకు కొంచెం తగ్గాయి. గతేడాది ఇదే క్వార్టర్ లో ఈ దిగ్గజం రూ.702 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. నికర లాభాలను మూడింతలు పెంచుకోవడంతో కంపెనీ బోసస్ బొనాంజను ప్రకటించింది. ప్రతి పది షేర్లకు, ఒక బోనస్ షేరు, ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెంట్ ను అందించనున్నట్టు ఐసీఐసీఐ తెలిపింది. లాభాలతో పాటు బ్యాంకు ఆర్జించే నికర వడ్డీ ఆదాయాలు(రుణాలపై ఆర్జించే వడ్డీరేట్లకు, డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లకు మధ్య తేడా) కూడా 10.3 శాతం ఎగిసి, రూ.5,962 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ ఆదాయాలు రూ.5,405 కోట్లగా ఉన్నాయి.
నాన్-ఇంటరెస్ట్ ఇన్ కమ్ లు కూడా ఈ క్వార్టర్ లో రూ.3,017కోట్లగా ఉన్నట్టు బ్యాంకు పేర్కొంది. ఇదేసమయంలో బ్యాంకు ప్రొవిజన్లు కూడా ఈ క్వార్టర్లో బాగానే పెరిగాయి. గత డిసెంబర్ క్వార్టర్ లో రూ.2,713 కోట్లగా ఉన్న ప్రొవిజన్స్ ఈ క్వార్టర్ లో రూ.2,898 కోట్లగా రికార్డ్ అయ్యాయి. అయితే ఇవి గత ఆర్థికసంవత్సరంతో పోల్చుకుంటే తక్కువే. స్థూల నిరర్థక ఆస్తులు కూడా ఈ క్వార్టర్ లో 7.89 శాతంగా ఉన్నట్టు తెలిసింది. గత క్వార్టర్ లో ఇవి 7.91శాతంగా ఉన్నాయి. నికరంగా చూసుకుంటే ఈ నిరర్థక ఆస్తులు 4.89 శాతం పెరిగాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బ్యాంకు షేరు నేటి ట్రేడింగ్ లో 1.16 శాతం పడిపోయి 272.75గా నమోదైంది. కాగ మార్కెట్ అవర్స్ తర్వాత బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది.
Advertisement