ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ క్యూ4 లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అనిల్ అగర్వాల్ గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,988 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది రూ.21,104కోట్ల నష్టాలతో పోలిస్తే , మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 466.09 మిలియన్ డాలర్లుగా నమోదైంది. కమోడిటీ ధరలు, జింక్ వాల్యూములు పుంజుకున్న నేపథ్యంలో విశ్లేషకులు అంచనాలను బీట్ చేసింది.
ముఖ్యంగా కైయిర్న్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు తర్వాత రూ. 2,667 కోట్ల లాభాన్ని ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. మొత్తం ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ. 23,691 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 35 శాతం పెరిగి రూ .24,612 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 7,350 కోట్లు కాగా మార్జిన్లు 32.7 శాతంగా నమోదయ్యాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 1410 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్‌ఈలో వేదాంతా షేరు 2 శాతం లాభపడింది.
అంచనాలను బీట్ చేసిన వేదాంత
Published Mon, May 15 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
Advertisement