మూడింతలు జంప్ చేసిన డాక్టర్ రెడ్డీస్
Published Fri, May 12 2017 2:25 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో మూడింతలు జంప్ చేసింది. శుక్రవారం ప్రకటించిన మార్చితో ముగిసిన క్వార్టర్ ఫలితాల్లో రూ.337.60 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. అయితే ఈ లాభాలు విశ్లేషకులు అంచనావేసిన రూ.340 కోట్ల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఈ ల్యాబ్స్ నికర లాభాలు రూ.122.6 కోట్లగా ఉన్నాయి. అయితే కంపెనీ రెవెన్యూలు మాత్రం కిందటి ఆర్థిక సంవత్సరం కంటే తగ్గాయి.
ఏడాది ఏడాదికి కంపెనీ రెవెన్యూలు 5.3 శాతం పడిపోయి రూ.3,498.50 కోట్లగా రికార్డయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.3,695.10 కోట్లగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల ఆమోదం తక్కువగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం చాలా ఛాలెంజింగ్ గా ఉందని కంపెనీ కో-చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. ఖర్చుల నిర్మాణంలో హేతుబద్దీకరణ, ఆర్గనైజేషన్ లో క్వాలిటీ కల్చర్ రూపొందించడానికే ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు ప్రసాద్ పేర్కొన్నారు. క్యూ4 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్ నుంచి నష్టాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. 52 వారాల కనిష్ట స్థాయిలకు పడిపోయిన షేర్లు, ప్రస్తుతం లాభాల బాట పట్టాయి.
Advertisement