ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ 2016-17సంవత్సరానికిగాను క్యూ4 ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో భారీ లాభాలను సాధించింది. కంపెనీ నికర లాభం 30 శాతం జంప్‌చేసి రూ. 138 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో (2015-16 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో) 106.79 కోట్ల రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. అయితే నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 2 శాతం తగ్గి రూ. 352 కోట్లకు పరిమితమైంది. మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 1,606.19 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ. 1,447.68 కోట్లగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 5,354.74 కోట్ల రూపాయల నుంచి రూ .5,535.07 కోట్లకు పెరిగింది.
త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.3 శాతం నుంచి 4.2 శాతానికి స్వల్పంగా తగ్గాయి. నికర ఎన్‌పీఏలు మరింత అధికంగా 3 శాతం నుంచి 2.64 శాతానికి దిగివచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 112 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు పెరిగాయి. అలాగే ప్రతిషేరుకు 4 రూపాయల డివిడెండ్ చెల్లించేందకు బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంకు ప్రకటించింది
కర్ణాటక బ్యాంక్ లాభాలు 30శాతం జంప్
Published Sat, May 13 2017 6:07 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
Advertisement