కర్నాటక బ్యాంక్‌లాభం 66% అప్
- ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్
- బేస్‌రేట్ పావు శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: కర్నాటక బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 66 శాతం పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 81 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,173 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.1,308 కోట్లకు చేరిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ పీ. జయరామ భట్ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ ఇస్తామని, బేస్ రేట్‌ను 10.75 శాతం నుంచి 10.50 శాతానికి తగ్గించామని తెలిపారు.