
అపోలో హాస్పిటల్స్ క్యూ4 లాభం రూ.89 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితంతో పోలిస్తే 4.8 శాతం వృద్ధి చెంది రూ.89 కోట్లకు చేరుకుంది. టర్నోవరు 18 శాతం పెరిగి రూ.1,558 కోట్లకు చేరింది. 2014-15తో పోలిస్తే ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 2.6 శాతం తగ్గి రూ.331 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.17.5 శాతం వృద్ధితో రూ.6,085 కోట్లకు చేరుకుంది.