ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్
హైదరాబాద్: స్ట్రైడ్స్ షాసున్ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,003 కోట్ల ఆదాయం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఆర్జించిన ఆదాయం(రూ.702 కోట్లు)తో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని స్ట్రైడ్స్ షాసున్ ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇబిటా రూ.125 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.201 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎండీ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో 2,546 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధితో 3,177 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇబిటా రూ.400 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.581 కోట్లకు ఎగసిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.4(40 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
స్ట్రైడ్స్ షాసున్ ఆదాయం రూ.1,008 కోట్లు
Published Tue, May 17 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM
Advertisement