Strides Shasun Pharma Company
-
స్ట్రైడ్స్కు సలహాదారుగా ఆదిత్య పురీ
న్యూఢిల్లీ, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు విశేష సేవలందించిన ఆదిత్య పురీ తాజాగా ఫార్మా కంపెనీ స్డ్రైడ్స్ గ్రూప్‌లో చేరారు. తద్వారా స్ట్రైడ్స్ గ్రూప్‌నకు సలహాదారుగా సేవలిందించనున్నారు. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్ బయోఫార్మా బోర్డులో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రూప్‌నకు సలహదాదారుగా సేవలందించేందుకు సుప్రసిద్ధ కార్పొరేట్ దిగ్గజం ఆదిత్య పురీ సంస్థలో చేరినట్లు స్ట్రైడ్స్ నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్ బయోఫార్మాలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించింది. (పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్) ట్రాన్సిషన్ దశలో కంపెనీ ప్రాథమిక దశ నుంచి కన్సాలిడేషన్, వృద్ధి దశకు చేరుకుంటున్న సందర్భంలో పురీ చేరిక గ్రూప్‌నకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ పేర్కొంది. అంతర్జాతీయ కంపెనీలు అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి చికిత్సలను అందించడంలో భాగస్వామిగా సేవలందించే దిశలో కంపెనీ సాగుతున్నట్లు తెలియజేసింది. తద్వారా వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో విస్తరించనున్నట్లు వివరించింది. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో పట్టుసాధించిన స్ట్రైడ్స్ గ్రూప్‌తోపాటు, స్టెలిస్ బయోఫార్మా మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా సేవలందించనున్నట్లు పురీ పేర్కొన్నారు. గ్రూప్ సలహాదారుగా, స్టెలిస్ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించనున్న ఆదిత్య పురీకి స్వాగతం పలుకుతున్నట్లు స్ట్రైడ్స్ వ్యవస్థాపక చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పురీ రాకతో గ్రూప్‌పట్ల నమ్మకం మరింత బలపడనున్నట్లు చెప్పారు. పురీ అనుభవం గ్రూప్‌నకు ఎన్నో విధాల ఉపయోగపడనున్నట్లు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ప్రారంభం నుంచీ ఆదిత్య పురీ 25 ఏళ్లపాటు సేవలందించిన విషయం విదితమే. పురీ హయాంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు కొత్త చైర్మన్!) షేరు రికార్డ్ ఆదిత్య పురీ బోర్డులో చేరుతున్న వార్తలతో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. ఎన్ఎస్ఈలో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ షేరు తొలుత 2.6 శాతం ఎగసి రూ. 999ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరిలాభాల స్వీకరణతో వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 945 దిగువన ట్రేడవుతోంది. 2020 మార్చి 20న ఈ షేరు రూ. 268 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 130 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
స్ట్రైడ్స్ ఫార్మా- జీఎంఎం ఫాడ్లర్ హైజంప్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల పతన బాటలో సాగుతున్న ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పుట్టింది. దీంతో మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నప్పటికీ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ గత వారం రోజుల్లో 14 శాతం ర్యాలీ చేసిన స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 755ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 733 వద్ద ట్రేడవుతోంది. ఆందోళనవల్ల తలెత్తే తల నొప్పి నివారణలో వినియోగించగల ట్యాబ్లెట్లకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందిన తదుపరి ఈ కౌంటర్ జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఎక్టావిస్ ల్యాబొరేటరీకి చెందిన బ్యుటల్బిటల్, ఎసిటామినోఫిన్, కెఫీన్ ట్యాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అయిన ట్యాబ్లెట్లకు అనుబంధ సంస్థ ద్వారా స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందినట్లు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో పటిష్ట పనితీరు చూపడంతో గత మూడు నెలల్లో ఈ షేరు 77 శాతం దూసుకెళ్లింది. జీఎంఎం ఫాడ్లర్ రెండు వారాలుగా పతన బాటలో సాగుతున్న జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో యథాప్రకారం తొలుత 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకిన ఈ షేరు తదుపరి టర్న్అరౌండ్ అయ్యింది. కొనుగోలుదారులు పెరగడంతోపాటు.. అమ్మేవాళ్లు కరువుకావడంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి తొలుత నమోదైన ఇంట్రాడే కనిష్టం రూ. 3,433 నుంచి రూ. 3,794కు దూసుకెళ్లింది. ఇది 11 శాతం లాభంకాగా.. మార్కెట్ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్లో ప్రమోటర్లు 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతోంది. వెరసి గత రెండు వారాల్లో ఈ షేరు 40 శాతం దిగజారింది. ఇటీవల ఓఎఫ్ఎస్ ద్వారా ప్రమోటర్లు షేరుకి రూ. 3,500 ధరలో 17.6 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. -
జీఎంఎం ఫాడ్లర్- స్ట్రైడ్స్ ఫార్మా.. హైజంప్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 293 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు చొప్పున ఎగశాయి. కాగా.. మాతృ సంస్థలో వాటా కొనుగోలుకి సిద్ధపడుతున్నట్లు వెల్లడించడంతో ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క లివర్ వ్యాధి(పీబీసీ) చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించినట్లు పేర్కొనడంతో హెల్త్‌కేర్ సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జీఎంఎం ఫాడ్లర్ మాతృ సంస్థ జీఎంఎం గ్రూప్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. పీఈ సంస్థ డాయిష్ బిటైలిగంగ్ నుంచి 54 శాతం వాటాను 27.4 మిలియన్ డాలర్ల(రూ. 205 కోట్లు)కు సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం పటేల్ కుటుంబం మరో 26 శాతం వాటాను కొనుగోలు చేస్తుందని వెల్లడించింంది. మిగిలిన 20 శాతం వాటా పీఈ సంస్థ వద్ద కొనసాగుతుందని తెలియజేసింది. నవంబర్‌కల్లా లావాదేవీలు పూర్తికావచ్చని తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం దూసుకెళ్లి రూ. 6,350ను తాకింది. ప్రస్తుతం 4.25 శాతం ఎగసి రూ. 6114 వద్ద ట్రేడవుతోంది. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ లివర్‌లో తలెత్తే ప్రైమరీ బిల్లరీ సిరోసిస్(బీపీసీ) వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ తాజాగా వెల్లడించింది. ఈ ఔషధాన్ని ఉర్సోడియాల్ బ్రాండుతో 250 ఎంజీ, 500 ఎంజీ డోసేజీలలో ట్యాబ్లెట్ల రూపంలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవి అలెర్గాన్ తయారీ ఉర్సో ఫోర్ట్ ఔషధానికి జనరిక్ వెర్షన్‌గా కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో స్ట్రైడ్స్ ఫార్మా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 618కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.5 శాతం లాభంతో రూ. 610 వద్ద ట్రేడవుతోంది. -
స్ట్రైడ్స్ ఫార్మా- తేజాస్ నెట్వర్క్.. జోష్
మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్ సెంచరీతో సాగుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజాస్ నెట్వర్క్స్, హెల్త్‌కేర్ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. తేజాస్ నెట్వర్క్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తేజాస్ నెట్‌వర్క్స్‌లో 0.81 శాతం వాటాను కేడియా సెక్యూరిటీస్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్‌డీల్స్ డేటా పేర్కొంది. ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియాకు చెందిన ఈ సంస్థ షేరుకి రూ. 49.13 ధరలో దాదాపు 7.54 లక్షల తేజాస్ షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3.7 కోట్లను వెచ్చించింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో తేజాస్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 52 సమీపంలో ఫ్రీజయ్యింది. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా ఫియొరిసెట్ కోడియిన్ క్యాప్సూల్స్ జనరిక్ వెర్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందినట్లు దేశీ హెల్త్‌కేర్ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ తాజాగా పేర్కొంది. వీటిని 50ఎంజీ/325 ఎంజీ, 40 ఎంజీ/30ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. తెవా ఫార్మాకు చెందిన ఫియొరిసెట్ కోడియిన్ క్యాప్సూల్స్ ప్రధానంగా ఒత్తిడితో ఎదురయ్యే తలనొప్పి.. తదితర నొప్పుల నివారణకు వినియోగించవచ్చని స్ట్రైడ్స్ ఫార్మా పేర్కొంది. ఈ నేపథ్యంలో స్ట్రైడ్స్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 426 వద్ద ట్రేడవుతోంది. తొలుత 5 శాతం ఎగసి రూ. 432 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. -
స్ట్రైడ్స్ షాసున్ ఆదాయం రూ.1,008 కోట్లు
ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్ హైదరాబాద్: స్ట్రైడ్స్ షాసున్ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,003 కోట్ల ఆదాయం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఆర్జించిన ఆదాయం(రూ.702 కోట్లు)తో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని స్ట్రైడ్స్ షాసున్ ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. ఇబిటా రూ.125 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.201 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎండీ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో 2,546 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధితో 3,177 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇబిటా రూ.400 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.581 కోట్లకు ఎగసిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.4(40 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు.