
ఐడీబీఐ ఫండ్స్ డివిడెండ్
ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ రెండు ఈక్విటీ పథకాలపై డివిడెండ్లను ప్రకటించింది. ఐడీబీఐ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌పై 10 శాతం, ఐడీబీఐ టాప్ 100 ఈక్విటీ పథకంపై 10% డివిడెండ్ లభించనుంది. ఈ డివిడెండ్లకు రికార్డు తేదీని మే 25గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి ఈ రెండు పథకాల్లో యూనిట్లు కలిగిన వారికి ప్రతీ యూనిట్‌కు రూపాయి డివిడెండ్ లభించనుంది. గతేడాది కాలంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకం 53 శాతం, టాప్ 100 ఈక్విటీ పథకం 34 శాతం రాబడిని అందించాయి.