Equity Schemes
-
ఈఎల్ఎస్ఎస్ను అలవాటుగా మార్చుకోండి
ఒకవైపు పన్ను భారాన్ని తగ్గించుకుంటూ మరోవైపు సంపదను పెంచుకునేలా పెట్టుబడులను ఉపయోగించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీములు (ఈఎల్ఎస్ఎస్) ఆ కోవకి చెందినవే. ఇలాంటి సాధనంలో ఇన్వెస్ట్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ► కష్టమైనదైనా స్థిరంగా, తరచుగా ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అలవాటు ఏర్పడుతుంది. ఒకసారి అలవాటుగా మారిన తర్వాత ఆ పని చేయడం కూడా సులువవుతుంది. ఆర్థిక క్రమశిక్షణలోనూ కొన్ని మంచి అలవాట్లు మనల్ని ఎంతగానో ఆదుకుంటాయి. సాధారణంగా మనకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాలను నిత్యం ఎదురయ్యే అవసరాల కోసం ఖర్చు పెడుతుంటాం. ఈ క్రమంలో పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కన్నా ఖర్చు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడమనేది మనకు సులువైన అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే పొదుపు, పెట్టుబడి చేసి తర్వాతెప్పుడో ప్రతిఫలాన్ని అందుకోవడం కన్నా ఇప్పటికిప్పుడు ఖర్చు చేయడం వల్ల తక్షణం కలిగే సంతృప్తి ఎంతో ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే ధోరణికి అలవాటు పడిపోయి తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసి, పన్ను భారం భయపెడుతుంటే అప్పుడు ఆ భారాన్ని తప్పించుకునేందుకు మార్గాలను వెదకడం మొదలుపెడుతుంటాం. ఆ ఒత్తిడిలో ఇటు పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన రాబడులను ఇవ్వగలిగే పెట్టుబడి సాధనాలను క్షుణ్నంగా తెలుసుకునే అవకాశాలు కోల్పోతుంటాం. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ► వేతనజీవులైన ట్యాక్స్‌పేయర్ల విషయంలో వారి కంపెనీలు పీఎఫ్ రూపంలో ప్రతి నెలా ఎంతో కొంత ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేస్తుంటాయి. పన్ను ఆదా చేసుకునేందుకు సింహభాగం వాటా ఈ రూపంలోనే వెడుతుంటుంది. పన్ను ఆదాకు సంబంధించి సెక్షన్ 80సి కింద ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సహా అనేక చాయిస్‌లు ఉన్నాయి. దీనితో ఏది ఎంచుకోవాలనేదానిపై కాస్త సందిగ్ధం ఏర్పడవచ్చు. ► సెక్షన్ 80సి కింద పన్ను ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈఎల్ఎస్ఎస్ అనేది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. దీనితో రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. పన్నులను ఆదా చేసుకోవడం ఒకటైతే, సంపద సృష్టికి ఉపయోగపడటం రెండోది. మెరుగైన రాబడులు.. మిగతా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు మరింత మెరుగైన రాబడులు ఇస్తాయని రుజువైంది. నిఫ్టి 500 టీఆర్ఐ గత పదేళ్లలో 13.32 శాతం మేర వార్షిక రాబడులు ఇచ్చింది. మిగతా ట్యాక్స్ సేవింగ్ సాధనాలతో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ చాలా తక్కువగా మూడేళ్లే ఉంటుంది. కాబట్టి ఈక్విటీలపై ఆసక్తి గల ఇన్వెస్టర్లు ఈ సాధనాన్ని పరిశీలించవచ్చు. సిప్ ప్రయోజనాలు.. మీకు ప్రతి నెలా ఎలాగైతే వేతనం వస్తుందో, పీఎఫ్ కటింగ్ జరుగుతుందో అదే విధంగా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానాన్ని ఎంచుకోవచ్చు. మన ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేసేటప్పుడు ఆ ప్రక్రియను ఆటోమేటిక్ చేయడం వల్ల ఇన్వెస్ట్ చేయడం సులభతరం అవుతుంది. ఆదాయం ఆర్జించడం, ఖర్చు చేయడం, పొదుపు, విందులు.. విహారయాత్రల తరహాలోనే ట్యాక్స్ సేవింగ్‌ను కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. ఫలితంగా పన్ను ఆదా చేసుకోవడం కోసం ఆఖరు నిమిషంలో హడావిడిగా పరుగులు తీయనక్కర్లేదు. ► సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీలు ఒకోసారి పెరుగుతాయి ఒకోసారి తగ్గుతాయి. ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకే రేటు దగ్గర కొనుగోలు చేసినట్లవుతుంది. అలా కాకుండా సిప్ విధానంలో కాస్త కాస్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. అంటే కొనుగోలు రేటు సగటున తగ్గుతుంది. తత్ఫలితంగా తదుపరి మరింత రాబడులను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ► ఈఎల్ఎస్ఎస్లో అవసరమైనప్పుడు మీకు కావాల్సిన విధంగా పెట్టుబడిని పెంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ముందుగా మీ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మొత్తంతో మొదలుపెట్టండి. క్రమంగా ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పెట్టుబడులు ఒకవేళ సెక్షన్ 80సి కింద గల రూ. 1.5 లక్షల పరిమితి కన్నా తక్కువగానే ఉంటే కాస్త పెంచుకోండి. ► ఇలా క్రమం తప్పకుండా సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇటు సంపద సృష్టికి అదనంగా అటు పన్నుల ఆదాను చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
ఈక్విటీల్లోకి రూ.14,000 కోట్లు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సెప్టెంబర్ నెలలోనూ పురోగతి చూపించింది. ఈక్విటీ పథకాలు గత నెలలో నికరంగా రూ.14,100 కోట్లను ఆకర్షించాయి. దాదాపు అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,418 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో ప్యాసివ్ ఫండ్స్ రూ.13,623 కోట్లను ఆకర్షించ గా, ఈటీఎఫ్‌లు రూ.10,808 కోట్లను రాబట్టాయి. మిడ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ విభాగాలు ఒక్కోటీ రూ. 2,000 కోట్లకు పైనే పెట్టుబడులను ఆకర్షించాయి. డెట్ విభాగంలోకి రూ.65,373 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్‌లో మనీ మార్కెట్, లిక్విడ్ ఫండ్స్ పథకాలకు ఆదరణ లభించింది. అన్ని ఏఎంసీల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి రూ.39.88 లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది సెప్టెంబర్ నాటికి ఉన్న రూ.3 6.73 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతానికి పైగా ఏయూఎం పెరిగింది. ఇక ఈ ఏడాది ఆగస్ట్ చివరికి ఉన్న రూ.39.33 లక్షల కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సెప్టెంబర్ నెలకు సంబంధించి తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది. సిప్ పెట్టుబడులు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు సెప్టెంబర్‌లో కొత్త శిఖరాలకు చేరాయి. రూ.12,976 కోట్ల పెట్టుబడులు సిప్ రూపంలో వచ్చాయి. ఆగస్ట్‌లో ఇలా వచ్చిన పెట్టుబడులు12,694 కోట్లుగా ఉన్నాయి. సిప్ ఖాతాలు కూడా 5.84 కోట్లకు పెరిగాయి. సిప్ ఖాతాలకు సంబంధించి మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.6.39 లక్షల కోట్లకు చేరాయి. పరిశ్రమ వ్యాప్తంగా ఫోలియోల సంఖ్య 13.81 కోట్లకు చేరుకుంది. ఒక పథకంలో ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్/ఖాతాను ఫోలియోగా చెబుతారు. సిప్ మరింత బలపడుతుంది.. సిప్ రూపంలో సెప్టెంబర్‌లో వచ్చిన మొత్తం రూ.12,976 కోట్లకు చేరుకుందని, రానున్న నెలల్లో ఈ మొత్తం రూ.13వేల కోట్లను దాటుతుందని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. గత కొన్ని నెలలుగా మార్కెట్ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. అయినప్పటికీ చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్ఫండ్స్ పెట్టుబడుల పట్ల నమ్మకాన్ని చూపించినట్టు తెలిపారు. సిప్‌ను దీర్ఘకాలంలో సంపద సృష్టికి సాధనంగా వారు చూస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఫండ్స్ ఆస్తులు రూ.37.75 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ చివరికి) రూ.37.75 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. 2021 జూన్ నాటికి ఫండ్స్ ఆస్తులు రూ.33.2 లక్షల కోట్లతో పోలిస్తే 14 శాతం పెరుగుదల నమోదైంది. ఈక్విటీ పథకాల్లోకి స్థిరమైన పెట్టుబడుల రావడం ఇందుకు తోడ్పడింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వివిధ వర్గాలు ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో నిర్వహణ ఆస్తులు మరింత వృద్ధి చెందుతాయని నిపుణులు అంటున్నారు. అయి తే, ఈ ఏడాది మార్చి నాటికి (క్రితం త్రైమాసికం) ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.38.8 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ రకంగా చూస్తే వార్షికంగా ఏయూఎం పెరిగినప్పటికీ.. త్రైమాసికం వారీ తగ్గుదల నమోదైంది. డెట్ విభాగంలో పెట్టుబడుల రాకపోకలు అస్థిరంగా ఉంటుంటాయి. ఈ ప్రభా వం త్రైమాసికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫండ్స్ ఆస్తుల్లో వార్షికంగా వృద్ధి నమోదు కావడం ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుందనడానికి నిదర్శంగా ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. నిషేధం లేకపోతే మరింతగా.. ‘‘జూన్ త్రైమాసికంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), లంప్సమ్ (ఏక మొత్తంలో) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయి. నూతన పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) ఆవిష్కరణకు అనుమతిస్తే ఈ పెట్టుబడుల రాక మరింత మెరుగ్గా ఉండేది’’అని శామ్కో సెక్యూరిటీస్ గ్రూపు హెడ్ ఓంకారేశ్వర్ సింగ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని అమలు చేసే వరకు కొత్త పథకాల ప్రారంభాన్ని సెబీ నిలిపివేసింది. ‘‘ఈక్విటీ పెట్టుబడులు అందిస్తున్న సంపద సృష్టి మార్గాన్ని మరింత మంది ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. దీర్ఘకాల పరిశ్రమ వృద్ధి అంచనాలకు అనుగుణంగానే గణాంకాలు ఉన్నాయి’’అని ఎన్జే ఏఎంసీ సీఈవో రాజీవ్ శాస్త్రి పేర్కొన్నారు. ‘‘సాధారణంగా మార్కెట్లు పెరగడం లేదా అదనపు పెట్టుబడుల రావడం వల్ల ఆస్తుల్లో వృద్ధి కనిపిస్తుంది. కానీ, మార్కెట్ గత ఏడాది కాలం నుంచి ఫ్లాట్‌గా (వృద్ధి లేకుండా స్థిరంగా) ఉంది. కనుక ఆస్తుల్లో వృద్ధి ప్రధానంగా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వల్లే నమోదైంది’’అని ప్రైమ్ ఇన్వెస్టర్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. గతంతో పోలిస్తే నేడు కార్పొరేట్, రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను గుర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాల లేదా దీర్ఘకాల పెట్టుబడులను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అత్యధికి నిర్వహణ ఆస్తులతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి స్థానంలో కొనసాగింది. -
మహీంద్రా కొత్త ఈక్విటీ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ‘టాప్ 250 నివేష్ యోజన’ పేరుతో కొత్త ఈక్విటీ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీం డిసెంబరు 6న ప్రారంభమై అదే నెల 20న ముగుస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో 80 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ఎండీ అశుతోష్ బిష్ణోయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల్లో 65 శాతం వరకు ఈ పెట్టుబడి ఉంటుందని చెప్పారు. 20 శాతం వరకు డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. కంపెనీ నుంచి ఇది ఎనిమిదవ పథకం. మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏడు ఈక్విటీ పథకాల్లో రాబడులు 17–20 శాతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. -
పన్ను ప్రయోజనాలే ముఖ్యం కాదు..
రానున్న బడ్జెట్లో ఈక్విటీ స్కీమ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించే అవకాశాలున్నాయని మిత్రులంటున్నారు. అలా జరుగుతుందా ? అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉన్నా కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? వివరించగలరు. - శశికాంత్, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్కీమ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించే అవకాశాలను అంచనా వేయలేం. బడ్జెట్ వరకూ వేచి చూడడమే మంచిది. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తుందన్న అంచనాలతో ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడం సరైన నిర్ణయం కాదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఈ విషయమై బడ్జెట్లో ఒక స్పష్టత వచ్చే వరకూ ఓపికపట్టండి. పన్ను మినహాయింపులున్నాయన్న ఒకే ఒక్క కారణంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదన్న విషయం గుర్తించుకోండి. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే, దీర్ఘకాలంలో మరే ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకంటే కూడా ఈక్విటీలపైననే అధిక రాబడులు వస్తాయి. మూలధన లాభాల పన్ను మినహాయింపు లభించడమనేది అదనపు ప్రయోజనం మాత్రమే. అందుకని ప్రభుత్వం రానున్న బడ్జెట్లో ఈక్విటీలపై మూలధన లాభాల పన్ను విధించినప్పటికీ, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాధాన్యత ఏమీ తగ్గదు. అయితే ఇలా పన్ను విధిస్తే లాభాల్లో కొంత కోత ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండొచ్చన్న ఒకే ఒక కారణంతో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వైదొలగాలనుకోవడం సరైన వ్యూహం కాదు. దీర్ఘకాలంలో మంచి రాబడులనిచ్చేలా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ప్రత్యామ్నాయమేదీ లేదు. అందుకని పన్నులు విధించినా సరే, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. నేను నెలకు రూ.10,000 చొప్పున ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాక్-ఇన్-పీరియడ్‌కు ముందే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చా? ఏమైనా అత్యవసర సందర్భాలు వస్తే ఎంతో కొంత జరిమానా చెల్లించి ఈ సొమ్ములను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉందా ? - రవళి, విశాఖపట్టణం పన్ను ప్రయోజనాలు లభించే ప్రతీ ఇన్వెస్ట్‌మెంట్‌కు లాక్-ఇన్-పీరియడ్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు మూడేళ్ల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. ఈ లాక్-ఇన్-పీరియడ్‌కు ముందే ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవడం కుదరదు. జరిమానా చెల్లించి లాక్-ఇన్-పీరియడ్ కంటే ముందే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు. నేను అక్టోబర్ 2005లో ఐసీఐసీఐ ప్రు లైఫ్‌టైమ్ పెన్షన్ ప్లాన్ టూ ను తీసుకున్నాను. వార్షిక ప్రీమియం రూ.15,000 చొప్పున చెల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యాయి. మెచ్యూరిటీకి ముందే ఈ స్కీమ్‌ను క్లోజ్ చేయవచ్చా? ఇలా క్లోజ్ చేస్తే నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? లేకుంటే ఈ స్కీమ్‌లో కొనసాగమంటారా? - ఆనంద్, విజయవాడ ఐసీఐసీఐ ప్రు లైఫ్‌టైమ్ పెన్షన్ ప్లాన్ టూ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూలిప్). మీరు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపకరిస్తుంది. మీరు రిటైర్ కావాలనుకున్నప్పుడు యాన్యుటీని కొనుగోలు చేయాలి. మీకు ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమైన పక్షంలో, యాన్యుటీ కొనుగోలు అవసరం లేదనుకుంటే, ఈ పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. మీరు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి పదేళ్లు దాటాయి. కనుక మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. మీరు సరెండర్ చేసేటప్పుడు ఫండ్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే మొత్తం కూడా సరెండర్ వాల్యూగా వస్తుంది. మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం, ఈ సరెండర్ విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌తో కలగలసి ఉన్న బీమా ప్లాన్లు తగిన రాబడులనివ్వలేవని చెబుతుంటాం. ఈ ప్లాన్లు ఖరీదైనవే కాకుండా, చాలా చార్జీలు వీటిల్లో ఉంటాయి. ఇవి తగినంత బీమా రక్షణ ఇవ్వలేవు. ఇన్వెస్ట్ చేయడానికి తగిన సాధనాలు కూడా కావు. అందుకనే ఇన్వెస్టర్లు ఎప్పుడూ బీమాకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వేర్వేరు సాధానాల్లో ఇన్వెస్ట్ చేయాలి. జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. వీటికి ప్రీమియం తక్కువ. బీమా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఐడీబీఐ ఫండ్స్ డివిడెండ్
ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ రెండు ఈక్విటీ పథకాలపై డివిడెండ్లను ప్రకటించింది. ఐడీబీఐ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌పై 10 శాతం, ఐడీబీఐ టాప్ 100 ఈక్విటీ పథకంపై 10% డివిడెండ్ లభించనుంది. ఈ డివిడెండ్లకు రికార్డు తేదీని మే 25గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి ఈ రెండు పథకాల్లో యూనిట్లు కలిగిన వారికి ప్రతీ యూనిట్‌కు రూపాయి డివిడెండ్ లభించనుంది. గతేడాది కాలంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకం 53 శాతం, టాప్ 100 ఈక్విటీ పథకం 34 శాతం రాబడిని అందించాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయి 28227 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 134 పాయింట్ల నష్టపోయి 8526 వద్ద ముగిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయ్... * జీడీపీ, ఐఐపీ డేటా కూడా... * ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియాల ఫలితాలపై దృష్టి * ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా... న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఏఏపీ) విజయం సాధించవచ్చంటూ వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌కు అనుగుణంగా ఈ సోమవారం స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయని, అటుతర్వాత మంగళవారం ప్రకటితమయ్యే వాస్తవ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్లు కదలవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఢిల్లీ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం వున్నందున, స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని వారంటున్నారు. ఈ వారం వెలువడే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)గణాంకాలు, కొన్ని బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ట్రెండ్‌ను నిర్దేశించే పలు అంశాల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా వుంటాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా అన్నారు. సోమవారం జీడీపీ అడ్వాన్సు అంచనాల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని, 2014 డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, గత జనవరి నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చే గురువారం ప్రకటితమవుతాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ చెప్పారు. ఇవి ఈ వారం ద్వితీయార్థంలో ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయన్నారు. బ్లూచిప్ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో, డీఎల్ ఎఫ్, బీహెచ్ఈఎల్, సిప్లా, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, మహీంద్రా, ఎస్బీఐలు క్యూ3 ఆర్థిక ఫలితాల్ని ఈ వారం వెల్లడించనున్నాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియాల ఫలితాలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటాల ఆధారంగా స్టాక్ సూచీలు కదలవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ పరిణామాలకొస్తే... గ్రీసు రుణ ప్రతిపాదనలను చర్చించేందుకు యూరో దేశాల ఆర్థిక మంత్రులు బుధవారం సమావేశం కానున్నారు. యూరో ప్రాంతపు జీడీపీ గణాంకాలు శుక్రవారం విడుదలకానున్నాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 12,000 కోట్లు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఫిబ్రవరి నెల తొలివారంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్ల నికర పెట్టుబడులు జరిపారు. వీటిలో ఫిబ్రవరి2-6వ తేదీల మధ్య షేర్లలోకి రూ. 4,702 కోట్లు ప్రవహించగా, రూ. 7,059 కోట్లు రుణపత్రాల్లోకి తరలివ చ్చాయి. తాజా నిధులతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు దేశంలో మొత్తం రూ. 45,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేసినట్లయ్యింది. ఈక్విటీ స్కీముల్లోకి రూ. 5,850 కోట్లు: ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ పథకాల్లో రూ. 5,850 కోట్లు పెట్టుబడి చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఈక్విటీ స్కీములు సమీకరించిన నిధుల మొత్తం రూ. 56,000 కోట్లకు చేరినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అధిక రాబడులు, సెంటిమెంట్ మెరుగుపడటంతో ఈక్విటీ స్కీములు అధిక పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతున్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. తాజా నిధుల ప్రవాహంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 12 లక్షల కోట్లకు పెరిగింది.