
నవభారత్ వెంచర్స్ లాభం రూ. 24 కోట్లు
నవభారత్ వెంచర్స్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 279 కోట్ల ఆదాయంపై రూ. 24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నవభారత్ వెంచర్స్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 279 కోట్ల ఆదాయంపై రూ. 24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 314 కోట్ల ఆదాయంపై రూ. 46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది మొత్తం మీద చూస్తే రూ. 1,153 కోట్ల ఆదాయంపై రూ. 142 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వాటాదారులకు ప్రతీ షేరుకు రూ. 5 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.