వీఎస్‌టీ లిమిటెడ్ నాల్గవ త్రైమాసికంలో రూ. 219 కోట్ల ఆదాయంపై రూ. 41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఎస్‌టీ లిమిటెడ్ నాల్గవ త్రైమాసికంలో రూ. 219 కోట్ల ఆదాయంపై రూ. 41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 189 కోట్ల ఆదాయంపై రూ. 52 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ. 70 డివిడెండును బోర్డు రికమెండ్ చేసింది. మంగళవారం ఈ షేరు స్వల్ప నష్టంతో రూ.1,591 వద్ద ముగిసింది.