
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2018–19 సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 14.4 శాతం పెరిగింది.
లాభం రూ.111 కోట్ల నుంచి రూ.127 కోట్లకు ఎగసింది. టర్నోవర్ రూ.1,006 కోట్ల నుంచి రూ.1,244 కోట్లకు చేరింది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.2,341 కోట్ల టర్నోవరుపై కంపెనీ రూ.209 కోట్ల నికరలాభం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment