
ఇండిగో లాభం రూ. 579 కోట్లు
ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.579 కోట్ల నికర లాభం సాధించింది.
♦ వరుసగా 8వ ఏడాది లాభాలే
♦ ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.579 కోట్ల నికర లాభం సాధించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.577 కోట్లు. ఎక్కువ మంది ప్రయాణించినప్పటికీ, అధిక వ్యయాలు కారణంగా నికర లాభంలో పెద్దగా పురోగతి లేదని కంపెనీ వెల్లడించింది. ఆదాయం రూ. 3,823 కోట్ల నుంచి 7% వృద్ధి తో రూ.4,091 కోట్లకు పెరి గిందని ఇండిగో ప్రెసిడెంట్, పూర్తి కాలం డెరైక్టర్ ఆదిత్య ఘోష్ చెప్పారు.
ప్రయాణికుల సంఖ్య 12% పెరిగి 89.3 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఇక 2014-15 లో రూ.1,304 కోట్లుగా ఉన్న నికర లాభం 2015-16లో రూ.1,990 కోట్లకు పెరిగిందన్నారు. వరుసగా 8వ ఏడాది లాభాలు సాధించామని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.15 తుది డివిడెండ్ కంపెనీ ప్రకటించింది.