
గతి స్పీడ్... నికర లాభం రూ. 16 కోట్లు
మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాజిస్టిక్స్ సంస్థ గతి నికర లాభం 37 శాతం పెరిగి సుమారు రూ. 16 కోట్లుగా నమోదైంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాజిస్టిక్స్ సంస్థ గతి నికర లాభం 37 శాతం పెరిగి సుమారు రూ. 16 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 11 కోట్లు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం రూ. 416 కోట్ల నుంచి రూ. 428 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 2 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై యాభై శాతం మేర రూ. 1 తుది డివిడెండును ప్రకటించింది. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) ముగిసిన 30 రోజుల్లోగా దీన్ని చెల్లించనున్నట్లు గతి పేర్కొంది. మరోవైపు, ఆగస్టు 1 నుంచి మరో అయిదేళ్ల పాటు ఎండీగా మహేంద్ర అగర్వాల్ పునర్నియామక ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.