
న్యూఢిల్లీ: భారత్ ఫోర్జ్ 2018–19 మార్చి త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో మెప్పించింది. స్టాండలోన్ లాభం మూడు రెట్లు పెరిగి రూ.299 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.1,718 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో(2017–18, క్యూ4) లాభం రూ.100 కోట్లు, ఆదాయం రూ.1,500 కోట్లుగా ఉన్నాయి.
2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10,348 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.1,032 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,556 కోట్లు, లాభం రూ.753 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ రూ.2.5 ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment