Bharat Petroleum
-
ఆయిల్ కంపెనీలకు చేదువార్త
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలను బడ్జెట్ నిరాశపరిచింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచి్చన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ. 30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ. 5,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. షేర్లు డీలా... తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐఓసీ షేర్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.క్రూజ్ పర్యాటకానికి ప్రోత్సాహంవిదేశీ షిప్పింగ్ కంపెనీలపై సులభతర పన్ను దేశీ క్రూజ్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూజ్ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ విభాగంలో భారత షిప్పింగ్ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్ రెసిడెంట్ షిప్ ఆపరేటర్ రెండూ ఒకే హోల్డింగ్ కంపెనీ కింద ఉంటే లీజ్ రెంటల్ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కలి్పస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్పీఎస్పై మరింత పన్ను ప్రయోజనంనూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్పీఎస్ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్పీఎస్ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ ఖాతా తెరిచేందుకు ‘ఎన్పీఎస్ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు. ఈకామర్స్ ఎగుమతులకు దన్నుహబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈకామర్స్ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ విధానం(పీపీపీ)లో వీలు కలి్పంచనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సరీ్వసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం ఈకామర్స్ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాదిత కేంద్రా(హబ్)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్లను వీటికి జత చేస్తారు.డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 50,000 కోట్లు ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్ఈలు) నుంచి రూ. 56,260 కోట్ల డివిడెండ్ లభించవచ్చని భావిస్తోంది.మధ్యంతర బడ్జెట్లో వేసిన అంచనాలు రూ. 48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ. 2,32,874 కోట్ల డివిడెండ్ అందుకునే చాన్స్ ఉన్నట్లు బడ్జెట్ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ. 2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్ ఈ పద్దుకింద రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకతఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు దివాలా కోడ్ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ. 3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్సహా 15 నగరాల్లో ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. టెలికం పరికరాల దిగుమతులకు చెక్10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు దేశీయంగా టెలికం గేర్ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.అయితే కమ్యూనికేషన్ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్ తదితరాలున్నాయి.రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునః మదింపుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.పన్నుల విషయంలో అనిశి్చత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు. పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్ సే విశ్వాస్ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. సమతౌల్యత సాధన..ప్రజాదరణ, విధాన చర్యల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రభుత్వం ప్రయతి్నంచింది. రైతులకు ద్రవ్య మద్దతు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో అధిక మినహాయింపు పరిమితులు, పెరిగిన ప్రామాణిక తగ్గింపులు వంటి కార్యక్రమాలు ఖర్చు చేయదగ్గ అధిక ఆదాయాన్ని అందిస్తాయి. ఇది వ్యయాలను పెంచడానికి దారి తీస్తుంది. – కుమార్ రాజగోపాలన్, సీఈవో, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.కీలక పురోగతి..ఊహించినట్లుగా 2024 యూనియన్ బడ్జెట్ సౌర, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఒక కోటి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది. కస్టమ్ డ్యూటీ మినహాయింపు జాబితా నుండి సోలార్ గ్లాస్, గ్లాస్, కాపర్ వైర్ కనెక్టర్లను తొలగించడం వివేకవంతమైన చర్య. అభివృద్ధి చెందుతున్న దేశీయ పరిశ్రమకు మద్దతుగా ఈ నిర్ణయం కీలకం. – విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అద్భుతమైనది ఏమీ లేదు..ఆతిథ్య రంగానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి బడ్జెట్లో అద్భుతమైనది ఏమీ లేదు. – ప్రదీప్ శెట్టి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అసోసియేషన్స్వ్యవసాయానికి దన్నువ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచినందున ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంపొందించడంపై కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతను స్వాగతిస్తున్నాము. ఉత్పాదకతను మెరుగుపరచడం, వాతావరణాన్ని తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత సమగ్ర సమీక్ష భారతీయ వ్యవసాయం వాతావరణ ప్రభావాన్ని తట్టుకోగలదని నిర్ధారించడానికి ఒక ప్రేరణనిస్తుంది. – అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్.వృద్ధి ఆధారితంఅభివృద్ధి ఆధారిత బడ్జెట్. ఇది స్వల్పకాలిక డిమాండ్ ఉద్దీపన, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ మధ్యకాలిక వృద్ధి ఆవశ్యకతలపై దృష్టి సారించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ అందరినీ కలుపుకొని ఉంది. – అనీశ్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ.సాహసోపేతందీర్ఘకాలిక ఆర్థిక వివేకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత బడ్జెట్ ఇది. దేశంలో తయారీ, ఎంఎస్ఎంఈల పటిష్ట పాత్ర ద్వారా ఉద్యోగ కల్పన యొక్క సుదీర్ఘ, మరింత స్థిర మార్గంపై దృష్టి పెడుతుంది. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.మౌలిక రంగ పురోగతి లక్ష్యంవివిధ ముఖ్య ప్రాజెక్టులు, కేటాయింపుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిస్సందేహంగా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించి పరివర్తనాత్మకంగా, ముందుకు చూసేదిగా బడ్జెట్ ఉంది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతపై బలమైన దృష్టిని కలిగి ఉంది. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.ఉపాధి కల్పనకు ఊతంబడ్జెట్లో పురోగామి ప్రతిపాదనలు చేశారు. దీనితో ఉత్తరాంధ్రలో కనీసం 2,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి గణనీయంగా అవకాశాలు కలి్పంచడం ద్వారా దేశీయంగా ఉపాధి కల్పన ముఖచిత్రాన్ని మార్చే విధంగా బడ్జెట్ ఉంది. – గేదెల శీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ -
షేరుకు మరో షేరు ఫ్రీ.. ! ప్రభుత్వ కంపెనీ బంపర్ ఆఫర్
-
చమురు సంస్థలకు వేల కోట్ల నష్టం, ధరలు పెంచకపోవడం వల్లే?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మరోసారి నష్టాలు ప్రకటించే అవకాశమున్నట్లు బ్రోకింగ్ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో ఉమ్మడిగా రూ. 21,270 కోట్ల నష్టాలు నమోదుకావచ్చని పేర్కొంది. వెరసి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు ప్రకటించనున్నట్లు తెలియజేసింది. చమురు పీఎస్‌యూలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఉమ్మడిగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 18,480 కోట్ల నష్టాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్, దేశీ ఎల్పీజీ విక్రయాలలో మార్కెటింగ్ మార్జిన్లు క్షీణించడం ప్రభావం చూపింది. ఈ బాటలో క్యూ2లోనూ మార్కెటింగ్ మార్జిన్లు బలహీనపడటంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తాజా నివేదికలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఇతర వివరాలిలా.. నవంబర్‌లో చమురు పీఎస్‌యూలు ఈ నెలఖారు లేదా వచ్చే నెల(నవంబర్)లో క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. క్యూ1లో రికార్డు రిఫైనింగ్ మార్జిన్లు సాధించినప్పటికీ పెట్రోల్, డీజిల్ రోజువారీ విక్రయ ధరలను సవరించకపోవడంతో లాభాలు ఆవిరయ్యాయి. నష్టాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి వ్యయాలు, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో మార్జిన్లు క్షీణించాయి. ఈ పరిస్థితి మూడు చమురు పీఎస్‌యూలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇది క్యూ2లోనూ కొనసాగడంతో ఆర్థిక పనితీరు మరింత నీరసించనుంది. త్రైమాసికవారీగా స్థూల రిఫైనింగ్ మార్జిన్ల(జీఆర్ఎం)లో బ్యారల్‌కు 5.6–15.9 డాలర్లమేర కోత పడనుంది. అయితే బ్లెండెడ్ రిటైల్ ఇంధన నష్టాలు తగ్గడంతో కొంతమేర కంపెనీలకు మేలు జరగనుంది. క్యూ1లో నమోదైన రూ. 14.4తో పోలిస్తే క్యూ2లో ఇవి రూ. 9.8కు పరిమితమయ్యే వీలుంది. ఇబిటా నష్టాలు మొత్తంగా క్యూ2లో చమురు పీఎస్‌యూల నిర్వహణ(ఇబిటా) నష్టాలు రూ. 14,700 కోట్లకు చేరనున్నాయి. నికర నష్టాలు మరింత అధికంగా రూ. 21,270 కోట్లను తాకవచ్చు. గత ఆరు నెలలుగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టకపోవడం గమనార్హం! 2017లో రోజువారీ ధరల సవరణను అమల్లోకి తీసుకువచ్చాక ఆరు నెలలపాటు నిలిపివేయడం ఇదే ప్రథమం! ఇదే సమయంలో ముడిచమురు ధరలు పుంజుకోవడం, డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. ఇక వంటగ్యాస్ ధరలను సైతం వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం ప్రస్తావించ దగ్గ విషయం. కంపెనీలవారీగా... నివేదిక ప్రకారం క్యూలో ఐవోసీ రూ. 6,300 కోట్ల నష్టాలు నమోదు చేసే వీలుంది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,900 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 8,100 కోట్ల నష్టాలు ప్రకటించవచ్చు. వెరసి తొలిసారి మూడు పీఎస్‌యూలు వరుస త్రైమాసికాలలో నష్టాలు ప్రకటించడం ద్వారా రికార్డ్ నెలకొల్పనున్నాయి. క్యూ1లోనూ ఐవోసీ రూ. 1,995 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ. 10,197 కోట్లు(సరికొత్త రికార్డ్), బీపీసీఎల్ రూ. 6,291 కోట్లు చొప్పున నష్టాలు ప్రకటించాయి. దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధరల సవరణను చేపట్టే సంగతి తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్ ‘కట్’కట
సాక్షి, నెట్వర్క్: భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు ఆయా బంకుల వాస్తవ కోటాకు కోత వేయడంతోపాటు క్రెడిట్ సదుపాయాన్ని రద్దుచేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులు వారంలో నాలుగు రోజులపాటు నో స్టాక్ బోర్డులు తగిలించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కొరత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకుల్లోనే తలెత్తుతుండటంతో ఆయా డీలర్లు లబోదిబోమంటున్నారు. క్రెడిట్ విధానం రద్దు చేయటంతో వారు నగదు చెల్లించి బుక్ చేసిన ట్యాంకర్లను సైతం నాలుగైదు రోజులు ఆలస్యంగా పంపుతున్నారు. అలాగే, వారి కోటాలో 50 నుంచి 75 శాతమే సరఫరా చేస్తుండటంతో డీలర్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. త్వరలో వ్యవసాయ, విద్యా సంవత్సరాలు ప్రారంభమవుతున్న సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సాధారణ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బంక్‌ల నిర్వహణ కష్టంగా మారుతోందని డీలర్లే స్వచ్ఛందంగా బంకులు బంద్ చేసుకుంటున్నారు. కోటాకు కోతలొద్దు గత వారం రోజులుగా రేషనింగ్ విధానంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే పలు బంకులు మూతపడే స్థాయికి చేరాయి. క్రెడిట్ విధానం లేదంటున్న కంపెనీలు నగదు చెల్లించిన వారికి సైతం పూర్తి కోటాను ఇవ్వడం లేదు. వెంటనే పూర్తి కోటా కేటాయించి, డీలర్ల కమీషన్ సైతం పెంచాలి. – అమరేందర్రెడ్ది, రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు, హైదరాబాద్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు వినియోగదారుల కోటాకు కత్తెర వేస్తున్నాయి. దీంతో సరిపడా స్టాక్ లేక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలి. – దినేష్‌రెడ్డి, డీలర్స్ అసోసియేషన్, నిజామాబాద్ సరిపడా సరఫరా లేదు గతంలో క్రెడిట్‌పై ఇండెంట్ పెట్టినా డిపోల నుంచి ఇంధన ట్యాంకర్లు పంపేవారు. ఇప్పుడు డబ్బులు కట్టినా పూర్తి కోటా ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో డీజిల్‌పై రూ.26, పెట్రోల్‌పై రూ.8 భారం పడుతోందని ఒక్కో సేల్స్ ఆఫీసర్ కోటా పరిధిలో సగానికి చేశారు. బల్క్ సరఫరా కూడా బంక్‌ల నుంచే జరుగుతుండటంతో మరింత కొరత ఏర్పడింది. – పొన్నాల వినయ్, డీలర్, బీపీసీఎల్, క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా -
ప్రైవేటీకరణలో బీపీసీఎల్, కేంద్రం కీలక నిర్ణయం!
పెట్టుబడి దారుల్ని ఆకర్షించడంలో భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బీపీసీఎల్)విఫలమైంది. అందుకే భారత్ పెట్రోలియంలో పావు భాగాన్ని అమ్మేందుకే కేంద్రం మొగ్గుచూపుతుందంటూ కేంద్రానికి చెందిన ఇద్దరు కీలక అధికారులు చెప్పారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చాయి. కేంద్రం బీపీసీఎల్ మొత్తం 52.98శాతం వాటా అమ్మాలని భావించింది. బిడ్లను ఆహ్వానించింది. అయితే ఈ బిడ్లలో ఊహించిన దానికంటే ధర తక్కువ పలికింది. దీంతో కేంద్రం ముందస్తు అమ్మాలనుకున్న వాటా కంటే 20శాతం నుంచి 25శాతం వాటా అమ్మే ప్రక్రియను కేంద్రం పరిశిలిస్తోందని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు. నత్తనడకనే.. బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి పెద్దగా పురోగతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి.చాలా వరకు బిడ్డర్లు ఈ డీల్‌కు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు తగిన భాగస్వాములను ఎంపిక చేసుకోలేకపోయినట్టు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణానికి తోడు.. ఇంధన మార్కెట్లలోని ఆటుపోట్లను కారణంగా పేర్కొంటున్నాయి. పైగా విక్రయానికి సంబంధించి ఎన్నో అంశాలపై సందేహాల నివృత్తికి సమయం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసక్తి కలిగిన బిడ్డర్లు బీపీసీఎల్‌కు సంబంధించి ఆర్థిక డేటాను గతేడాది ఏప్రిల్‌లనే పొందినట్టు వెల్లడించాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఆయా అంశాలపై చర్చలకు చాలా సమయం పట్టినట్టు వివరించాయి. కరోనా రాక ముందు వరకు అంటే 2020 ఫిబ్రవరి నాటికి బీపీసీఎల్‌ను ఎయిర్ ఇండియా కంటే ముందే విక్రయించగలమన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఎయిర్ఇండియా తీవ్ర నష్టాల్లో నడుస్తుంటే.. బీపీసీఎల్ లాభాల వర్షం కురిపిస్తున్న కంపెనీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయగా దిగ్గజ ఇంధనరంగ కంపెనీలకు అదిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల మార్గం అవుతుందని అభిప్రాయపడింది. కానీ కరోనా రాకతో అవన్నీ తారుమారయ్యాయి. అధిక వ్యయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున.. ఒకవైపు పన్నుల రూపంలో ఆదాయం పెరిగినా కానీ, పెట్టుబడుల ఉపంసంహరణ రూపంలో ఆదాయానికి తొర్ర పడితే జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 6.8 శాతాన్ని ఎలా అధిగమించగలదో చూడాల్సి ఉంది. -
ఢిల్లీలో జియో-బీపీ ఈవీ చార్జింగ్ హబ్!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ సంస్థలు సంయుక్తంగా దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ హబ్‌ను ఢిల్లీలో ప్రారంభించాయి. ఈ రెండు సంస్థలు జాయింట్ వెంచర్ ‘రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్’ (జియో బీపీ) కింద దేశంలో ఇంధనాల రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తుండడం తెలిసిందే. ఫ్యూయల్ స్టేషన్లలోనే(పెట్రోల్ బంక్‌లు) ఈవీ చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలను కల్పించాలన్నది వీటి ప్రణాళికగా ఉంది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో అతిపెద్ద చార్జింగ్ కేంద్రాన్ని ప్రారంభించినట్టు ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు తొలి మొబిలిటీ స్టేషన్‌ను నవీముంబైలోని నవడే వద్ద గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించడం గమనార్హం. అప్పటి నుంచి నెట్‌వర్క్‌ను పెంచుకునే పనిలో ఉన్నాయి. రిలయన్స్ బీపీ మొబిలిటీలో రిలయన్స్‌కు 51 శాతం, బీపీకి 49 శాతం చొప్పున వాటాలున్నాయి. 1,448 పెట్రోల్ పంపులు ఈ సంస్థ నిర్వహణలో ఉన్నాయి. (చదవండి: టీసీఎస్ సంచలనం.. ప్రపంచంలోనే 2వ స్థానంలో..!) -
బీపీసీఎల్- ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్‌తో రివార్డ్ పాయింట్స్
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్.. ఎస్బీఐ కార్డ్ సంయుక్తంగా రూపే ఆధారిత కాంటాక్ట్‌లెస్ క్రెడిట్‌కార్డ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇది కో బ్రాండెడ్ క్రెడిట్‌కార్డ్. ఈ కార్డ్‌తో బీపీసీఎల్ ఇంధన స్టేషన్లలో చేసే చెల్లింపులపై ప్రత్యేక రివార్డులను వినియోగదారులు పొందొచ్చు. బీపీసీఎల్ పెట్రోల్ స్టేషన్లలో ప్రతీ రూ.100 కొనుగోలుపై 13ఎక్స్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఒక శాతం ఫ్యుయల్ సర్చార్జ్ను కూడా రద్దు చేశారు. రూ.4,000 వరకు ఉండే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. -
సగం తగ్గిపోయిన బీపీసీఎల్ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో 48% తగ్గిపోయి రూ.1,218 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.2,357 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.64,133 కోట్ల నుంచి రూ.82,884 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా వ్యయాలు పెరిగిపోవడం ప్రభావం చూపించింది. వ్యయాలు రూ.61,475 కోట్ల నుంచి రూ.81,550 కోట్లకు చేరాయి. స్థూల రిఫైనరీ మార్జిన్ (జీఆర్ఎం) 5.57 డాలర్లకు తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.97 డాలర్లుగా ఉండడం గమనార్హం. -
ముంబైలోని పెట్రోలియం ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
-
మార్చి నాటికి 50% నగదు రహిత విక్రయాలే
భారత్ పెట్రోలియం వెల్లడి ముంబై: ప్రభుత్వరంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే మార్చి నాటికి తమ మొత్తం విక్రయాల్లో 50 శాతం నగదు రహితంగానే జరపాలని భావిస్తున్నాయి. నవంబర్ 8 తర్వాత తమ అవుట్లెట్లలో డిజిటల్ లావాదేవీలు అంతకుముందున్న 10 శాతం నుంచి 26 శాతానికి పెరిగినట్టు బీపీసీఎల్ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ/పీఎన్జీ, ఎల్పీజీ విక్రయాలకు సంబంధించి ఏటా 7.3 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్టు పేర్కొంది. మార్చి చివరి నాటికి అన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ లావాదేవీల్లో 50 శాతానికి పైగా లాయల్టీ కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వ్యాలెట్లు, ఎన్ఈఎఫ్టీ ద్వారా జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు బీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జార్జ్‌పాల్ సోమవారం ఢిల్లీలో తెలిపారు. నగదు రహిత లావాదేవీలను పెంచే లక్ష్యంలో భాగంగా తమ అవుట్లెట్లలో పీఓఎస్ మెషిన్ల ఏర్పాటుకు బీపీసీఎల్... ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర బ్యాంకులతో సోమవారం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే పేటీఎం, ఫ్రీచార్జ్, ఆక్సిజెన్, రిలయన్స్జియో, ఎస్బీఐ బుడ్డీ, ఫినో తదితర మొబైల్ వ్యాలెట్లతోనూ భాగస్వామ్యం ఉన్నట్టు బీపీసీఎల్ వెల్లడించింది. -
పీఎస్ఎల్వీ–సీ 36 ప్రయోగం విజయవంతం
జాతీయం అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం భారత్‌లోనే అతి పెద్ద చమురు శుద్ధి (రిఫైనరీ) కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లు న్యూఢిల్లీలో జరిగిన పెట్రోటెక్ సదస్సులో డిసెంబర్ 7న సంతకాలు చేశాయి. ఈ రిఫైనరీని ఐఓసీ నాయకత్వంలోని కన్సార్షియం పశ్చిమ తీరంలో (మహారాష్ట్ర) 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) వ్యయంతో, 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మిస్తోంది. ఇందులో ఐవోసీ వాటా 50 శాతం. కాగా.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ చెరో 25 శాతం వాటాలను కలిగున్నాయి. భారత్, వియత్నాం మధ్య కుదిరిన అణు ఒప్పందం వియత్నాం జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు ఎన్‌గాయోన్ దచిన్‌గాన్ భారత్lపర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో డిసెంబర్ 9న పౌర అణు సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దీంతోపాటు వైమానిక సంబంధాల్ని పెంచుకోవడం, ఇంధన రంగంలో ఉమ్మడి కృషి, పార్లమెంటరీ సహకారానికి సంబంధించి మరో మూడు ఇతర ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాల్గొన్నారు. ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్‌కు 7వ స్థానం ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) 2015 సంవత్సరానికి ఉగ్రవాద ప్రభావిత దేశాల సూచీని డిసెంబర్ 8న విడుదల చేసింది. ఇందులో ఇరాక్ మొదటి స్థానంలో నిలవగా, భారత్ 7వ స్థానంలో ఉంది. ఉగ్రవాదానికి అత్యధికంగా ప్రభావితం అవుతున్న మొదటి 10 దేశాల్లో ఆరు దేశాలు ఆసియాకు చెందినవే. ప్రపంచంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 20 శాతం ఇరాక్‌లోనే జరగ్గా, భారత్‌లో 7 శాతం, అఫ్గానిస్తాన్‌లో 14 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం దాడులు జరిగాయి. ఇండోనేసియా అధ్యక్షుడి భారత్ పర్యటన ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 12న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. చర్చల్లో భాగంగా రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయం అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా భారత్ భారత్‌ను అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తించే బిల్లుకు ఆ దేశ సెనేట్ ఆమోదం లభించింది. సెనేట్‌లో డిసెంబర్ 8న జరిగిన ఓటింగ్‌లో 92–7 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై సంతకం చేస్తే ఒప్పందం అధికారికంగా కార్యరూపం దాల్చుతుంది. వెనెజువెలాలో పెద్ద నోట్ల రద్దు వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్ అయిన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ డిసెంబర్ 12న అత్యవసర జారీ చేశారు. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్‌పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్. భూకంపంతో ఇండోనేసియాలో 100 మందికి పైగా మృతి ఇండోనేసియాలోని అసె ప్రావిన్స్ (ఉత్తర సుమత్రా దీవులు)లో డిసెంబర్ 7న భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా, మరో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి ఇళ్లు, మసీదులు, దుకాణాలు కూలిపోయాయి. వాహనాలు ఒకదాని కింద ఒకటి ఇరుక్కుపోయాయి. 33 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపించింది. కఫాలాను రద్దు చేసిన ఖతార్ ఆధునిక బానిసత్వంగా భావించే కఫాలా పని వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలని ఖతార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 13 నుంచి అమల్లోకి తేనున్నట్లు ఖతార్ కార్మిక శాఖ మంత్రి ఇసా బిన్ సాద్ అల్ జఫాలి ప్రకటించారు. వార్తల్లో వ్యక్తులు నూతన సీజేఐగా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం 2017, జనవరి 3తో ముగియనుంది. 2017, జనవరి 4నlజస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఈ పదవిలో దాదాపు 8 నెలల పాటు (ఆగస్టు 27, 2017 వరకు) కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిక్కు వ్యక్తి జస్టిస్ ఖేహర్. సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి కన్నుమూత ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి (82) డిసెంబర్ 6న చెన్నైలో మరణించారు. ఆయన తుగ్లక్ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తుగ్లక్ పత్రికకు సంపాదకుడిగా, 1999–2005 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. రామస్వామి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా బెర్నార్డ్ కజెనెవ్: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బెర్నార్డ్ కజెనెవ్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాని మాన్యుయెల్ వాల్స్ రాజీనామా చేయడంతో.. బెర్నార్డ్‌ను ఆ పదవిలో నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ డిసెంబర్ 6న ప్రకటించారు. రెండున్నరేళ్లపాటు ఫ్రాన్స్ ప్రధానిగా కొనసాగిన వాల్స్.. వచ్చే ఏడాది సోషలిస్ట్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ డొనాల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను డిసెంబర్ 7న టైమ్ మ్యాగజీన్ 2016 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ఇందులో తొలి రన్నరప్‌గా హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్‌గా ఆన్లైన్ హ్యాకర్లు నిలిచారు. ఈ గౌరవానికి సంబంధించి బరిలో నిలిచిన తుది 11 మందిలో భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. ఇటలీ ప్రధానిగా జెంటిలోని: డెమోక్రటిక్ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్ 11న ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రధాని పదవికి మతియో రెంజి రాజీనామా చేయడంతో జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. n న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్ డిసెంబర్ 12న వెల్లింగ్టన్లో ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్ కీ రాజీనామా చేయడంతో బిల్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అమెరికా వ్యోమగామి జాన్ గ్లెన్ మృతి: భూమిని చుట్టి వచ్చిన తొలి అమెరికన్‌గా, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వృద్ధుడిగా రికార్డు సృష్టించిన ప్రముఖ వ్యోమగామి సెన్ జాన్ గ్లెన్ (95) ఓహాయోలో డిసెంబర్ 8న మరణించారు. ఐరాస సెక్రటరీ జనరల్‌గా గ్యుటెరస్ ప్రమాణస్వీకారం ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియనుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పీఎస్ఎల్వీ–సీ 36 ప్రయోగం విజయవంతం∙ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 7న చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–36 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్‌శాట్–2ఏను కక్ష్యలోకి పంపారు. మన దేశం ప్రయోగించిన రిసోర్స్‌శాట్ ఉపగ్రహాల్లో ఇది మూడోది. రిసోర్స్‌శాట్–2 జీవిత కాలం ముగుస్తుండటంతో దాని స్థానంలో 1235 కిలోల బరువు గల రిసోర్స్‌శాట్–2ఏను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం పంటల విస్తీర్ణం, దిగుబడులు, తెగుళ్లు, కరువు ప్రభావాలపై సమాచారం అందిస్తుంది. జల వనరులు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాలకు కూడా తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 38వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎత్తు 44.4 మీటర్లు. బరువు 321 టన్నులు. ఇస్రో 1994 నుంచి 2016 వరకు పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా 121 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో మన దేశానికి చెందినవి 42 కాగా, విదేశాలకు చెందినవి 79 ఉన్నాయి. వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా వాతావరణ ఉపగ్రహం ఫెంగ్యున్–4ను చైనా డిసెంబర్ 10న విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని లాంగ్ మార్చ్–3బీ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ద్వారా ఆ దేశ వాతావరణ పరిశీలనల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. క్రీడలు కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కోహ్లి: భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు (235) చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తాజాగా ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్ న్యూజిలాండ్‌పై 217 పరుగులు, 1978లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై 205 పరుగులు చేశారు. సింగపూర్ స్లామర్స్‌కు ఐపీటీఎల్– 2016 టైటిల్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)– 2016 టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ సింగపూర్ స్లామర్స్ నిలబెట్టుకుంది. హైదరాబాద్‌లో డిసెంబర్ 11న జరిగిన ఫైనల్లో ఇండియన్ ఏసెస్ జట్టును ఓడించింది. n పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్: భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బెంగళూరులో డిసెంబర్ 12న జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)పై గెలుపొందాడు. -
ఇక పెట్రోనెట్ గ్యాస్ బంకులు
ఎల్ఎన్జీ అవుట్లెట్ల ఏర్పాటుకు ఓఎంసీలతో సంప్రదింపులు ఐఓసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం బంకుల్లో డిస్పెన్సర్లు సొంత బంకుల ఏర్పాటుకూ చర్యలు ఎల్ఎన్జీ బస్సుల కోసం వాహన సంస్థలతో చర్చలు న్యూఢిల్లీ: ద్రవీకృత గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రోనెట్ ఎల్ఎన్జీ... తాజాగా రిటైల్ విభాగంలోకి ప్రవేశించనుంది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా కనీసం 1,000 రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఎల్ఎన్జీ విక్రయించాలని యోచిస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) రిటైల్ బంకులను కూడా ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రతిపాదనల ప్రకారం ఓఎంసీల రిటైల్ బంకుల్లో పెట్రోనెట్ తమ ఎల్ఎన్జీ డిస్పెన్సర్స్‌ను ఏర్పాటు చేయనుంది. సొంతంగా కొన్ని అవుట్‌లెట్స్‌ను నిర్వహించనుంది. చమురు శాఖ అనుమతులు వస్తే అవుట్‌లెట్స్ ద్వారా ఎల్ఎన్జీని విక్రయిం చేందుకు పెట్రోనెట్‌కు మార్గం సుగమం కానుంది. వాహనాల్లో పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్న దరిమిలా పెట్రోనెట్ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే కేరళలో ఎల్ఎన్జీపై నడిచే బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాటా, అశోక్ లేల్యాండ్‌తో చర్చలు.. : ఓఎంసీల బంకుల్లో ద్రవీకృత గ్యాస్ విక్రరుుంచాలని యోచిస్తున్న పెట్రోనెట్.. అటు ఎల్ఎన్జీతో నడిచే బస్సులను ప్రవేశపెట్టడంపై టాటా మోటార్స్, అశోక్ లేల్యాండ్ వంటి ఆటోమొబైల్ సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. దేశీయంగా ఏటా రోడ్లపైకి వచ్చే కనీసం 2,00,000 పైచిలుకు వాహనాలను ఎల్ఎన్జీతోనే నడిపే వీలుందని పెట్రోనెట్ ఎల్ఎన్జీ సీఈవో ప్రభాత్ సింగ్ చెప్పారు. ఇతరత్రా ఇంధనాలతో పోలిస్తే దీనివల్ల ధరలపరంగా 30-40 శాతం మేర ప్రయోజనం ఉండగలదన్నారు. పారిస్ ఒడంబడిక ప్రకారం 2030 నాటికల్లా కార్బన్ ఉద్గారాలను 33-35% మేర తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించింది. ఇంత పెద్ద ఎత్తున వాహనాలను ఎల్ఎన్జీ వైపు మళ్లిస్తే నిర్దేశిత లక్ష్యంలో కనీసం 2.5 శాతం సాధించవచ్చని ప్రభాత్ సింగ్ తెలిపారు. ప్రాథమికంగా రిటైల్ అవుట్‌లెట్స్‌లో విక్రయాల ద్వారా సుమారు 1,50,000 పైచిలుకు ఎల్ఎన్జీ ట్రక్కులకు ఇంధనం సరఫరా చేయాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఇంధన పరిమాణం 0.5-1.5 మిలియన్ టన్నుల మేర ఉంటుందని వివరించారు. నాలుగేళ్లలో గ్యాస్ వాటా 15%! కాలుష్యకారక వాయువులను నియంత్రించేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా ఇంధన వినియోగంలో సుమారు 6.5 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను మూడు, నాలుగేళ్లలో 15 శాతానికి పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఏటా భారత్ 78 మిలియన్ టన్నుల మేర డీజిల్‌ను వినియోగిస్తుండగా, ఇందులో ట్రక్కులు.. బస్సుల వాటా 28 మిలియన్ టన్నుల మేర ఉంటుందని పెట్రోనెట్ అంచనా. ప్రస్తుతం ఏటా 21.3 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్న భారత్ 2022 నాటికి 50 ఎంటీపీఏకి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే తూర్పు తీరంలో మూడు ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడతో పాటు తమిళనాడులోని ఎన్నూర్, ఒరిస్సాలోని ధమ్రా పోర్టుల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. -
6% పెరగనున్న పెట్రోలియం వినియోగం!
2017-18పై మూడీస్ అంచనా న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్- 2018 మార్చి) 6 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. చైనాలో ఈ రేటు 3 శాతమే ఉంటుందని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. -
అనిరుధ్ సెంచరీ వృథా
వడోదర: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు తొలి మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏడు వికెట్ల తేడాతో ఎస్‌బీహెచ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా ఎస్బీహెచ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనిరుధ్ సింగ్ (128 బంతుల్లో 110; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీ సాధించగా, మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. బీపీసీఎల్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బీపీసీఎల్ 44.5 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఉదయ్ కౌల్ (122 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), సూర్య కుమార్ యాదవ్ (69 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అహ్మదాబాద్‌లో జరిగిన మరోమ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ ఐదు వికెట్ల తేడాతో కెమ్‌ప్లాస్ట్ చేతిలో ఓడిపోయింది. ఆంధ్రాబ్యాంక్ 44.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అమోల్ షిండే 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెమ్‌ప్లాస్ట్ 36.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. -
చమురు కంపెనీలకు రూ. 17 వేల కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) తదితర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం రూ. 17,772 కోట్ల నగదు సబ్సిడీని గురువారం మంజూరు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఉత్పత్తులను మార్కెట్ రేటు కన్నా తక్కువగా విక్రయించినందు వల్ల ఎదురైన ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు చమురు కంపెనీలకు ఇది ఉపయోగపడనుంది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు విక్రయించడం వల్ల మూడు ప్రభుత్వ రంగ సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), ఐవోసీ సుమారు రూ. 35,328 కోట్ల ఆదాయాలను నష్టపోవాల్సి వచ్చింది. ఇందులో సుమారు రూ. 16,730 కోట్లను చమురు ఉత్పత్తి సంస్థలు ఓఎన్జీసీ, గెయిల్ సమకూరుస్తుండగా.. మిగతాది కేంద్రం నగదు సబ్సిడీ కింద అందిస్తోంది. రూ. 8,772 కోట్ల సబ్సిడీని బుధవారమే ఆమోదించిన ఆర్థిక శాఖ, గురువారం మరో రూ. 9,000 కోట్లను ఆమోదించిందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.