న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ సంస్థలు సంయుక్తంగా దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ హబ్‌ను ఢిల్లీలో ప్రారంభించాయి. ఈ రెండు సంస్థలు జాయింట్ వెంచర్ ‘రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్’ (జియో బీపీ) కింద దేశంలో ఇంధనాల రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తుండడం తెలిసిందే. ఫ్యూయల్ స్టేషన్లలోనే(పెట్రోల్ బంక్‌లు) ఈవీ చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలను కల్పించాలన్నది వీటి ప్రణాళికగా ఉంది.
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో అతిపెద్ద చార్జింగ్ కేంద్రాన్ని ప్రారంభించినట్టు ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు తొలి మొబిలిటీ స్టేషన్‌ను నవీముంబైలోని నవడే వద్ద గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించడం గమనార్హం. అప్పటి నుంచి నెట్‌వర్క్‌ను పెంచుకునే పనిలో ఉన్నాయి. రిలయన్స్ బీపీ మొబిలిటీలో రిలయన్స్‌కు 51 శాతం, బీపీకి 49 శాతం చొప్పున వాటాలున్నాయి. 1,448 పెట్రోల్ పంపులు ఈ సంస్థ నిర్వహణలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment