సగం తగ్గిపోయిన బీపీసీఎల్‌ లాభం | 1218 Crore In July-September, Misses Analysts' Estimates | Sakshi
Sakshi News home page

సగం తగ్గిపోయిన బీపీసీఎల్‌ లాభం

Oct 30 2018 12:45 AM | Updated on Oct 30 2018 12:45 AM

1218 Crore In July-September, Misses Analysts' Estimates - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌) నికర లాభం సెప్టెంబర్‌ క్వార్టర్లో 48% తగ్గిపోయి రూ.1,218 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.2,357 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.64,133 కోట్ల నుంచి రూ.82,884 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా వ్యయాలు పెరిగిపోవడం ప్రభావం చూపించింది. వ్యయాలు రూ.61,475 కోట్ల నుంచి రూ.81,550 కోట్లకు  చేరాయి. స్థూల రిఫైనరీ మార్జిన్‌ (జీఆర్‌ఎం) 5.57 డాలర్లకు తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.97 డాలర్లుగా ఉండడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement