ఆర్థిక మంత్రి నిర్మల వ్యాఖ్యలు
ప్లాట్‌ఫాం టికెట్లకు ఇక నో జీఎస్టీ
పలు రైల్వే సేవలపై కూడా సోలార్ కుక్కర్లు, పాల క్యాన్లపై 12 శాతం
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: ప్లాట్‌ఫాం టికెట్లకు ఇకపై జీఎస్టీ ఉండబోదు. వాటితో పాటు రిటైరింగ్ రూములు, వెయిటింగ్ రూములు, క్లోక్ రూములు, ప్లాట్‌ఫాంలపై బ్యాటరీ వాహనాలు తదితర రైల్వే సేవలపై కూడా జీఎస్టీ తొలగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా ఈ సందర్భంగా నిర్మల చర్చలు జరిపారు.
కేంద్రం ఇచ్చే 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల పథకం ప్రయోజనాలను రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశమని ఆమె పునరుద్ఘాటించారు. ‘‘అందుకు అంగీకరించాల్సింది ఇక రాష్ట్రాలే. అవి ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి పెట్రోల్, డీజిల్‌పై ఎంత శాతం జీఎస్టీ వేయాలో నిర్ణయించుకుని కౌన్సిల్‌కు తెలపాలి’’ అని భేటీ అనంతరం నిర్మల మీడియాతో అన్నారు.
‘‘ఇన్‌పుట్ క్రెడిట్ పన్నులో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయం జరిగింది. ఇన్‌వాయిసింగ్ తదితరాల్లో అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఇకపై దేశవ్యాప్తంగా బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తున్నాం. జీఎస్టీ చెల్లింపు తుది గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30కి పొడిగించాం. తద్వారా వర్తలకులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థలు, పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది’’ అని మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు...
→ అన్ని రకాల సోలార్ కుక్కర్లపై ఇకనుంచి 12 శాతం జీఎస్టీ
→ అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. జమ్మూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల పళ్ల వ్యాపారులకు ప్రయోజనం.
→ స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు.
→ విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా బయట ఉండే విద్యార్థులకు నెలకు రూ.20 వేల దాకా దాకా జీఎస్టీ మినహాయింపు
→ స్టీల్, అల్యుమినియం, ఇనుప పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ.
→ జీఎస్టీ ఎగవేత తదితర ఉదంతాల్లో జరిమానాలపై వడ్డీ ఎత్తివేత.
Comments
Please login to add a commentAdd a comment