ఢిల్లీ: రాబోయే 2024-25 పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నకల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కేంద్రబడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.
నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా ఏడో బడ్జెట్. వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె అధిగమించి చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment