
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వేను కాసేపట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. ప్రభుత్వం కలలుకనే ‘వికసిత్ భారత్’కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని తెలిపారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి బడ్జెట్ 2024-25ను ప్రకటిస్తారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ..‘భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయం. దేశంలోని ప్రజలకు, ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరుచుకున్న ‘అమృత్‌కాల్’కు ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. ఈ బడ్జెట్ ప్రభుత్వం కలలుకనే ‘వికసిత్ భారత్’కు పునాది వేస్తుంది’ అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment