కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025-26)లో పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుతున్నట్లు గ్రాంట్ థార్టన్ భారత్(Grant Thornton Bharat) ఇటీవల నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సర్వేలో వెల్లడించింది. 500 మందికి పైగా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన వివరాలతో ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సర్వేలో వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
తక్కువ పన్ను రేట్లు: ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం మంది ప్రతివాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అధిక మినహాయింపు పరిమితులు: 25 శాతం పన్ను చెల్లింపుదారులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి అధిక మినహాయింపులు ఆశిస్తున్నారు.
కొత్త పన్ను విధానం: 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికీ, 63 శాతం మంది ఇప్పటికీ పాత విధానంలో ప్రోత్సాహకాలను పెంచాలని కోరుతున్నారు.
నష్టాలు పూడ్చడానికి అనుమతి: కొత్త పన్ను విధానం ప్రకారం ఇంటి ఆస్తి నష్టాలను పూడ్చడానికి అనుమతించాలని 53 శాతం మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే టీ, రూ20కే సమోసా!
చెల్లింపుదారుల మనోభావాలు
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ డిస్పోజబుల్ ఆదాయాన్ని(టాక్స్‌లు చెల్లించిన తర్వాత ఖర్చు చేయడానికి అనువైన డబ్బు) పెంచుకోవడానికి వ్యక్తిగత పన్ను విషయంలో ఉపశమనం పొందాలని చూస్తున్నారు. తక్కువ పన్ను రేట్లు, అధిక మినహాయింపు పరిమితులు కోరుతున్నట్లు సర్వేలోని అంశాల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటే ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడుతుందని ప్రతివాదులు నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment