కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.
గతంలో బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది ఒకప్పుడు ఈ నార్త్ బ్లాక్‌లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.
ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్‌కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.
ఇదీ చదవండి: 1999 తర్వాత బడ్జెట్ టైమ్ ఎందుకు మారిందో తెలుసా?
బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్‌లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్ళందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment