ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా నిర్మలా సీతారామన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీని ప్రకటించింది.
ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు, కౌన్సిల్ సభ్యులు, ఆర్థిక సహాయ మంత్రి, కేంద్ర, రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరవుతున్నారు.
అంతకుముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2023 అక్టోబర్ 7న జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం సుంకం విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఆ తర్వాత మార్చి జీఎస్టీ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై విధించిన 28 శాతం పన్ను సమీక్షను కౌన్సిల్ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment