కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులు | budget includes funds for the Council of Ministers and VVIPs | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులు

Published Tue, Jul 23 2024 5:20 PM | Last Updated on Tue, Jul 23 2024 5:19 PM

budget includes funds for the Council of Ministers and VVIPs

కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మంత్రిమండలి, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయ నిర్వహణ, ఇతర ఖర్చుల జాబితాను విడుదల చేశారు. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .1,248.91 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు. ఇది 2023-24లో కేటాయించిన రూ.1,803.01 కోట్ల కంటే తక్కువ.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రకటించిన పద్దుల పత్రాల్లో మంత్రి మండలి ఖర్చుల వివరాలను తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మంత్రి మండలి ఖర్చుల కోసం మొత్తం రూ.828.36 కోట్లు కేటాయించారు. 2023-24లో ఇది రూ.1,289.28 కోట్లుగా ఉంది. కేబినెట్ మంత్రులు, మాజీ ప్రధాన మంత్రుల జీతాలు, ఇతర అలవెన్సులు ప్రయాణాల ఖర్చుల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు.

జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు రూ.202.10 కోట్లు ఇచ్చారు. 2023-24లో ఇది రూ.299.30 కోట్లుగా ఉంది. ఈ మొత్తం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయానికి (2023-24లో రూ.76.20 కోట్లు) మొత్తం రూ.72.11 కోట్లు అందించారు. ఈ కార్యాలయంతోపాటు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం ఈ నిధులను వాడుకుంటారు.

కేంద్ర బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (సీడబ్ల్యూసీ) పరిపాలనా ఖర్చుల కోసం 2023-24లో రూ.70.28 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.75.24 కోట్లు ఇచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం పరిపాలనా ఖర్చుల కోసం రూ.65.30 కోట్లు (2023-24లో రూ. 62.65 కోట్లు) కేటాయించారు. మాజీ గవర్నర్‌లకు సచివాలయ సహాయం చెల్లింపుల కోసం బడ్జెట్‌లో రూ.1.80 కోట్లు (2023-24లో రూ.1.30 కోట్లు) కేటాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement